Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Famous Temples List In Bhadradri Kothagudem District | Telangana State

భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

ఈ భద్రాద్రి - కొత్తగూడెం నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇంతకు ముందు ఈ ప్రాంతం ఖమ్మం అనే జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినది.

1. శ్రీ రామ ఆలయం , భద్రాచలం :

కంచర్ల గోపన్న ఈ ఆలయని నిర్మించారు. 17 వ శతాబ్దానికి చెందినది. గోదావరి నది ఒడ్డున ఈ ఆలయం కలదు. భక్తుడు కొండగా తనని చేయాలని , ఆ కొండపై తన స్వామి ఆలయం నిర్మించాలి అని కోరగా ఈ ఆలయం నిర్మించారు. శ్రీ రామ నవమి , దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 8.30PM.

2. శ్రీ రామ ఆలయం , పర్ణశాల :

శ్రీ రామ స్వామి స్వయంగా ఈ ప్రదేశంలో ఉండేవారు అని భక్తుల నమ్మకం. భద్రాచలం నుంచి ఈ ఆలయానికి 35 కి. మీ దూరంలో కలదు . సీత దేవి తను అరవేసుకున్న చీర గుర్తులు, కుంకుమ , పసుపు రాళ్ళు , సీతదేవి అపహరణ , జటాయువు గుర్తులు ఇక్కడ గమనించవచ్చు. భద్రాచలం నుంచి ప్రైవేట్ వాహనాలలో కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.30PM - 3.30PM TO 7.00PM.

3. శ్రీ వేంకటేశ్వర ఆలయం , అన్నపూరెడ్డి :

ఈ ఆలయం అన్నపూరెడ్డి పల్లి అనే గ్రామంలో కలదు. టౌన్ నుంచి 25 కి. మీ దూరంలో కలదు. వైకుంటా ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 11.00AM - 3.00PM TO 8.00PM.

4. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం :

ఈ ఆలయం గర్లవడ్డూ అనే గ్రామం లో కలదు. ఖమ్మం నుంచి 35 కి . మీ దూరంలో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.30PM - 3.30PM TO 7.00PM.

5. శ్రీ  జ్ఞానాపేశ్వరాలయం , కూసుమంచి :

ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామం లో వెలసీన ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. కాకతీయుల కాలం నాటి ఆలయం. కాకతీయుల శిల్పకళకి నిదర్శనం ఈ దేవాలయం. ఈ ఆలయం మొత్తం బండరాళ్ళతో ఒకదానిపై ఒక్కటి చక్కగా అమర్చి అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయానికి దక్షిణా వైపు వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటుంది. నేడు ఈ ఆలయం శిధిలావస్థకి చేరుకుంది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 3.30PM TO 7.30PM.

6. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం , (శాస్త నగర్ ), వైరా :

ఈ ఆలయం వైరా గ్రామానికి 25 కి. మీ దూరంలో కలదు. విశాలమైన ప్రగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఆవరణలో 45 అడుగుల హనుమాన్ విగ్రహం కలదు.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.30PM - 4.00PM TO 8.00PM.

7. శ్రీ లలిత పరమేశ్వరి ఆలయం , తక్కెల పల్లి :

ఈ ఆలయం ఖమ్మం జిల్లా ఏరూపాలెం మండలం , తక్కెల పల్లిలో కలదు. ఈ ఆలయానికి 30 సం || చరిత్ర కలదు. దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.30AM TO 1.00PM - 3.30PM TO 7.30PM.

8. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , ఖమ్మం :

ఈ ఆలయం ఖమ్మం పట్టణంలో వెలసిన ఈ మహిమనిమ్మిత లక్ష్మీ నరసింహ ఆలయం ఈ ఆలయం. రెడ్డి రాజుల కాలం నాటి ఆలయం. ఈ ఆలయంలో స్వామి వారు స్వయంభూ. ఈ ఆలయానికి స్తంభాద్రి లక్ష్మీ అనే నామం కూడా కలదు. ఈ స్వామికి రోజు పానకంతో అభిషేకం నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.30PM - 3.00PM TO 8.00PM.

భద్రాద్రి - కొత్తగూడెం  జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District WiseKeyWords : Bhadradri Kothagudem Famous Temples List, Bhadradri Kothagudem District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide

Comments

Popular Posts