కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి | Kurudumale Ganesha Temple | Mulbagal - Karnataka


కురుడుమలై గణపతి :
అపరిమిత శక్తివంతుడు, విఘ్ననాశకుడు

బెంగళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ముళబాగిలుకు దగ్గరలో కురుడుమలై లో వేంచేసి ఉన్న శక్తి గణపతి 14 అడుగుల భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిల. త్రిమూర్తులు ప్రతిష్టించారని ప్రతీతి. త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్య విఘ్నాలు తొలగించుకున్నారని, త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపరంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవిన్చాడని, పాండవులు స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణం. శ్రీకృష్ణదేవరాయలు వారికి స్వామి కలలో కనబడి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించడం వలన ఆయన కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. పూర్వం దీనిని కూటాద్రి అని పిలిచేవారని, కాలక్రమేణా కురుడుమలె గా పేరు మారిందని చరిత్రకారులు చెబుతారు. ఆర్కియాలజీ వారు ఈ గుడి సుమారు 2000 ఏళ్ళ క్రితందని చెబుతారు. ఈ గుడి మొత్తం ఏక శిలతో నిర్మితమయింది.

కౌండిన్య మహాముని ఆ ప్రాంతంలో నేటికీ ఉంటారని, ప్రతీ రాత్రి వచ్చి స్వామిని సేవించుకుంటారని అక్కడ నమ్మకం. దానికి ఆధారంగా కొన్ని రాత్రులు అక్కడ స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారు అని అక్కడ పెద్దలు చెబుతారు. ఇక్కడ ప్రాశస్త్యం ఏమిటంటే అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శన మాత్రం చేత ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని ప్రశస్తి. కొత్త పని మొదలు పెట్టేముందు, బాధలతో సతమతమయ్యేవారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు జరుగుతాయని చరిత్ర. నేటికీ కూడా కన్నడ ప్రజలు తప్పక దర్శించి మంచి ఫలితాలు చూస్తారు. 

ఈ గుడికి ఒక వంద మీటర్ల దూరంలో కౌండిన్యమహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి, అమ్మవారిని కూడా దర్శించి వారి అనుగ్రహం పొందవచ్చు. శనివారం దర్శనానికి వెళ్తూ అక్కడ వేంకటేశుని ధర్శనమయితే బావుండునని అనుకున్నాను. ఆశ్చర్యంగా సోమేశ్వర స్వామి దేవాలయంలో అడుగిడగానే ఆరడుగుల స్వామి వారి విగ్రహం శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. అక్కడే 1600 ఏళ్ళ సోమేశ్వర స్వామి, అమ్మవార్లు విగ్రహాలు అనుగ్రహిస్తాయి. వీరు తమ కుమారుని బాగోగులు దగ్గరుండి చూసుకుంటారని అక్కడ అనుకుంటారు. మనకు మంచి సమయం వస్తే కానీ ఇక్కడ గణపతి స్వామి దర్శనం దొరకకపోవడం కొసమెరుపు. ఆయన ఆజ్ఞా లేనిదే అక్కడకు వెళ్ళలేము.

ఏదైనా కొత్త పని మొదలు పట్టే ముందు,
ఏదైనా కొత్త పని మొదలు పట్టే ముందు, బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు పూర్తి అవుతాయని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయన్ని ప్రతి నిత్యం వందల కొద్ది భక్తులు సందర్శించి దేవుని ఆశీర్వాదాలు పొందుతుంటారు.

కురుడుమలై ఎలా చేరుకోవాలి ?
విమానాశ్రయం : కురుదుమలె సమీపాన 110 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి కురుదుమలె చేరుకోవచ్చు.

రైల్వే స్టేషన్ :
కురుదుమలె లో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన 10 కిలోమీటర్ల దూరంలో హవేరి రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం : బెంగళూరు, చిక్కబళ్లాపూర్, కోలార్ తదితర సమీప ప్రాంతాల నుండి ప్రతిరోజూ కురుదుమలె కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

Address: Kurudumale, Karnataka 563131

Famous Temples :

Mulbagal, Karnataka,  kurudumale vinayaka temple, mulbagal temple, avani temple, kurudumale someshwara temple, garuda temple, kurudi malai temple, bangaru tirupati, kurudumale vinayaka temple history in telugu, kurudumale temple information, kurudumale temple timings.

Comments

Post a Comment