Drop Down Menus

About Hindu Temples Guide | Hindu Temples Guide Rajachandra


పరిచయం : 

నా పేరు రాజాచంద్ర , తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లోని విరవ గ్రామ నివాసిని .  . నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత కాకినాడ PROMINERE  లో ఒక సంవత్సరం పాటు SEO Executive గా పనిచేసి తరువాత 2010 డిసెంబర్   చెన్నై లో   eNSX Software Company లో జాబ్ లో జాయిన్ అయ్యాను . SEO Executive గ వర్క్ చేస్తూ వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాను. చెన్నై లో 4 సంవత్సరాలు వర్క్ చేశాను . ఆ తరువాత గూగుల్ యాడ్స్ ఒకే చేయడం , యూట్యూబ్ స్టార్ట్ చేయడం తో ఫుల్ టైం నేను టెంపుల్స్ గైడ్ పైనే వర్క్ చేస్తున్నాను . తెలుగు పైన ఉన్న మక్కువతో తెలుగు పండిట్ పూర్తీ చేశాను . ఆ తరువాత M.A తెలుగు కూడా పూర్తీ చేశాను . 

హిందూ టెంపుల్స్ గైడ్  కు పేస్ బుక్ లో 7,25,000 మంది ఫాలోవర్స్ , యూట్యూబ్ టెంపుల్స్ గైడ్ ఛానల్ లో 2,44,000 మంది Subscribers ఉన్నారు . హిందూ టెంపుల్స్ గైడ్ డాట్ కామ్ ను ఇప్పటివరకు 2 కోట్ల 76 లక్షల 86 వేల సార్లు విజిట్ చేసారు .

హిందూ టెంపుల్స్ గైడ్ గురించి పేపర్ లో వచ్చిన ఆర్టికల్స్ : 

దేవాలయాల ఈవో లు  చేస్తున్న పనికి అభినందిస్తూ : 
కృష్ణ జిల్లాలోని ఘంటసాల జలదీశ్వర ఆలయం లో 

కైకలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయ ఈఓ శ్రీనివాసరావు గారు 

కొల్లిటికోట శ్రీపెద్దింటమ్మ అమ్మవారి ఆలయ ఈవో కొండలరావు గారు 


సాయి అమృత సేవ సంఘం పిడుగురాళ్ల , సాయి గారు 
గూగుల్  మరియు యూట్యూబ్ కార్యక్రమం లో : 
హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి గూగుల్ సెర్చ్ సమావేశం లో మరియు యూట్యూబ్ పాప్ అప్ కార్యక్రమం లో పాల్గొన్నాను . గూగుల్ ఆఫీస్ హైదరాబాద్ లో గూగుల్ సెర్చ్ సమావేశం జరగగా , యూట్యూబ్ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగింది. 




ఏమిటి హిందూ టెంపుల్స్ గైడ్ అని అనుకునే వారు ముందుగా ఈ ఆర్టికల్స్ చదివితే అర్ధమౌతుంది : 

దేవాలయాల సమాచారం టెంపుల్స్ గైడ్ ద్వారా ఇస్తుంటాను . నేను దర్శించిన దేవాలయాలతో పాటు నా మిత్రులద్వారా తెల్సుకున్న దేవాలయాలు, ఎవరైనా అడిగితే ఆ దేవాలయం గురించి నేను తెల్సుకున్న దేవాలయాల సమాచారం ఇస్తుంటాను . ఇవ్వడం అంటే ఈ వెబ్సైటు లో రాస్తుంటాను . దేవాలయాల సమాచారం తో పాటు ఉచితంగా లభించే ఆధ్యాత్మిక పుస్తకాలూ , ధర్మ సందేహాలు , పంచాంగం. ఒక దేవాలయం తో పాటు చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్ర విశేషాలు తెలియచేయడం ఈ వెబ్సైటు ప్రధానం గా చేస్తున్న పని. అయితే వీటితో పాటు కంప్యూటర్ బేసిక్స్ , కర్ణాటక సంగీతం , శ్రీ లలితా సహస్ర నామం ,  భాగవతం కూడా నేర్పించడం కూడా జరుగుతుంది.



టెంపుల్స్ గైడ్ ఆలోచన : 
ముందుగా శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు కాకినాడ లో ఉద్యోగం చేస్తున్నప్పుడే వినే అలవాటు ఉంది . కానీ వారు  కాకినాడ వాసి అని తెలియదు. రామేశ్వరం గొప్పతనం తెల్సుకుని 2011 జులై లో  చెన్నై నుంచి నేను మా సర్ చైతన్య గారు బయలు దేరాము . కాస్త తమిళం పరిచయం ఉండటం వల్ల అన్ని బాగానే అడిగి చూడగలిగాం.  ఉదయం దర్శనం అయిన తరువాత సముద్రపు ఒడ్డున కూర్చుని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం . కాస్త తమిళ్ రావడం వల్ల చూడగలిగాం కానీ తమిళ్ తెలియని మనవాళ్ళు ఎప్పుడో రాసిన స్థలపురాణం పుస్తకం పట్టుకుని వస్తే ఇక్కడ ఏమిచూడగలుగుతారు . ఎవరు చెప్తారు వీరికి . మనమే ఏదోకటి చేయాలి . అన్ని దేవాలయాలు దర్శించి బుక్ రాయాలి కానీ అన్ని చూసే రాసేటప్పటికీ మొదటి చూసింది మర్చిపోతాం ఒక వేళా అన్ని చూడకపోతే ? నాకు బ్లాగ్ రాసే అలవాటు ఉంది కాబట్టి నేను చూసిన క్షేత్రాలన్నీ మనం మాట్లాడుకునే మాటల్లోని రాసుకుంటూ వెళ్తాను . ఎలా రాయాలో నాక్కూడా అవగాహనా వస్తుంది . అని రామేశ్వరం నుంచే మొదలు పెట్టాను ..
రామేశ్వరం లో రెండు సముద్రాలూ కలిసే చోట మరియు బోటింగ్ కు వెళ్లే సమయం లో తీసుకున్న ఫోటో లు 

రామేశ్వరం ఆర్టికల్ కు స్పందన :
తెలుగు లో చాల తక్కువ మంది అప్పట్లో ఆర్టికల్స్  బ్లాగ్ లో రాసేవారు . 2011 సంవత్సరం అంటే మీకే అర్ధమౌతుంది . నేను రాసిన రామేశ్వరం యాత్ర అనుభవాలకు చాలామంది స్పందించారు.
తెలుగు వికీపీడియా లో :
తెలుగు వికీపీడియా లో కూడా నేను కొన్ని ఆర్టికల్ కు అదనపు సమాచారం ఇవ్వడం తో పాటు యాత్ర లో తీసుకున్న ఫోటో లను అప్లోడ్ చేసేవాణ్ణి . ఎందరో గొప్పవారిని తెలుగు వికిపీడియా నాకు పరిచయం చేసింది . ముఖ్యంగా చెన్నై లో ఉంటున్న సుజాత గారు వారు నా అభిరుచి చూసి ఏ ఏ క్షేత్రాలకు ఎలా వెళ్లాలో చెప్పేవారు ఆవిడ చెప్పిన ప్రకారం చెన్నై నుంచి వెళ్లి వచ్చేవాణ్ణి , మా ఆఫీస్ లో శ్రీను గారు ఈ వారం మహాబలిపురం వెళ్ళిరా , కంచి వెళ్ళిరా , అవును నువ్వు అరుణాచలం చూడలేదు కదా అంటూ నాకు బలే చెప్పేవారు . 



2014 లో విజయవాడ లో జరిగిన దశాబ్ది ఉత్సవాలలో కూడా పాల్గొన్నాను .. 

వారాంతం లో :
చెన్నై ఆఫీస్ లో శనివారం ఆదివారం శెలవు కావడం తో నెలకు ఒకట్రెండు సార్లైనా ఏదొక ప్లేస్ ను చూడాల్సిందే..  అరుణాచలం , తిరుపతి , కాంచీపురం , మహాబలిపురం , రామేశ్వరం , మదురై , తంజావూరు , శ్రీరంగం ఇంకా చాల .. ఇలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించాను . నాకు తెలియకుండానే నేను ఒక గైడ్ ల మారీపోయాను . చంద్రముఖి మూవీ లో లా :)

ఫేస్బుక్ లో :
హిందూ టెంపుల్స్ గైడ్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. దేవాలయాల సమాచారం పోస్ట్ చేస్తూండేవాణ్ణి .  బహుశా చాల తక్కువ సమయం లోనే 5000 మంది ఫ్రెండ్స్ అయ్యారు. వారు కూడా వారికి తెలిసిన సమాచారం ఇస్తుండేవారు .. ఆ తరువాత హిందూ టెంపుల్స్ గైడ్ పేజీ ని ప్రారంభించాను . నెమ్మది నెమ్మదిగా 7 లక్షల మందికి చేరారు . చాలామంది గొప్పవారు కూడా ఇక్కడే నాకు పరిచయం అయ్యారు . 

హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి : 
మొదట్లో నేను దర్శించిన క్షేత్రాలు మాత్రమే రాస్తూండేవాణ్ణి . ఎప్పుడైతే పేస్ బుక్ లోకి వచ్చానో ఎక్కడెక్కడివారో నాకు మెసేజ్ లు చేస్తూ ఆయా దేవాలయాల గురించి అడిగేవారు . వారికి నెట్ లో సెర్చ్ చేసి లేదా టెంపుల్స్ గైడ్ కి ఉన్న ఫాలోయర్స్ ద్వారా సమాధానం తెల్సుకుని వారికి సమాధానం ఇచ్చేవాణ్ణి . 'సర్ మీ సమాచారం చూసి అరుణాచలం వెళ్లివచ్చాం అండి చాల సంతోషం ఆ దేవుడు మిమ్మల్ని బాగా చూడాలి  ' అని అంటుంటే ఎలా ఉంటుందో మీక్కూడా తెలుసు కదా .. 

కంప్యూటర్ బేసిక్ , కర్ణాటక సంగీతం , శ్రీ లలితా సహస్రం, భాగవతం : 
టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ నుంచి కంప్యూటర్ బేసిక్స్ వీడియో లు , నా స్నేహితులు  రాజేష్ , దుర్గమైత్రేయి సహాయం తో సంగీతం నేర్చుకుందాం అనుకునే వారికోసం కర్ణాటక సంగీతం క్లాస్ లు ఆన్లైన్ లో చెప్పడం జరిగింది. రుక్మిణి గారి సహాయం తో శ్రీ లలితా సహస్రం వీడియో లు చేయడం జరిగింది. బహుశా మీరు నమ్మరేమో వాట్సప్ ద్వారా భాగవత పద్యాలూ  సుమారు 80 మందికి నేర్పించడం జరిగింది. వారిలో కొందరు మన దేశం లో లేనప్పటికీ చక్కగా నేర్చుకున్నారు . 30 పద్యాలు టార్గెట్ పెట్టుకుని నేర్పించడం జరిగింది

దేవాలయ పునః నిర్మాణం : 
మా ఇంటికి ఎదురుగా రామాలయం ఉంది. 1905 లో  నిర్మించిన దేవాలయం, శిథిలావస్తుకు చేరుకుంది. ఆలయ పునః నిర్మాణానికి హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి సుమారు 80 వేలు ఇవ్వడం జరిగింది. ఫేస్బుక్ లో ఉన్న ఎక్కడెక్కడి వారో విరాళం ఇవ్వడం జరిగింది. ఇక్కడో విషయం చెప్పాలి ఆలయం అకౌంట్ ఓపెన్ చేయడం ఆలస్యం అవడం తో వారంతా నా పర్సనల్ అకౌంట్ లోనే వేశారు. ఆలయం పూర్తైన తరువాత వారి పేర్లు దేవాలయం పై రాయించడం జరిగింది. 
భాగవతం : 
శ్రీ చాగంటి కోటేశ్వర రావు చెప్పిన ప్రవచనం విని భాగవతం పై మక్కువ పెరిగింది.  తెలుగు భాగవతం వెబ్సైటు లో ఉడతా భక్తిగా నేను కూడా ఆ వెబ్సైటు నిర్మాణం లో పాల్గొనే అవకాశం వచ్చింది . ఆ వెబ్సైటు లో పద్యాలూ ఎలా పాడాలో ఆడియో కూడా ఉంటుంది. వాటి సహాయం తో మా ఊరిలో పిల్లలకు భాగవత పద్యాలు నేర్పించడం 2017 మొదలు పెట్టాను . భాగవతం ఆర్గనేషన్స్ వారు చాల సంతోషించి వారు నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు మా గ్రామం లో కూడా నిర్వహిచడం మొదలు పెట్టారు . ఇక్కడ 1 వ తరగతి, 2 వ తరగతి  పిల్లలు భాగవత పద్యాలూ  ఆడుకుంటూ పాడుకుంటారు . 
 2017 లో విరవ గ్రామం లో కృష్ణాష్టమి వేడుకలలో పద్యాలు నేర్చుకున్న పిల్లలకు భాగవతం ఆర్గనేషన్ నుంచి శ్రీ బండి శ్రీనివాసశర్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చి మరీ పిల్లలకు బహుమతి ప్రధానం చేసారు  . 

2018 లో భాగవత కార్యక్రమం 




భాగవతం తో పాటు భగవద్గీత చూసి చదవడం పిల్లలకు హైందవి వారి వీడియోస్ సహాయం తో పిల్లలకు నేర్పిస్తున్నాను . ఒక అధ్యాయం పూర్తిగా నేర్చుకున్నారు . వారిని ప్రోత్సహించడానికి పిల్లలకు ఏమైనా ఇస్తే బాగుంటుంది అని అడగగా శ్రీ కురుమళ్ల రాంబాబు గారు పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. 
మా పిల్లలు భగవద్గీత ఒక అధ్యాయం పూర్తిగా నేర్చుకున్నారు ఆ సందర్భంలో 
సంధ్యగురుకుల శిక్షకునిగా : 
శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి వారు నిర్వహిస్తున్న సంధ్య గురుకులం లో శిక్షకునిగా నన్ను చేర్చుకున్నారు . మా గ్రామం లో పిల్లలకు నేర్పిస్తున్న భాగవత పద్యాలు చూసి వారు నాకు ఆ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం 50 మంది పిల్లలు  భాగవత పద్యాలూ నేర్చుకుంటున్నారు . 



14-9-2019 న భాగవత జయంతి సందర్భంగా విరవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భాగవతం , భగవద్గీత , డ్రాయింగ్ పోటీలలో విజేతలకు ప్రైజ్ లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం భారత్ టుడే లో రావడం సంతోషం . 






నేను ఒక్కడినే మీకు కనిపించవచ్చు కానీ ఈ ఎనిమిది సంవత్సరాలు గా ఎందరో మిత్రులు టెంపుల్స్ గైడ్ ద్వారా పరిచయం అయ్యారు. వారంతా ఎన్నో సలహాలు , సూచనలు ఇచ్చారు. వారికోసం ప్రత్యేకంగా మీకు వివరిస్తాను. 

హిందూ టెంపుల్స్ గైడ్ ఫోన్ నెంబర్ : 8247325819
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Jyotirling/Shakti Peeth/Nepal
    Yatra Package available
    Call/whatsapp 9198595775

    ReplyDelete

Post a Comment