తిరుమల దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు ఏమి చెయ్యాలి | Tirumala News TTD Cancelled SSD Tokens | Temples Guide
తిరుమలలో రద్దీ చాలా అధికంగా ఉంది దర్శనం టికెట్స్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ఏకంగా 40 గంటలు సమయం పడుతుందని టీటీడీ అధికారికంగా తెలియచేసారు. వారాంతం కావడం తో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. తమిళులు చాల పవిత్రంగా భావించే పెరటాసి మాసం కావడం తో తమిళనాడు భక్తులు చాల అధికంగా తిరుమల చేరుకుంటున్నారు ఆ రద్దీ దృష్ట్యా పెరటాసి మరో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే తిరుపతి లో ఇచ్చే సర్వదర్శనం టోకెన్ లు ఇవ్వడం నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు.
పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా ఆధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్ ఎస్ డి టోకెన్ల జారీని రద్దు చేసింది. తిరుపతిలో అక్టోబర్ 1, 7, 8, 14 మరియు 15వ తేదీలలో ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయబడవు. దీని అర్ధం ఉచిత దర్శనం లేదని కాదు దర్శనం టికెట్స్ లేని భక్తులు నేరుగా వెళ్ళి ఉచిత దర్శనం లైన్ లోకి వెళ్ళవచ్చు. మీకు ఇతర సేవ టికెట్స్ ఉంటే ఆ దర్శనాలకు కూడా వెళ్ళవచ్చు.
Comments
Post a Comment