Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల మొదటి గడప దర్శనం బుకింగ్ విధానం | Tirumala Electronic Dip Process Step by Step

tirumala modati gadapa darshanam


తిరుమల స్వామి వారిని మొదటి గడప దగ్గర నుంచి అద్భుతమైన అవకాశం టీటీడీ వారు కల్పిస్తున్నారు . మొదటి గడప దర్శనం లో నాలుగు రకాలైన సేవలుంటాయి అవి సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాదపద్మారాధన . గతం లో నిజపాద దర్శనం సేవ ఉండేది టీటీడీ ఈ మధ్య కాలం లో వీటికి టికెట్స్ ఓపెన్ చేయడం లేదు తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రకటించారు . మొదటి గడప దర్శనాన్నే సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఆర్జిత సేవల లక్కీ డ్రా టికెట్స్ అని పిలుస్తారు . తిరుమల దేవస్థానం వారు ప్రస్తుతం ప్రతి నెల 18/19 వ తేదీలలో విడుదల చేస్తున్నారు . ఇవి లక్కీ డ్రా టికెట్స్ , భక్తులందరూ డిప్ వేయడానికి రెండు రోజులు సమయం ఇస్తారు . లక్కీ డ్రా లో సెలెక్ట్ అయినవారికి మెసేజ్ లు పంపిస్తారు , సెలెక్ట్ అయిన తరువాత అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి . ఇప్పుడు ఆ టికెట్ లు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం . 
ముందుగా మనం తిరుమల దేవస్థానం వెబ్సైటు ఓపెన్ చెయ్యాలి . టీటీడీ వెబ్సైటు ఈ విధంగా ఉంటుంది . 
Tirumala Electroni dip ttd website
వెబ్సైటు లో కి వెళ్లిన తరువాత మనం seva electronic dip అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి . వీటితో పాటు పక్కన మనకు రూమ్స్ బుక్ చేసుకోవడానికి , 300/- స్పెషల్ దర్శనం టికెట్స్ ఇతర సేవ లకు సంబందించినవి కనిపిస్తాయి . ఆ టికెట్స్ ఎలా చేసుకోవాలో తరువాత చెప్పుకుందాం .
Tirumala modati gadapa darshanam
సేవ ఎలక్ట్రానిక్ డిప్ సెలెక్ట్ చేసిన వెంటనే సైట్ లోకి లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్ అడుగుతుంది . మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యండి 
మీరు ఎంటర్ చేసిన నెంబర్ కు ఓటీపీ వస్తుంది . నార్మల్ మెసేజ్ టీటీడీ నుంచి వస్తుంది 6 అంకెల నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ను ఇక్కడ టైపు చేయాలి . 

టైపు చేసిన తరువాత login పై క్లిక్ చేస్తే , సర్వర్ బిజీ గా ఉంటె వెయిటింగ్ టైం చూపిస్తుంది . మనం టైం అయ్యేవరకు చూస్తూ ఉండాలి వేరే మార్గం లేదు😀😁

మనం టైం బాగుంటే వెయిటింగ్ టైం లేకుండానే త్వరగా ఓపెన్ అవుతుంది , క్రింద కనిపిస్తుంది చూడండి ఇలా వస్తుంది . dip process & రూల్స్ వస్తాయి . 
ముఖ్యమైనవి నేను చెప్తాను చదవండి :
1. ఇండియా లో ఉన్నవారు ఆధార్ కార్డు తో మాత్రమే సేవ రిజిస్టర్ చేసుకోవాలి . ఇంతకూ ముందు ఓటర్ కార్డు తో కూడా రిజిస్టర్ చేసుకునేవారు ఇప్పుడు తీసేసారు . passport తో NRI లు మాత్రమే రిజిస్టర్ చెయ్యాలి . 
2. ఒకసారి మనం సబ్మిట్ చేసిన తరువాత మరల మార్చుకోవడానికి ఉండదు . 
3. మీరు సేవ లో సెలెక్ట్ అవితే , నాకు ఆ తేదీ వద్దు వేరే తేదికి ఇవ్వండి అంటే ఇవ్వరు
4. టీటీడీ వాళ్ళు ఒక్కోసారి ఏదైనా సేవ రద్దు చేస్తారు , అదేంటి అని అడగడానికి లేదు 
5. మీరు సేవ లో సెలెక్ట్ అవితే 180 రోజులు వరకు మరల డ్రా లో పాల్గొనడానికి లేదు , మిగిలిన దర్శనాలు చేస్కోవచ్చు . 
6. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె నన్ను అడగండి 😊

