Cheruvugattu Sri Jadala Ramalingeswara Swamy Temple Information in Telugu | Timings


నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్టించాడనీ, ఆయన ప్రతిష్టించిన 108 శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామిదని స్థలపురాణం.

నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి గూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రం నల్గొండకు 14 కిలో మీటర్ల దూరంలో, అద్దంకి నార్కట్ పల్లి ప్రధాన రహదారికి ఒక కిలో మీటరు దూరంలో ఉంది.

Temple History:
కామధేనువు విషయంలో తన తండ్రి జమదగ్నితో వైరం పెట్టుకోవడంతోపాటు, చివరికి ఆయన చావుకు కారణమైన కార్తవీర్యార్జునుడినేకాక కనబడిన రాజులందరినీ హతమార్చాడు పరశురాముడు. ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం దేశమంతా తిరుగుతూ తపస్సు చేస్తూ గడిపాడు. ఆ క్రమంలో 108 శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు. అందులో చివరిదే నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని చెర్వుగట్టు రామలింగేశ్వర లింగంగా చెబుతారు. ఈ ప్రదేశంలో ఓ గుహలో పరశురాముడు ఘోర తపస్సు చేశాడట. తాను ప్రతిష్ఠించిన దానికన్నా శివలింగం రోజురోజుకూ పెద్దది కాసాగింది కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కావడంలేదట. దీంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు తన గొడ్డలితో శివలింగం మీద ఒకదెబ్బ వేశాడట. భక్తుడి కోపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెనువెంటనే ప్రత్యక్షమయ్యాడట. శాంతించమని చెబుతూ, ఆయన కోరినట్టే కలియుగాంతం వరకూ తాను అక్కడే ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తానంటూ వరమిచ్చాడట. తర్వాత పరశురాముడూ ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండి పోయి చివరకు శివైక్యం అయ్యాడని పురాణగాథ. ఇలా కొట్టడం వల్ల శివలింగం బీటలు వారి వెనుకవైపు జడలు జడలుగా జుట్టు ఉన్నట్టు కనిపిస్తుందట. అందుకే ఈయన్ను జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తారు. ప్రస్తుతం కొండమీద నిర్మించిన గుడిలో గుహాలయంలో స్వామి దర్శనమిస్తాడు. పార్వతీ దేవి ఆలయం విడిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండే శివాలయాల్లో చెర్వుగట్టు ప్రత్యేకమైనది. ఇక్కడి శివుడికి మొక్కితే భూత పిశాచాల బాధ వదులుతుందని కొందరూ, ఆరోగ్యం ప్రాప్తిస్తుందని కొందరూ నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగానూ పిలుస్తారు.

మూడు గుండ్లు...
ఆలయానికి సమీపంలో ఉండే మూడుగుండ్లు అనే ప్రాంతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. గుడికి కాస్త పక్కన ఓ చోట మూడు పెద్ద పెద్ద బండరాళ్లు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కే దారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. కానీ ఎంత శరీరం ఉన్నవాళ్లైనా స్వామిని స్మరిస్తూ వెళితే ఇందులోంచి అవతలికి చేరగలగటం ఇక్కడి దేవుడి మహిమకు తార్కాణంగా చెబుతారు. దేవాలయంలోని కోనేరులో స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టును చేరతారు. ఇక్కడి చెట్టు కింద చెక్కతో చేసిన స్వామి పాదుకల జతలు చాలా ఉంటాయి. వాటిని శరీరం మీద ఉంచుకుని స్వామికి మొక్కుతారు. కోనేరులోని జలం పొలాల మీద చల్లుకుంటే మంచిదని నమ్ముతారు. ఇక్కడి హనుమ, వీరభద్ర, శివరేణుక తల్లి దేవాలయాలకూ మంచి ప్రాశస్త్యం ఉంది.

How To Reach:
చెర్వుగట్టు హైదరాబాద్‌ - నల్గొండ ప్రధాన రహదారిలో హైదరాబాద్‌ నుంచి సుమారు 90 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి నల్గొండ వెళ్లే ప్రతి బస్సు చెర్వుగట్టు నుంచే వెళుతుంది. గట్టుపైకి వెళ్లాలంటే నార్కెట్‌పల్లి - అద్దంకి జాతీయ రహదారిపైన దిగి అక్కడి నుంచి 2 కి.మీ. ప్రయాణించాలి. క్షేత్రానికి రోడ్డు నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ, సూర్యాపేట నుంచి వచ్చేవారు నార్కెట్‌పల్లిలో దిగితే అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది.

Address:
Cheruvugattu, Nalgonda,
Telangana,

Temple Timings:
Morning: 5am - 1pm
Evening: 3pm - 7pm

Related Postings:

> Mandapalli Temple Information in Telugu

> 17 Special Lord Shiva Temples In India

> Juttiga Temple History in Telugu

> Thirumanancheri Temple information in Telugu

> Nageswar Jyotirliga Kshetram Temple Information Gujarat

> Trimbakeshwar Temple History in Telugu

> Thissur Lord Siva Temple History

> 7Unknown Lord Shiva Temples

> History of Kotappakonda Temple

Jadala Ramalingeswara swamy temple history in telugu, jadala ramalingeswara swamy temple, Ramalingeswara Swamy Temple, Jadala Ramalingeswara swamy temple information in telugu, Ramalingeswara swamy temple timings, sri parvathi jadala ramalingeswara swamy temple, Nalgonda jadala ramalingeswara swamy temple, telangana, hindu temples guide, cheruvugattu ramalingeswara swamy temple, cheruvugattu temple,
Share on Google Plus

About chanti achanti

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples