Drop Down Menus

ఈ పవర్‌ఫుల్ మంత్రాలతో పూజచేస్తే లక్ష్మీ అనుగ్రహం | Lord Lakshmi Devi Powerful Mantrams in Telugu

పురాణాలు, ఇతిహాసాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. దీని వల్ల అపరమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. క్రమ పద్ధతిలో వీటిని ఉచ్ఛరిస్తే పాజిటివ్ వైబ్స్ సిద్ధిస్తాయి. విశ్వంలోని ఈ వైబ్స్ మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం.
దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు. ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైంది. మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సొంతమవుతాయి.
ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:
మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ:
మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.

ఓం శ్రీం శ్రీ అయే నమ:
మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.
ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం.
ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.

ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః

ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ:
అనే శుక్ర బీజ మంత్రాన్ని శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. పూజగదిని శుభ్రం చేసి, లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. శుక్ర బీజ మంత్రం. దీన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం ఉచ్ఛరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయట.
ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః ఏకాదశాక్షర సిద్ధ్ 
మంత్రం వల్ల సిద్ధి పొందుతారు.

ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా। మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం..
ఈ మహాలక్ష్మి మంత్రం చెడును అంతం చేసి సుఖసంతోషాలను కలగజేస్తుంది.

మహాలక్ష్మీ ముల్లోకాలలో పూజించబడుతుంది. శ్రీమహావిష్ణువు పట్టమహిషి, భగవాన్ శ్రీకృష్ణుడి భార్య. మాతోనే స్థిరంగా ఉండిపోవాలని అందరూ కోరుకుంటున్నారు.
సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలుపెడతారు. పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమైన రోజు. జపమాల కానీ, స్ఫటిక మాలతో మంత్రపఠనాన్ని గావించాలి.
Famous Posts:








lakshmi devi powerful mantra in telugu, lakshmi moola mantra in telugu pdf, vyuha lakshmi mantra in telugu download, lakshmi devi slokas in telugu lyrics, lakshmi kubera mantra in telugu pdf, laxmi mantra for money, lakshmi devi slokas | telugu, lakshmi devi stotram telugu, kanakadhara stotram in telugu, lakshmi devi mantram
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.