మాఘ పురాణం 23వ అధ్యాయం | Maghapuranam 23rd Day PDF Download
మాఘపురాణం - 23వ అధ్యాయము :


బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నల్గురకు నల్గురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకొక గురుకుల విద్యార్ధి వచ్చెను.

బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోమని బలవంతము చేయ – ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను.

అంత నా కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించగా ఆ విద్యార్దియూ “మీరుకూడా పిశాచులగుదురు గాక”యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంత కాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగి పోవును” అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.


మాఘ పురాణం 24వ అధ్యాయం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.


Click Here : Magha puranam Day 24Key Words : Magha Puranam , Magha purana parayana, Magha puranam PDF Download, Magha puranam in telugu.

Comments