Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు | Amazing Sesame Oil Benefits


నువ్వుల నూనెతో నూరు లాభాలు.. ఎలా అంటే..!
సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వాటి వాడకం ఎక్కువ. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వుల విత్తనాల నుంచి తయారు చేసిన నువ్వుల నూనె ఇటు వంటకాలలోను, అటు ఆయుర్వేద పరంగాను ప్రపంచ వ్యాప్తంగా విరివిగా వినియోగించబడుతోంది. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అదే నువ్వుల ప్రత్యేకత.
కూర అనగానే మనకు అందులో పోపుకు ఏ నూనె వేశారు అనే ప్రశ్న వేస్తారు. పల్లీల నూనె అని, సన్ ఫ్లవర్ నూనె పేర్లు ఎక్కువగా చెబుతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే నువ్వుల నూనె అంటారు.  ఆ నూనెను మనం ఎక్కువగా ఊరగాయలకు పరిమితం చేశాం. దేవాలయాలలో, ముఖ్యంగా శనేశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యడం ఆచారంగా మారింది. దీనిని కేవలం వంటలలోనే కాకుండా దేహమర్దన తైలంగా, ఆయుర్వేద మందులలో, కాస్మోటిక్స్‌ తయారీలో వాడుతారు. రుచిలో, వాసనలో ప్రత్యేకతను చాటుకున్న ఈ నూనె నువ్వుల నుంచి తయారు అవుతుంది. ఈ నువ్వులు మూడు రాకాలుగా పండిస్తారు. నల్లని, తెల్లని, కపిలవర్ణం (ఎరుపు)లో లభిస్తాయి. 

ప్రపంచవ్యాప్తంగా నువ్వులను 65 దేశాలు పండిస్తున్నాయి. నువ్వుల నూనె శక్తివంతమైన అంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి ఉన్నదని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నూనెలో కాల్షియం, మినరల్స్, ఐరన్, జింక్, థయామిన్, విటమిన్ ‘ఇ’, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. మన పూర్వీకులు ఈ నూనెను ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనదిగా గుర్తించారు. మరి ఈ నూనెతో మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. 

నువ్వుల నూనెతో లాభాలు.. 
ఈ నూనె కేశాలకు ఎంతో మంచిది. కేశాలు రాలిపోకుండా ఒత్తుగా పెరిగేలా సహకరిస్తుంది. కుదళ్లకు పోషణ అందించడం, వాటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ బి, సితోపాటు మెగ్నీషియం, కాల్షియం, దీనిలో ఉండే ప్రొటీన్లు జుట్టు కుదుళ్లను బలంగా ఉండేలా చేస్తాయి. చుండ్రును కూడా నివారిస్తుంది.

రోజూ క్రమం తప్పకుండా ఈ నూనెను తలకు పట్టిస్తే తెల్లజుట్టును తగ్గిస్తుంది. పేను కొరుకుడు సమస్యకు కూడా ఈ నూనె చక్కని పరిష్కారం చూపిస్తుంది.

చర్మ సంరక్షణలో నువ్వుల నేనె బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఇ, బి విటమిన్లు చర్మానికి సంబంధించిన అన్నీ రకాల సమస్యలను దూరం చేస్తాయి. 

చిన్నారుల ఆరోగ్యానికి నువ్వుల నూనె బాగా ఉపకరిస్తుంది. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. వారికి ఈ నూనెతో మర్దన చేస్తే చాలా హుషారుగా ఉంటారు. ఇప్పుడు చాలామంది తల్లులు తమ బిడ్డల మర్థనకు ఈ నూనెను వాడుతున్నారు. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి ఈ నూనెను మర్థన చేస్తే హాయిగా నిద్రపోతారు. వారిలో మెదడు ఎదుగుదలకు, వెన్నుముక, కండరాలు బలపడేందుకు ఈ నూనె చక్కగా పనిచేస్తుంది. నిత్యం స్నానానికి ముందు, పడుకునేందుకు ముందు నువ్వుల నూనెతో ఒళ్లంతా మసాజ్ చేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ, తక్కువ ఉంటే సమస్థాయికి తీసుకువస్తుంది. వయసు పైబడినవారు ఈ నూనెతో చేసిన పదార్థాలు తింటే మంచి ఆరోగ్యంతో ఉంటారు. 

నువ్వుల్లో కాపర్ మూలకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో కీళ్ల నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. దీనిలోని మెగ్నీషియం శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అలాగే ఇందులోని కాల్షియం మైగ్రేన్ వంటి సమస్యలను అరికడుతుంది. క్యాన్సర్‌తోనూ పోరాడుతుంది. ఎముకలు గట్టిపడేందుకు ఇందులోని జింక్ ఉపకరిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను, రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది. 

ఇందులోని ఎలిమెంట్స్ సీసమోలో అనే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో సాయపడతాయి.

నువ్వులు దంత క్షయాన్ని అరికడతాయి. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలను, చిగుళ్ల నుంచి రక్తం కారుట, థ్రోట్ ఇన్షెక్షన్‌ను తొలగించి దంతాలకు బలాన్ని చేకూరుస్తుంది. నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ కూడా చేయొచ్చు.

సాధారణ జలుబును తగ్గిస్తుంది. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వుల నూనె వాసన చూస్తే జలుబు తగ్గి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పోతుంది. 
Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

నువ్వుల నూనె ప్రత్యేకత ఏమిటి, నల్ల నువ్వుల వల్ల ఉపయోగాలు, నువ్వుల నూనె తయారీ విధానం, Nuvvlu, nuvvula oil uses in telugu, nuvvulu uses in telugu, gingelly oil in telugu, mustard oil in telugu, gingelly oil in telugu images, black sesame oil in telugu, castor oil in telugu, til oil in telugu, sesame oil benefits

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు