Bhagavad Gita 9th Chapter 23-34 Slokas and Meaning in Telugu |సరళమైన తెలుగు లో భగవద్గీత


ŚRĪMAD BHAGAVAD GĪTA NAVAMOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత నవమోఽధ్యాయః
atha navamoadhyāyaḥ |
అథ నవమోఽధ్యాయః |

yeapyanyadevatā bhaktā yajante śraddhayānvitāḥ |
teapi māmeva kaunteya yajantyavidhipūrvakam ‖ 23 ‖
యేఽప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |

తేఽపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ‖ 23 ‖


భావం : కౌంతేయా! ఇతర దేవతలను భక్తి శ్రద్దలతో భజించే వాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు.  

ahaṃ hi sarvayaGYānāṃ bhoktā cha prabhureva cha |
na tu māmabhijānanti tattvenātaśchyavanti te ‖ 24 ‖

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |

న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ‖ 24 ‖

భావం : సర్వ యజ్ఞలలో భోక్త , ప్రభువు నేనే. ఇతర దేవతల భక్తులు ఈ వాస్తవాన్ని గ్రహించలేక మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. 

yānti devavratā devānpitRRīnyānti pitṛvratāḥ |
bhūtāni yānti bhūtejyā yānti madyājinoapi mām ‖ 25 ‖

యాంతి దేవవ్రతా దేవాన్పితౄన్యాంతి పితృవ్రతాః |

భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోఽపి మామ్ ‖ 25 ‖

భావం : దేవతలను సేవించే వాళ్ళు దేవతలనూ, పితృదేవతలను ఆరాధించే వాళ్ళు పితృదేవతలనూ, భూతాలను అర్పించే వాళ్ళు భూతాలను పొందుతారు. నన్ను పూజించే వాళ్ళు నన్నే పొందుతారు. 

patraṃ puśhpaṃ phalaṃ toyaṃ yo me bhaktyā prayachChati |
tadahaṃ bhaktyupahṛtamaśnāmi prayatātmanaḥ ‖ 26 ‖

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |

తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ‖ 26 ‖

భావం : పరిశుద్ధుడైన మనస్సు కలిగినవాడు భక్తితో నాకు ఆకుకాని, పువ్వుకాని, పండుకాని, నీరుకాని సమర్పిస్తే సాధారంగా స్వీకరిస్తాను.  

yatkarośhi yadaśnāsi yajjuhośhi dadāsi yat |
yattapasyasi kaunteya tatkuruśhva madarpaṇam ‖ 27 ‖

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |

యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ‖ 27 ‖

భావం : కౌంతేయా! నీవు ఏం చేసినా భోజనం చేసినా, హోమం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా నాకు ఆ సర్వం సమర్పించు. 

śubhāśubhaphalairevaṃ mokśhyase karmabandhanaiḥ |
saṃnyāsayogayuktātmā vimukto māmupaiśhyasi ‖ 28 ‖

శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |

సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ‖ 28 ‖

భావం : శుభాశుభఫలాలు కలగజేసె కర్మబంధాల నుంచి నీవు అలా విముక్తి పొందుతావు. సన్యాసయోగం అవలంబిస్తే జీవించి వుండగానే ముక్తిపొంది, మరణనంతరం నన్ను చెరుతావు.

samoahaṃ sarvabhūteśhu na me dveśhyoasti na priyaḥ |
ye bhajanti tu māṃ bhaktyā mayi te teśhu chāpyaham ‖ 29 ‖

సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః |

యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ‖ 29 ‖

భావం : సమస్త ప్రాణుల పట్ల సమభావం కలిగిన నాకు విరోధి కాని ఇష్టుడుకాని లేడు. నన్ను భక్తితో భజించే వాళ్ళు నాలోనూ, నేను వాళ్ళలోనూ వుంటాను.  

api chetsudurāchāro bhajate māmananyabhāk |
sādhureva sa mantavyaḥ samyagvyavasito hi saḥ ‖ 30 ‖

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |

సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ‖ 30 ‖

భావం : ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్రచిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది. 

kśhipraṃ bhavati dharmātmā śaśvachChāntiṃ nigachChati |
kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati ‖ 31 ‖

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |

కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ‖ 31 ‖

భావం : అలాంటివాడు అచిరకాలంలోనే ధర్మాత్ముడై, శాశ్వతశాంతి పొందుతాడు. కౌంతేయా! నా భక్తుడెప్పుడు చెడిపొడని ఘంటాపధంగా శపధంచేసి మరి చెప్పు. 

māṃ hi pārtha vyapāśritya yeapi syuḥ pāpayonayaḥ |
striyo vaiśyāstathā śūdrāsteapi yānti parāṃ gatim ‖ 32 ‖

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః |

స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేఽపి యాంతి పరాం గతిమ్ ‖ 32 ‖

భావం : పార్ధ! నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే పాపజన్మలుగాని, స్త్రీలుకాని, వైశ్యులుకాని, శుద్రులుకాని పరమశాంతిపదం పొందుతారు.  

kiṃ punarbrāhmaṇāḥ puṇyā bhaktā rājarśhayastathā |
anityamasukhaṃ lokamimaṃ prāpya bhajasva mām ‖ 33 ‖

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |

అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ ‖ 33 ‖

భావం : ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల గురించి వేరే చెప్పాలా ? సుఖం లేని అశాశ్వతమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు.  

manmanā bhava madbhakto madyājī māṃ namaskuru |
māmevaiśhyasi yuktvaivamātmānaṃ matparāyaṇaḥ ‖ 34 ‖

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |

మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః ‖ 34 ‖

భావం : నామీదే మనస్సు, భక్తి కలిగి నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా నన్ను ఆశ్రయించి, నా మీదే మనస్సు నిలిపితే నన్నే పొందుతావు.

oṃ tatsaditi śrīmadbhagavadgītāsūpaniśhatsu brahmavidyāyāṃ yogaśāstre śrīkṛśhṇārjunasaṃvāde
rājavidyārājaguhyayogo nāma navamoadhyāyaḥ ‖9 ‖ ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమోఽధ్యాయః ‖9 ‖
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 9th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments