Drop Down Menus

Maha Shivratri 2024 : మహాశివరాత్రి ఎప్పుడు? మహాశివరాత్రి రోజున ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

శివరాత్రి.. ఎంతో పవిత్రమైన రోజు. హిందూవులు జరుపుకొనే ముఖ్యమైన పండగలలో ఒకటి. నిష్ఠగా పూజిస్తే.. పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శివరాత్రికి భక్తులు ఉపవాసం ఉంటారు. రాత్రి జాగారం చేస్తారు. శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి.అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము.మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం.

ఈ సంవత్సరం శివరాత్రి 8 మార్చి 2024న వస్తుంది. అయితే శివరాత్రి నాడు చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి.

మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి.

1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.

ఏం చేయాలి..

బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే లేవాలి. ధ్యానం చేయడం మంచిది. అనంతరం తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెల్ల రంగు దుస్తులను ధరించాలి. అయితే ఉపవాసానికి ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. రోజు ఉండే డైట్ మారుతుంది కదా. మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండండి. ఎక్కువసార్లు ఓం నమ:శివాయ అని వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి.

ఏం చేయకూడదు

గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకుడదు. పొగాకు, మద్యాన్ని సేవించొద్దు. శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. కేతకి పువ్వులకు దూరంగా ఉండాలి. పూజకు ఇత్తడి, రాగి, వెండి పాత్రలను ఉపయోగించేలా చూసుకోండి. స్టీల్ వద్దు. నలుపు రంగు దుస్తులను ధరించకండి. తులసి ఆకులను దేవదేవుడికి సమర్పించకూడదు.

Click here:

లింగోద్భవం అంటే ఏమిటి..? మహా శివరాత్రి లింగోద్భవ సమయం ఎప్పుడంటే..!

మహా శివరాత్రి 2024 తేదీ, ముహూర్త సమయం, ఉపవాసం ప్రాముఖ్యత!

మహాశివరాత్రి విశిష్టత పిడిఎఫ్ బుక్ ఉచిత డౌన్లోడ్.

Tags: మహాశివరాత్రి, Maha Shivratri, MahaShivaratri Story, Maha Shivaratri 2024 Date, Maha Sivaratri Story Telugu, Maha Shivaratri Rules Telugu, Maha Shivaratri Niyamalu, Shiva Pooja, Siva Stotras

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.