Drop Down Menus

Srikalahasti Rahu Ketu Pooja Details | శ్రీకాళహస్తి రాహు కేతు పూజ వివరాలు


శ్రీకాళహస్తి పేరు లో శ్రీ అనగా సాలీడు , కాళ అంటే పాము , హస్తి అంటే ఏనుగు అని అర్ధం . ఈ మూడు జీవాలకు ముక్తిని ప్రసాదించిన స్వామి కనుక అక్కడ శివునకు శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు . భక్త కన్నప్ప గురించి మనందరికీ తెలుసుకదా  శ్రీ కాళహస్తి లో భక్త కన్నప్ప కొండపైన ఉంటే స్వామి వారు కొండక్రింద ఉంటారు. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. ముందుగా సుప్రభాతం తో అమ్మవారిని మేల్కొపి ఆ తరువాత స్వామి వారికి సుప్రభాతం చదువుతారు . ఈ ఆలయం లో పాతాళ గణపతి ఉంటారు. పెద్ద వయసు ఉన్నారు దర్శించడం కాస్త ఇబ్బందే. పాతాళ గణపతి పేరుకు తగ్గట్టుగానే లోపాలకి ఉంటారు. అదృష్టవ శాత్తు ఇంకా ప్రవేశ రుసుము పెట్టలేదు. అందరు ఉచితంగానే దర్శించవచ్చు. 
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖంగాను ఉన్నారు. 
శ్రీకాళహస్తి పంచభూత లింగాల్లో ఒకటి. పంచభూత లింగ క్షేత్రాల్లో శ్రీకాళహస్తి  వాయులింగ క్షేత్రం. ఈ క్షేత్రం తిరుపతి నుంచి సుమారు 40 కిమీ దూరం ఉంటుంది. శ్రీ కాళహస్తి లో రైల్వేస్టేషన్ ఉంది . ప్రధానమైన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి . తిరుమల ఎక్ష్ప్రెస్స్ , శేషాద్రి ,  హైదరాబాద్ వెళ్లే పద్మావతి . ఇంకా చాలానే ట్రైన్ లు ఇక్కడ ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో స్నానం చేయడానికి వీలుగా బాత్ రూమ్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి ఉచిత బస్సు లు నడుపుతున్నారు. ఆటో లు కూడా అందుబాటు ధరలోనే ఉంటాయి. ఎక్కువ ఛార్జ్ ఆటో వాళ్ళు వసూలు చేయరు. ఎక్కువ మంది ఉంటే మనకి 10/-, ఒక ఇద్దరుంటే 40 తీస్కుని టెంపుల్ దగ్గర దించుతారు. ఆలయం చాలాపెద్దది ఎత్తైన గోపురాలతో ఉంటుంది. సర్వదర్శనం త్వరగానే అవుతుంది ఒక 30 నిముషాల్లో మనం దర్శనం చేస్కుని బయటకు రావచ్చు . దర్శన సమయం లో స్వామి వారికి ఎదురుగ ఉంచిన దీపాలను కూడా మీరు గమనిస్తే స్వామి వారికి కుడివైపున దీపం స్వామి వారి నుంచి వస్తున్నా గాలికి కాస్త ఎక్కువగా కదులుతున్నట్టు మనం గమనించవచ్చు. 

గ్రహణ సమయం లో శ్రీ కాళహస్తీశ్వరుని ఆలయం మూసివేయరు . గ్రహణ సమయం లో కూడా తెరిచే ఉంచుతారు . శ్రీ కాళహస్తి రాహు కేతు పూజలకు ప్రసిద్ధి . రాహుకేతు పూజలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు చేస్తారు. పూజ చేయించుకునే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి . రాకపోయినా పూజకు అనుమతిస్తున్నారు . పూజకు వచ్చే వారు ఏమేమి తీస్కుని రావాలి , పూజ ఏవిధంగా జరుగుతుంది  పూజ టికెట్స్ ధర ఎంత అనేది ఇప్పుడు మీకు చెబుతాను .  ముందుగా పూజ జరిగే ప్రదేశాన్ని బట్టి ధరను నిర్ణయించారు . గుడిలోపల చాలానే మండపాలు ఉంటాయి కదా ఒక్కో ప్లేస్ లో ఒక్కో ధర అన్నమాట . గుడిలోపల ఐతే కాస్త ఎక్కువ . రాహు కేతు పూజలకు ఉన్న ధర లు వరుసగా 500,750,1500,2500,5000 . మీరు ఏ టికెట్ తీస్కుంటారనేది మీ ఇష్టం. 
రాహుకేతు పూజ టికెట్ తో పాటు పూజకు కావాల్సిన సామాగ్రి కిట్ దేవస్థానం వారే ఇస్తారు. మనం ఇంటి దగ్గర నుంచి ఏమి తీస్కుని రావాల్సిన అవసరం లేదు. పూజ కిట్ లో కొబ్బరి కాయ , రెండు నిమ్మకాయలు , పువ్వులు , పసుపు , కుంకుమ , తాపాలపకులు , రెండు ప్యాకెట్ లు ధాన్యం, ఎరుపు మరియు నల్ల క్లాత్ ఉంటాయి. వీటి తో పాటు రాహు కేతు ఆకారం లో రెండు సర్పల్లాగా ఉన్న వెండివి ఇస్తారు .మనం ఆ నలుపు ఎరుపు గుడ్డలపైనా ధాన్యాన్ని పోసి వాటిపైన రాహు కేతువులను ఉంచి ,వాటికి ఎదురుగా రాహు కేతువులను ఉంచాలి . సర్పాలు మనవైపుకి వచ్చేలా వాటికి మధ్యలో టపాలపాకులు . రాహు కేతువులకు ఎదురుగా నిమ్మకాలను వాటికి ఎదురుగ మనం కొట్టిన కొబ్బరి కాయను ఉంచాలి. పసుపు , కుంకుమను రెండు కలిపి వాటిని నిమ్మకాయలకు రాహుకేతులకు బొట్టు పెట్టి పువ్వులతోను కుంకుమ పసుపుతోను పూజ చేయాలి . 
అక్కడ పూజారి గారు మైక్ పట్టుకుని మంత్రాలూ చదువుతూ పూజ ఏ విధంగా చేయాలో చెప్తారనుకోండి . నేను మీకు కంగారు లేకుండా కొద్దిగా చెప్పానన్నమాట. పూజ అయ్యాక మనం పూజ చేసిన వస్త్రాలను గుడిలో వదలడం కానీ , స్నానాలు చేయడం కానీ అక్కడ చేయకూడదు .  పూజ అయ్యాక ఏదైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు కానీ పూజ అయ్యాక చుట్టాల ఇంటికి వెళ్ళకూడదు . పూజ అయ్యాక నేరుగా మన ఇంటికే వచ్చేయాలి . చాలామంది తిరుపతి వెళ్లవచ్చా వెళ్లకూడదా అని అడుగుతున్నారు . చక్కగా వెళ్ళవచ్చు. అక్కడ పూజారులు చెప్పినది ఒకటే చుట్టాల ఇంటికి మాత్రం వెళ్లవద్దని . పూజ అయ్యాక ముందుగా చెప్పాను కదా రాహు కేతువులు ఇచ్చారని వాటిని హుండీ లో వెయ్యాలి . పూజ అయ్యాక మనం దర్శనానికి వెళ్తాము ఆ సమయం లో స్వామి వారి దర్శనమ్ అయ్యాక తల చుట్టూ మూడు సార్లు తిప్పుకుని హుండీలో వెయ్యాలి . 
మంగళవారం నాడు విశేషంగా రాహుకేతు పూజలు జరుగుతాయి . మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు బ్రేక్ ఉంటుంది . ఆ తరువాత సాయంత్రం  5. 30 వరకు జరుగుతాయి . ఆలయం చుట్టూ చాలానే హోటల్స్ ఉన్నాయి . భోజనాలకు ఉండటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు . తిరుపతి వెళ్ళడానికి కూడా ఆలయం దగ్గరే బస్సు లు ఆగుతాయి . ఆలయానికి రెండు మూడు ఎంట్రన్స్ లు ఉన్నాయి కావున మీరు అక్కడ వారిని అడిగితే దగ్గర దారులు చెబుతారు. పూజ చేయించుకోవడానికి వెళ్లేముందు మీరు మీ గోత్రం , నక్షత్రం , రాశి తెల్సుకుని వెళ్లడం పూజ చేసే సమయం లో మనం చెప్పుకోవాలి . మీరు మరిచిపోతే పేరు చెప్పుకుని పూజ చేయమంటారు . మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఉంటే మంచిది కదా .. 


ఇవి కూడా చూడండి :
కనకధారా స్తోత్రమ్ జరిగిన ప్రదేశం ఇక్కడే ఉంది
పరమశివుడు నిద్రిస్తున్న ఆలయం 
శివుని స్తోత్రాలు 
అరుణాచల క్షేత్ర విశేషాలు  
sreekalahasti, kalahasti, kalahasthi , kahalahasti temple timings, kalahasthi history, sri kalahasti temple details, kalahasti temple rahu ketu pooja, rahu ketu pooja tickets cost , rahu ketu pooja timings, rahu ketu pooja rules, శ్రీ కాళహస్తి రాహు కేతు పూజ వివరాలు
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments