Bhagavad Gita 6th Chapter 37-47 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 

శ్రీమద్ భగవద్ గీత షష్ఠోఽధ్యాయః
అథ షష్ఠోఽధ్యాయః |

అర్జున ఉవాచ |

అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ‖ 37 ‖


భావం : అర్జునుడు : శ్రద్ద వున్నప్పటికి మనో నిగ్రహం లోపించిన కారణంగా యోగంలో చిత్తం చలించినవాడు యోగసంసిద్ది పొందకుండా ఏ గతి పొందుతాడు. 

కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ‖ 38 ‖
భావం : అర్జునుడు : కృష్ణా! మోక్ష సంపాదన మార్గంలో నిలకడ లేనివాడు ఇహపర సౌఖ్యలు రెండింటికి భ్రష్టుడై చెదరిన మేఘాలలాగ చెడిపోడు కదా!

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః |
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ‖ 39 ‖

భావం : కృష్ణా! ఈ నా సందేహాన్ని సంపూర్ణంగా నివారించడానికి నీవే సమార్ధడవు. ఈ సంశయాన్ని తీర్చడాన్నికి నన్ను మించినవాడు మరొక్కడెవ్వడూ లేడు.
శ్రీభగవానువాచ |

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి ‖ 40 ‖
భావం : శ్రీ భగవానుడు: అర్జునా! యోగభ్రష్టుడికి ఈ లోకంలోకానీ, పరలోకంలోకాని ఎలాంటి హాని కలుగదు. నాయనా! మంచిపనులు చేసిన మనవుడేపుడూ దుర్గతి పొందడు.  

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ‖ 41 ‖
భావం : యోగభ్రష్టుడు పుణ్యకర్మలు  చేసేవాడు పొందే ఉత్తమలోకాలు చేరి, చిరకాలం అక్కడ భోగాలు అనుభవించిన అనంతరం సదాచార సంపన్నులైన భాగ్యవంతులైన యింటిలో జన్మిస్తాడు. 

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ‖ 42 ‖
భావం : లేకపోతే బుద్దిమంతులైన యోగుల వంశంలోనే పుడుతాడు. అయితే అలాంటి జన్మ ఈ లోకంలో పొందడం ఎంతో దుర్లభం.   

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ‖ 43 ‖
భావం : అర్జునా! అలా యోగుల కులంలో పుట్టినవాడు పూర్వజన్మ సంస్కార విశేషం వల్ల సంపూర్ణయోగిసిద్ది కోసం గతంలో కంటే ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తాడు. 


పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః |
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ‖ 44 ‖
భావం : పూర్వజన్మ లోని అభ్యాసబలం మూలంగా ఆ యోగభ్రష్టుడు తాను తలపెట్టక పోయినా మళ్ళీ యోగసాధనవైపుకు లాగబడుతాడు. యోగస్వరూపాన్ని తెలుసుకోదలచిన వాడుకూడా వేదాలలో వివరించబడ్డ కర్మలు ఆచరించే వాడిని మించిపోతాడు.

ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః |
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ ‖ 45 ‖
భావం : పట్టుదలతో ప్రయత్నించే యోగి పాపవిముక్తుడై అనేక జన్మలకు సంబంధించిన సాధనాసంపర్కం వల్ల యోగసిద్ది, తరువాత మోక్ష ఫలం పొందుతాడు.

తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ‖ 46 ‖
భావం : అర్జునా! తపస్సు చేసేవాళ్ళకంటే,శాస్త్ర జ్ఞానం కలవాళ్ళకంటే,యోగుల కంటే ధ్యానయోగి గొప్పవాడు. కనుక నీవు ధ్యానయోగం సాధించాలి.

యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ‖ 47 ‖
భావం : యోగులందరిలోనూ మనస్సు నా మీదే నిలిపి, శ్రద్ధాభక్తులతో నన్ను సేవించేవాడే ఉత్తముడని నా వుద్దేశం.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
ఆత్మసంయమయోగో నామ షష్ఠోఽధ్యాయః ‖ 6 ‖


6వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 6th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS