తిరుమల అంగ ప్రదక్షిణ టికెట్స్ విడుదల తేదీ మరియు రూల్స్ బుకింగ్ విధానం Tirumala Anga Pradakshina Rules Booking process
తిరుమల అంగ ప్రదక్షిణ టికెట్స్ అక్టోబర్ నెలకు జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు.
అంగ ప్రదక్షిణ టికెట్స్ ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇంతకు ముందు కొండపైన cro ఆఫీసు దగ్గర ఇచ్చేవారు ఇప్పటికీ చాలా మందికి ఈ విషయం తెలియక కొండపైన ఇస్తున్నారని అనుకుంటున్నారు. ప్రస్తుతం సెప్టంబర్ వరకు బుక్ అయ్యాయి. జూలై 24న తేదీ అనగా సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు
2 నిముషాల్లో నే టికెట్స్ అవుతున్నాయి
తిరుమల టికెట్స్ లలో చాలా త్వరగా బుక్ అయ్యే టికెట్స్ లలో మొదటి స్థానం అంగ ప్రదక్షిణ టికెట్స్ దే . నెల రోజుల టికెట్స్ కేవలం 2 ని లలో బుక్ అవుతున్నాయి. ఈ టికెట్స్ ఫ్రీ గా ఇవ్వడం పేమెంట్ ఆప్షన్ లేక పోవడం తో భక్తులు తమ వివరాలు ఇచ్చి కావల్సిన తేదీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే టికెట్ బుక్ అవుతుంది
Comments
Post a Comment