తిరుమల శ్రీవారి సేవకులకు శుభవార్త చెప్పిన టీటీడీ | Tirumala November Month Seva Quota Release Date Rules
దానితో శ్రీవారి సేవకులు నవంబర్ నెల కోట కోసం ఎదురుస్తున్నారు. టీటీడీ వారు శ్రీవారి సేవకులకు శుభవార్త చెప్పారు. నవంబర్ కోట ను సెప్టెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారు. శ్రీవారి సేవ తో పాటు నవనీత సేవ కోట ను అదేవిధంగా పరకామణి సేవ కోట కూడా విడుదల చేస్తున్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవ మరియు నవనీత సేవ కోట విడుదల చేస్తున్నారు. 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు పరకామణి సేవ కోట విడుదల చేస్తున్నారు.
శ్రీవారి సేవ రూల్స్ :
శ్రీవారి సేవకు వెళ్లేవారి వయస్సు 18-60 సంవత్సరాలు లోపు ఉండాలి
పర్వదినాలలో అనగా బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి రథసప్తమి రోజుల్లో సేవకుల వయస్సు 18-50 సంవత్సరాలు ఉండాలి.
సింగల్ గా కూడా వెళ్ళవచ్చు .
గ్రూప్ గా వెళ్ళాలి అనుకుంటే కనీసం 10మంది గరిష్టంగా 15 మంది ఉండాలి.
నవనీత ఆడవారికి మాత్రమే ఉంటుంది
పరకామణి సేవ వయస్సు 25-65 వరకు ఉండవచ్చు .
పరకామణి సేవ మగవారికి మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు గుర్తింపు పొందిన ప్రవైట్ సంస్థలకు అవకాశం కల్పిస్తారు.
తిరుమల శ్రీవారి సేవ బుక్ చేసుకునే వెబ్సైటు : https://srivariseva.tirumala.org/
Comments
Post a Comment