అన్ని చదివిన తరువాత బాక్స్ లో పైన క్లిక్ చేయండి . ఆ తరువాత క్రింద ఫోటో ఓపెన్ అవుతుంది మీ ఆధార్ కార్డు పక్కన పెట్టుకుని ఆధార్ లు ఉన్నట్టు మీ వివరాలు రాయండి . 

Pilgrim Details దగ్గర Number of Persons ఉంది కదా అక్కడ ఒకటే చూపిస్తుంది మీరు ఒకటి పైన క్లిక్ చేస్తే 2 ఆప్షన్ కనిపిస్తుంది . ఇద్దరు వెళ్ళాలి అనుకుంటే 2 సెలెక్ట్ చేసి మీ వివరాలు ఇవ్వండి . 12 సంవత్సరాల లోపు పిల్లలను మీరు తీసుకుని వెళ్ళవచ్చు . 12 దాటితే వారికి విడిగా మీరు డ్రా వెయ్యాలి . 

మీ పేరు , వయస్సు , ఆధార్ నెంబర్ అన్ని తప్పులు లేకుండా ఇచ్చిన తరువాత Continue పై క్లిక్ చేయండి . 

ఇక్కడ మీకు ఏ సేవ లు ఉన్నాయి వాటి ధరలు ఎంత ? ఏ సమయం లో సేవ జరుగుతుంది ? ఏ సమయానికి మనం లైన్ లో ఉండాలో ఉంటుంది . ఫోటో సరిగా కనిపించడం లేదేమోగా నేను టైపు చేస్తాను చూడండి . 
1. తోమాల సేవ , టికెట్ ధర : 220 , సేవ సమయం : 3:30 AM , రిపోర్టింగ్ టైం : 3AM
2. అర్చన  , టికెట్ ధర : 220 , సేవ సమయం : 4:30 AM , రిపోర్టింగ్ టైం : 4AM
3. అష్టదళ పాద పద్మారాధన  , టికెట్ ధర : 1250 , సేవ సమయం : 9 AM , రిపోర్టింగ్ టైం : 8:30AM
4. సుప్రభాతం  , టికెట్ ధర : 120 , సేవ సమయం : 3 AM , రిపోర్టింగ్ టైం : 2AM
చదివారు కదా నేను పైన ఫోటో లో బాణం వేసి చూపిస్తున్న చూడండి . Select Seva & Date పై క్లిక్ చేయండి . 

మీరు Select All Seva / Dates పైన క్లిక్ చేయండి . అప్పుడు అన్ని సేవ లు అని రోజులు సెలెక్ట్ అవుతాయి ఆలా చేస్తే మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది . లేదా మీకు  కావాల్సిన సేవ కావాల్సిన తేదీ ని కూడా సెలెక్ట్ చేస్కోవచ్చు . 
ఇక్కడ చుడండి నేను అన్ని రోజులు అన్ని సేవ లు సెలెక్ట్ చేశాను . మీరు పైన ఫోటో లో ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఏ రోజుకి ఎన్ని టికెట్స్ విడుదల చేస్తున్నారో కూడా చూడవచ్చు . చూసారా లేదా ? ఆ తరువాత Okay పైన క్లిక్ చేస్తే బుకింగ్ అవుతుంది . 
ఈ విధంగా రిజిస్టర్ అయినట్టు మెసేజ్ కనిపిస్తుంది . ఒకే పైన క్లిక్ చేయండి . మీ మొబైల్ కు అదే విధంగా జిమెయిల్ కూడా మెసేజ్ వస్తుంది . 
మీకు అర్ధమైతే ఒక కామెంట్ చేయండి , మీ స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా చేసుకుంటారు . 
tirumala Seva online booking process step by step, tirumala updates, temples guide, hindu temples guide, tirumala online seva updates. 


Comments