లక్ష్మీదేవి నిత్య పూజలో..చేయాల్సినవి..!
ఏ కుటుంబం సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండాలన్నా ...
ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోవాలన్నా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. లక్ష్మీదేవి ప్రసాదించే సిరిసంపదలే అందరి జీవితాలను ఆనందమయం చేస్తుంటాయి.
అందువలన అందరూ ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
Also Read: కరోనా టెస్టు కోసం ఇలా చేయండి
లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం కనుక,
అమ్మవారికి ఆ రోజున అందరూ కుంకుమ పూజ చేస్తుంటారు.
సిరిసంపదల కన్నా ముఖ్యమైన సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుతుంటారు.
ఈ నేపథ్యంలోనే చాలామందికి ఒక సందేహం వస్తూ వుంటుంది.
లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించినా కుంకుమతో మాత్రమే పూజించాలేమోనని అనుకుంటూ వుంటారు.
అయితే ప్రతి నిత్యం అమ్మవారిని కుంకుమతో మాత్రమే పూజించాలనే నియమమేదీ లేదు.
కుంకుమ పూజ అమ్మవారికి చేసే ప్రత్యేక పూజగా మాత్రమే భావించాలి.
నిత్య పూజకి సంబంధించిన విషయానికి వచ్చే సరికి లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించాలి. తెలుపు ... పసుపు .. ఎరుపు రంగు పూలు అమ్మవారి పూజకి శ్రేష్ఠమైనవిగా చెప్పబడుతున్నాయి.
అమ్మవారిని సంతోష పెట్టడంలోను ...
భక్తులు సంతృప్తి చెందడంలోను..
పుష్పాల సేకరణ ప్రధాన పాత్రను పోషిస్తుంది.
Also Read:జూలై 31లోపు ఈ అకౌంట్ తెరిస్తే.. చేతికి రూ.64 లక్షలు
అమ్మవారికి ఒక్కో రకం పుష్పాలు వాడటం వలన
ఒక్కో ఫలితం కనిపిస్తుంది.
ఒకవేళ అమ్మవారి పూజకి అవసరమైన పుష్పాలు లభించని పక్షంలో, అక్షింతలతో అమ్మవారిని సేవించాలని శాస్త్రం చెబుతోంది.
అక్షింతలతో అమ్మవారిని పూజించడం వలన ఫలితం తక్కువగా ఉంటుందేమోననే సందేహమే అవసరం లేదు. కనుక ఇంట్లోని పూజ మందిరంలో అమ్మవారి ప్రతిమను పుష్పాలతోను ... అక్షింతలతోను ఆరాధించవచ్చు.
అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లి మనసు గెలుచుకుని అష్టైశ్వర్యాలను పొందవచ్చు.
ఈవస్తువులు మీ ఇంట్లో ఉంటే…
లక్ష్మి దేవి మీ ఇంటికి నడిచి వస్తుంది
మన పురాణాల ప్రకారం లక్ష్మి పూజ చేసి లక్ష్మి దేవికి స్వాగతం పలకటం మరియు లక్ష్మి స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
Also Read: భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
తెల్లని వస్త్రం పరచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చేమంతి పూలతో పూజిస్తే మంచిది.
అలాగే గులాబీ,తామర పువ్వు,మల్లెలు,సన్నజాజులు వంటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది.
అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి పూజ చేయాలి.
లక్ష్మి దేవిని పైన చెప్పిన ఏ పువ్వులతోనైనా అష్టోత్తరం చేసి తీపి పదార్ధాలను నైవేద్యంగా పెడితే సకల సంపదలు చేకూరుతాయి.
వ్యాపారం చేసే వారు తమ షాప్ లలో తప్పనిసరిగా లక్ష్మి దేవి పూజ చేస్తారు.
ఇలా చేస్తే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుందని నమ్మకం.
మన ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మి దేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read: 100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన
పూజ గదిలో లక్ష్మీ దేవి, వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణేలను ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది.
పూజ గదిలో నెమలి ఫించాన్ని ఉంచితే లక్ష్మి దేవి అనుగ్రహం లభించటమే కాకుండా ఇంటిలోని నెగిటివ్ శక్తి బయటకు పోయి పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటుంది. పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటే మనం చేసే పనులు విజయవంతం అవుతాయి.
తామర పువ్వుపై కూర్చొనే లక్ష్మి దేవికి తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మి కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి.
లక్ష్మిదేవి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయకండి..!
పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు,
నిబంధనలు పెట్టారు.
అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు,
నమ్మకం లేని వాళ్ళు పాటించరు.
Also Read: సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. సాయంత్రం సమయంలో అలా చేయకూడదు,
ఇలా చేయకూడదు అని చెబుతూ ఉంటారు.
కానీ.. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. అలా చేయడం వల్ల మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట.
చిన్న చిన్న అలవాట్లే.. మన అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను మార్చేస్తాయంటారు.
కాబట్టి మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే..
మీరు కచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఈ పనులు చేయకండి..
Also Read : లక్ష్మీ దేవి మీ ఇంటికి వచ్చేముందు మీకు ఈ సంకేతాలు కనిపిస్తాయి
1) తులసిని పూజించకూడదు:
హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించడం, ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం వెంటాడుతుంది.
2) సూర్యాస్తమయం తర్వాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించొచ్చు.
ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే.. లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు.
Also Read : స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
3) చెత్త ఊడవకూడదు:
సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు.
శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల..
మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుందట.
4) నిద్రపోకూడదు:
సూర్యాస్తమయం సమయంలో.. నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు, నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అలాగే సాయంత్రం పూట నిద్రపోతే..
ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలకు..
కారణం అవుతుంది.
Also Read : ధనదేవత లక్ష్మి దేవి ఉండే స్థానాలు ఏవో తెలుసా ?
5) తిన్న వెంటనే కడిగేయాలి:
ఆహారం తిన్న వెంటనే.. పాత్రలు శుభ్రం చేయకపోతే..
శని, చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే.. అన్నం తిన్నవెంటనే ప్లేట్ శుభ్రం చేయడం వల్ల.. లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు పొందగలుగుతారు.
6) పరిసరాలు శుభ్రంగా ఉంచాలి:
మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో, ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది.
ఇలా చేయడం వల్ల.. మీ చుట్టు పక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.
ఓం శ్రీ లక్ష్మీ దేవ్యై నమః...!
Also Read : శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
లోకా సమస్తా సుఖినోభవంతు..!
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శనేశ్వరుడు శనివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> శివదేవుని సోమవారపు నోము కథ
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
శుక్రవారం, lakshmi devi pooja, lakshmi devi pooja in telugu pdf, lakshmi devi patalu, lakshmi puja, lakshmi devi puja mantra, lakshmi pooja vidhanam, lakshmi devi pooja patalu, lakshmi devi pooja songs, lakshmi devi stotram, Lakshmi devi , money, Devotional, Lakshmidevikataksham,Lordlakshmidevi
Comments
Post a Comment