గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా? housewarming - Meaning in telugu

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడటానికి అయినా సిద్ధపడతారు. ఊరు సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలని భావిస్తారు. లేదంటే ఆ ఊరికి తాము పరాయివాళ్ళం అనే భావన కలుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

ఇల్లు కట్టుకున్నాక బందులను పిలిచి ‘గృహప్రవేశం’ చేస్తుంటారు. ఆ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది.

ఇక ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ తమ బంధు మిత్రులను ఆహ్వానించి 'గృహప్రవేశం' చేస్తుంటారు. గృహ ప్రవేశానికి ముందు ఆ కొత్త ఇంట్లో గోమాతను తిప్పడం మన ఆచారంగా వస్తోంది. గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది.
అందువలన నూతన గృహాల్లోకి గోవును ప్రవేశ పెట్టడాన్ని శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం ... పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు.

అయితే పట్టణాల్లో అపార్ట్ మెంట్ల సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. అందువలన బహుళ అంతస్తులు కలిగిన ఈ భవనాల్లోకి ఆవును తీసుకు రావడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయంగా చాలా మందికి సందేహం కలుగుతుంటుంది. లక్షలు ఖర్చుపెట్టినా ఆవు అడుగు పెట్టకుండా అయిందేననే అసంతృప్తి కలుగుతుంటుంది. అయితే శాస్త్రం ఇందుకు చాలా స్పష్టమైన సమాధానం చెబుతోంది.

బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసే వాళ్లు ... ఆ భవనం ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజించాలి. ఆవుదూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడమే కాకుండా, వాటి యజమానులను దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి. గోవు పేడను ... మూత్రాన్ని తమ నివాస స్థలంలో చిలకరించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆవును నేరుగా ఇంట్లో తిప్పిన ఫలితం లభిస్తుంది.
Famous Temples :

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

నిమ్మకాయల దీపం పెట్టటం వలన కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గోవుతో గృహప్రవేశం, housewarming meaning in telugu, new housewarming meaning in telugu, housewarming meaning in english, new house ceremony meaning in telugu, housewarming wishes in telugu, gruhapravesam meaning in english, house meaning in telugu, gruhapravesam avu, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS