Drop Down Menus

Bhagavad Gita 4th Chapter 11-20 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 

శ్రీమద్ భగవద్ గీత చతుర్థోఽధ్యాయః
అథ చతుర్థోఽధ్యాయః |
శ్రీభగవానువాచ |

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ‖ 11 ‖


భావం : అర్జునా! ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను. అందువల్ల నా మార్గమే మానవులు అన్నివిధాలా అనుగ్రహిస్తాను.

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ‖ 12 ‖
భావం : ఈ లోకంలో కర్మలకు ఫలం శీఘ్రంగా సిద్దిస్తుంది. కనుకనే కర్మఫలం ఆశించి మానవులు దేవతలను ఆరాధిస్తారు.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ‖ 13 ‖
భావం : వారి వారి గుణాలకు, కర్మలకు తగ్గట్లుగా నాలుగు వ్యర్ధాలు నేనే సృష్టించాను. అయినప్పటికీ వాటికి కర్తనైన నన్ను కర్తను కాదనీ, శాశ్వతుడననీ తెలుసుకో.

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ‖ 14 ‖
భావం : నన్ను కర్మలంటవని, నాకు కర్మఫలాపేక్ష లేదని గ్రహించిన వాడిని కర్మలు బంధించవు. 



ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ‖ 15 ‖
భావం : మోక్షం పట్ల ఆసక్తి కలిగిన పూర్వులు కూడా ఈ విషయం గుర్తించే కర్మలు చేశారు. కనుక పురాతనకాలంనుంచీ వస్తున కర్మవిధానం నీవూ అనుగ్రహించు.

కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ‖ 16 ‖
భావం : పండితులుకూడా కర్మఏదో, కర్మ కానిది ఏదో తెలియక తికమకలవుతున్నారు. సంసారబంధాలనుంచి విముక్తి పొందడానికి అవసరమైన కర్మ స్వరూపం వివరిస్తాను విను.  

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ‖ 17 ‖
భావం : కర్మ అంటే ఏమిటో, శాస్త్రాలు నిషేదించిన వికర్మ అంటే ఏమిటో, ఏపని చేయకపోవడమే అకర్మ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. కర్మతత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం.

కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ‖ 18 ‖
భావం : కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చూసేవాడు మానవులలో బుద్దిమంతుడు, యోగి, సమస్త కర్మలూ ఆచరించేవాడు. 

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ‖ 19 ‖
భావం : ఫలాసక్తి లేకుండా అన్ని కర్మలూ ఆచరించకపోవడంతో పాటు జ్ఞానమనే అగ్నితో పూర్వపు వాసనల్నినాశనం చేసుకున్న వాడిని పండితుడని పెద్దలు చెబుతారు.   

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్కరోతి సః ‖ 20 ‖
భావం : కర్మఫలాపేక్ష విడిచి పెట్టి నిత్యం సంతృప్తి తో దేనిమీదా ఆధారపడకుండా, కర్మలు చేసేవాడు, ఏమి చేయనివాడే అవుతాడు.
భగవద్గీత 4వ అధ్యాయం 21-30 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
4వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 4th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.