తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ విడుదల | Tirumala Darshanam Tickets For September Month Hindu Temples Guide
ఓం నమో వేంకటేశాయ .. తిరుమల దర్శనం టికెట్స్ సెప్టెంబర్ నెలకు మొదటి గడప దర్శనం , ఆర్జిత సేవ లు కళ్యాణం ఉంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ పాటు ఆన్ లైన్ సేవ టికెట్స్ అంగ ప్రదక్షిణ టికెట్స్ విడుదల చేస్తున్నారు. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
మొదటి గడప దర్శనం టికెట్స్ లక్కీ డ్రా టికెట్స్ మొదటి గడప దర్శనం లో సుప్రభాతం , తోమాల , అర్చన , అష్టదళ పాదపద్మారాధన సేవలు ఉంటాయి . టికెట్ ధర లు వరుసగా సుప్రభాతం 120/- , తోమాల 220/-, అర్చన 220/- , అష్టదళ పాదపద్మారాధన సేవ 1250 రూపాయలు. ఆగస్టు నెల వరకు టికెట్స్ బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ 19వ తేదీన విడుదల చేస్తున్నారు . అందరూ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీలుగా జూన్ 19వ తేదీఉదయం 10 గంటల నుంచి 21 వ తేదీ ఉదయం 10 గంటల వరకు సమయం ఇస్తారు . 21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు.
ఆర్జిత సేవ లు :
ఆర్జిత సేవలలో కళ్యాణం ఉంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు ఉంటాయి . వీటి ధరలు వరుసగా కళ్యాణం టికెట్ ఇద్దరికీ 1000/- , మిగిలిన సేవ టికెట్స్ ఒక్కొక్కరికి 500/- . కళ్యాణం మరియు ఉంజల్ సేవ ఈ రెండు స్వామి ఆలయం లోపల జరుగుతాయి . ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ ఆలయం బయట జరుగుతాయి . ఈ సేవ టికెట్ లు సెప్టెంబర్ నెలకు గాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు . ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి సేవ అయినతరువాత దర్శనం ఉంటుంది.
ఆన్ లైన్ ఆర్జిత సేవలు :
సెప్టెంబర్ నెలకు గాను ఆన్ లైన్ ఆర్జిత సేవ టికెట్స్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారు . ఈ టికెట్స్ బుక్ చేసినవారికి సేవ ఉండదు దర్శనం మాత్రమే ఉంటుంది .
అంగ ప్రదక్షిణ టికెట్స్ :
అంగ ప్రదక్షిణ టికెట్స్ ఉచితంగా టీటీడీ వారు ఇస్తున్నారు . ఈ సేవ టికెట్స్ ఇంతకూ ముందు కొండపైన ఇచ్చేవారు ఇప్పుడు ఆన్ లైన్ లో మాత్రమే ఇస్తున్నారు . ఆగస్టు వరకు బుక్ అయ్యాయి సెప్టెంబర్ నెలకు గాను జూన్ 23వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేస్తున్నారు .
ఇవి కూడా చదవండి :
>> తిరుమల 500/- దర్శనం టికెట్ వివరాలు / ఆన్లైన్ సేవ టికెట్ గురించి పూర్తీ సమాచారం
>> తిరుమల 10 వేల రూపాయల శ్రీవాణి టికెట్ గురించి పూర్తీ వివరాలు
>> తిరుమల నడిచి వెళ్తున్నారా ముందుగా ఈ విషయం తెలుసుకోండి వీరికి టికెట్స్ ఇవ్వడం లేదు
>> అరుణాచలం మొదటి సారి వెళ్తున్నారా మీకోసం పూర్తీ సమాచారం
తిరుమల,TIRUMALA, Tirumala Darshanam Tickets, tirumal breaking news, tirumala arjitha seva tickets, suprabhatam tickets details.
Comments
Post a Comment