Bhagavad Gita 4th Chapter 21-30 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 

ŚRĪMAD BHAGAVAD GĪTA CHATURTHOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత చతుర్థోఽధ్యాయః

atha chaturthoadhyāyaḥ |
అథ చతుర్థోఽధ్యాయః |

nirāśīryatachittātmā tyaktasarvaparigrahaḥ |
śārīraṃ kevalaṃ karma kurvannāpnoti kilbiśham ‖ 21 ‖

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః |

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ‖ 21 ‖


భావం : వాంఛలు వదిలిపెట్టి చిత్తము, మనస్సు, వశపరచుకొని ఈ వస్తువు నాది అనేది లేకుండా కేవలం శరీరపోషణకోసం కర్మలు ఆచరించేవాడు పాపం పొందడు. 

yadṛchChālābhasantuśhṭo dvandvātīto vimatsaraḥ |
samaḥ siddhāvasiddhau cha kṛtvāpi na nibadhyate ‖ 22 ‖

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |

సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ‖ 22 ‖

భావం : అప్రయత్నంగా లభించిన వస్తువులతో సంతృప్తి చెందుతూ, ఇతరుల మీద ఈర్ష్యపడకుండా, సుఖదుఃఖాలకు లొంగకుండా జయాపజయాలపట్ల సమ దృష్టి కలిగినవాడు కర్మలు చేసినా బంధాలలో చిక్కుకోడు.

gatasaṅgasya muktasya GYānāvasthitachetasaḥ |
yaGYāyācharataḥ karma samagraṃ pravilīyate ‖ 23 ‖

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః |

యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ‖ 23 ‖

భావం : దేనిమీదా ఆసక్తి లేకుండా, విముక్తి పొంది, మనస్సును ఆత్మజ్ఞానం మీదే నిలిపినవాడు భగవంతుడి ప్రీతి కోసంకానీ , లోక కళ్యాణార్ధం కానీ చేసే కర్మలన్ని పూర్తిగా నశించిపోతాయి.  

brahmārpaṇaṃ brahma havirbrahmāgnau brahmaṇā hutam |
brahmaiva tena gantavyaṃ brahmakarmasamādhinā ‖ 24 ‖

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ‖ 24 ‖

భావం : యజ్ఞంలోని హోమ సాధనాలు, హోమద్రవ్యాలు, హోమాగ్ని, హోమం చేసే వాడు, హోమం చేయబడింది. హోమకర్మ - పరబ్రహ్మ స్వరూపాలే అని భావించి యజ్ఞ కర్మలు ఆచరించేవాడు పరబ్రహ్మనే పొందుతాడు.

daivamevāpare yaGYaṃ yoginaḥ paryupāsate |
brahmāgnāvapare yaGYaṃ yaGYenaivopajuhvati ‖ 25 ‖

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |

బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ‖ 25 ‖

భావం : దేవతలను ఉద్దేశించి కొంత మంది యోగులు యజ్ఞం చేస్తారు. మరి కొంతమంది బ్రహ్మమనే అగ్నిలో ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తారు. 

śrotrādīnīndriyāṇyanye saṃyamāgniśhu juhvati |
śabdādīnviśhayānanya indriyāgniśhu juhvati ‖ 26 ‖

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |

శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ‖ 26 ‖

భావం : కొంతమంది చెవిలాంటి ఇంద్రియాలను నిగ్రహం అనే అగ్నిలోనూ, మరికొంతమంది శతాబ్ది విషయాలను ఇంద్రియాలనే అగ్నిలోనూ హోమం చేస్తున్నారు.

sarvāṇīndriyakarmāṇi prāṇakarmāṇi chāpare |
ātmasaṃyamayogāgnau juhvati GYānadīpite ‖ 27 ‖

సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |

ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ‖ 27 ‖

భావం : కొందరు ఇంద్రియాలన్నీటి వ్యాపారాలూ, ప్రాణవ్యాపారాలూ జ్ఞానంతో ప్రకాశించే మనోనిగ్రహం అనే అగ్నికి అర్పిస్తున్నారు. 

dravyayaGYāstapoyaGYā yogayaGYāstathāpare |
svādhyāyaGYānayaGYāścha yatayaḥ saṃśitavratāḥ ‖ 28 ‖

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |

స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ‖ 28 ‖

భావం : దానధర్మలే యజ్ఞంగా కొంతమంది, తపస్సే యజ్ఞంగా కొంతమంది యోగసాధనే యజ్ఞంగా కొంతమంది ఆచరిస్తున్నారు. కార్యదీక్ష, కఠోరవ్రతం కలిగిన మరికొంతమంది వేదధ్యాయమనే యజ్ఞమాని భావించి స్వాధ్యాయ యజ్ఞమూ, జ్ఞానయజ్ఞమూ చేస్తున్నారు.  

apāne juhvati prāṇaṃ prāṇeapānaṃ tathāpare |
prāṇāpānagatī ruddhvā prāṇāyāmaparāyaṇāḥ ‖ 29 ‖

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే |

ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ‖ 29 ‖

భావం : అలాగే ప్రాణాయామపరులు కొంతమంది ప్రాణవాయువు, అపానవాయువుల గతులను నిరోధించి అపానంలో ప్రాణమూ, ప్రాణములో అపానమూ హోమం చేస్తున్నారు. 

apare niyatāhārāḥ prāṇānprāṇeśhu juhvati |
sarveapyete yaGYavido yaGYakśhapitakalmaśhāḥ ‖ 30 ‖

అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి |

సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః ‖ 30 ‖

భావం : మరికొంతమంది ఆహార నియమంతో ప్రాణవాయువులను ప్రాణాలలోనే అర్పిస్తారు. యజ్ఞాలు తెలిసిన వాళ్ళంతా యజ్ఞలావల్ల పాపపంకిలాన్ని క్షాళనం చేసుకుంటున్నారు.   

భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 4th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments