తిరుమల 300/- టికెట్ బుక్ చేసే ముందు కొత్త రూల్స్ తెలుసుకోండి | Tirumala 300 Special Darshan New Rules Temples Guide
1) 300 రూపాయల దర్శనం టికెట్లు ఎక్కడ లభిస్తాయి?
A) 300 రూపాయల దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయి
2) 300 రూపాయల దర్శనం టికెట్లు తిరుపతి, తిరుమలలో లభిస్తాయా ?
A) 300 రూపాయల దర్శనం టికెట్లు తిరుపతి తిరుమల లో లభించవు
3) 300 రూపాయల దర్శనం టికెట్లు కోసం ఒక ఐడి మీద ఎంతమందికి బుక్ చేయవచ్చు
A)300 రూపాయల టికెట్ల కోసం ఒక ఐడి మీద ఆరుగురు మంది బుక్ చేయవచ్చు
4) చిన్నపిల్లలకు 300 రూపాయల టికెట్లు తీయాలా ?
A) 12 సంవత్సరముల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు
5) 300 రూపాయల టిక్కెట్టు వేరే తేదీకి మార్చుకొనవచ్చా?
A) 300 రూపాయల టిక్కెట్టు వేరే తేదీకి మార్చుకోలేమండి
6) 300 రూపాయల టిక్కెట్టు క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ వస్తుందా ?
A) 300 రూపాయల టికెట్ క్యాన్సిల్ ఆప్షన్ అనేది ఉండదండి రిఫండ్ రాదు
7) 300 రూపాయల టికెట్లో మా బంధువులు రావట్లేదు ఆ ప్లేస్ లో వేరే వ్యక్తిని తీసుకు వెళ్ళవచ్చా?
A) 300 రూపాయలకి ఒక వ్యక్తి ప్లేస్ లో మరొక వ్యక్తిని తీసుకువెళ్లడానికి కుదరదు
8) మేము 10 మంది ఉన్నాము 300 రూపాయలు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
A) మీరు రెండు మొబైల్స్ నుంచి ట్రై చేస్తే 6 +4 చొప్పున బుక్ చేసుకోవచ్చు
9) 300 రూపాయల దర్శనానికి సాంప్రదాయ దుస్తులు ధరించాలా ?
A) అవునండి 300 రూపాయల దర్శనానికి సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలి
10) 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనము ఎంత సమయం పడుతుంది?
A) 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు నుంచి మూడు గంటలు పడుతుందండి అదే ముఖ్యమైన తేదీలు అయితే ఇంకొంచెం ఎక్కువ సమయం పడుతుంది
11) ఒకసారి 300 రూపాయలు దర్శనం చేసుకున్నాక మరి మళ్ళీ తిరిగి 300 రూపాయలు దర్శనం ఎప్పుడు చేసుకోవచ్చు ?
A) ఒకసారి 300 దర్శనం చేసుకున్నాక మళ్లీ మీరు దర్శనం చేసుకోవాలంటే ఒక నెల గ్యాప్ ఉండాలి అండి 30 రోజులు గ్యాప్ ఉండాలి
12) 300 రూపాయల దర్శనం టికెట్ వాటర్ ఐడి కార్డుతో బుక్ చేసుకోవచ్చా ?
A) 300 రూపాయల దర్శనం టికెట్లు కేవలం ఆధార్ కార్డు ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలండి ఎన్ఆర్ఐ కి పాస్పోర్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు
13) ఎమ్మెల్యే గారి లెటర్ మీద 300 దర్శనం టికెట్లు ఇస్తారా?
A)ఇస్తారండి ఎమ్మెల్యే గారు లెటర్ ద్వారా 300 దర్శనం టికెట్లు ఇస్తారు
ప్రశ్నలు జవాబులు రాసింది హిందూ టెంపుల్స్ గైడ్ అడ్మిన్ పరవాడ శ్రీనివాసరావు గారు తెనాలి
ఇవి కూడా చూడండి ఏ సమాచారం కావాలో క్లిక్ చేయండి :
>>శ్రీవాణి టికెట్ గురించి తెలుగుకోండి
>>మొదటి గడప దర్శనం గురించి తెలుసుకోండి
>> తిరుమల ఆన్ లైన్ సేవల గురించి తెలుగుకోండి
Comments
Post a Comment