నూతన సంవత్సరం జనవరి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం టికెట్స్ విడుదల తేదీలు ఇవే..| January Month TTD Online Darshan Tickets Release Dates
భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం జనవరి (2024) నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.
జనవరి (2024) నెల తిరుమల ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ విడుదల తేదీలు:
ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవా టికెట్లను అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
తిరుమల, తిరుపతిలలో వసతి గదుల బుకింగ్ అక్టోబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
Tags: TTD, Tirumala, Tirupati, Tirumala Tickets, January Month Tickets Tirumala, Online Tickets TTD, 2024 TTD
Comments
Post a Comment