తిరుమల వెళ్లేవారు కొత్తగా మార్చిన రూల్స్ తెలుసుకోండి | Tirumala Darshan New Rules Questions and Answers
హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు నమస్కారం..
*తిరుమల గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు*
👤 సీనియర్ సిటిజెన్ వయస్సు ఎంత ఉండాలి?
👨🏻💻 65 సంవత్సరాలు, వీరితో పాటు దర్శనానికి తోడుగా వెళ్ళేవారి వయస్సు 50 ఉండాలి.
👤శ్రీవారి సేవ కు బుక్ అయిన వాళ్లలో ఎవరైనా రాకపోతే వేరేవాళ్లని తీసుకుని వెళ్ళవచ్చా?
👨🏻💻 ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎంత మంది ఉంటే అంత మందే వెళ్ళాలి. కొత్త వారిని తీసుకుని వెళ్ళకూడదు.
👤అంగప్రదక్షిణ టికెట్ తీసుకుంటే మొదటి గడప దర్శనం ఉంటుందా?
👨🏻💻ఉండదు. జయ విజయుల దగ్గర నుంచే దర్శనం ఉంటుంది.
👤రూమ్ బుక్ చేసుకోక పోతే కొండపైన ఎక్కడ ఇస్తారు? కొండ క్రింద ఎక్కడ ఇస్తారు?
👨🏻💻 కొండపైన cro ఆఫీస్ దగ్గర ఇస్తారు. కొండ క్రింద విష్ణు నివాసం లో ఇస్తారు.
👤 సుప్రభాత సేవ కు సెలెక్ట్ అయినవారు 12 సంవత్సరాలు లోపు వారిని తీసుకుని వెళ్ళవచ్చా?
👨🏻💻 తీసుకుని వెళ్ళవచ్చు.
👤తిరుమలలో రూమ్ 2 రోజులకి ఇస్తారా?
👨🏻💻24 గంటలు మాత్రమే ఇస్తారు
👤శ్రీవారి సేవ ఎన్ని రోజులు ఉంటుంది? వయస్సు ఎంత ఉండాలి?
👨🏻💻7 రోజులు సేవ ఉంటుంది. వయస్సు 18-60 లోపు ఉండాలి. బ్రహ్మోత్సవాల సమయం లో 18-50 లోపు ఉండాలి.
👤 లక్కీ డ్రా లో మొదటి గడప సేవ లు ఏవి?
👨🏻💻 సుప్రభాతం, తోమల, అర్చన, అభిషేకం.
👤300/- టికెట్ బుక్ చేస్తే మరల ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి?
👨🏻💻నెల రోజులు గ్యాప్ ఉండాలి
👤శ్రీవారి సేవ బుక్ అయ్యాక ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి
👨🏻💻90 రోజులు
👤 ఆర్జిత సేవ లు బుక్ చేసాక ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి?
👨🏻💻180 రోజులు
Comments
Post a Comment