దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందిన నంజనగూడు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ సమీపంలో కపిల నది ఒడ్డున ఉంది..
పూర్వం సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ నివశించాడని భక్తుల నమ్మకం. ఇక్కడ శివుడు పేరు నంజుంరేశ్వరుడు. నంజుంరేశ్వరుడు అంటే విషాన్ని కంఠంలో నిలుపుకున్నవాడు.
సముద్ర మధనం సమయంలో వెలువడిన విషాన్ని లోక రక్షణార్థం తాగటం,పార్వతిదేవీ అడ్డుపడి ఆ విషం తన కంఠంలోనే నిలుపుకున్నట్లు చేయడం వలన శివుడికంఠం నీలంగా మారిపోతుంది అప్పటినుండి ఈశ్వరుడిని నీలకంఠుడు , నంజుంరేశ్వరుడు అని అంటారు. ఆ విషాన్ని తన కంఠంలోనే నిలుపుకుని శ్రీకంఠుడైనాడు. ఇక్కడ శివుడిని శ్రీ కంఠేశ్వరుడు.
9 వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం దాక ఈ క్షేత్రాన్ని గంగులు, చోళులు, హొయసలులు, శ్రీకృష్ణదేవరాయలు, ఒడియారులు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఈ దేవాలయ గోపురం 120 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది. కర్ణాటక దేవాలయలయలో అతిపెద్ద దేవాలయం ఇది. ఏడు అంతస్తులతో పైన బంగారు రేకుతో తాపడం చేయబడిన ఏడు కలశాలతో అందంగా అలరారుతూ ఉంటుంది. చుట్టూ ప్రాకారం ఎత్తు 12 అడుగులు,50,000 చదరపు అడుగుల వైశాల్యం లో నిర్మింపబడిన ఈ ఆలయంలో, ద్వారా పాలకుల విగ్రహాలతో సహా 122 కన్నా ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి. వీటిలో శివుని అనేక రూపాల విగ్రహాలు భక్తులనాకర్షిస్తాయి. లోపలి గోడలపై ముద్గల పురాణంలో చెప్పబడ్డ 32 రూపాల గణపతి విగ్రహాలు ఉన్నాయి.
ఈ ప్రాంగణంలో మూడు ముఖ్య ఆలయాలు ఉన్నాయి. శ్రీ నంజుండేశ్వరుడు, పార్వతీదేవి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు, లింగరూపంలో ఉన్న పరమశివుడు. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో పెద్దజాతర,చిన్నజాతర జరుపుతారు. పెద్ద జాతర సమయంలో రధోత్సవం ఘనంగా జరుగుతుంది.
Srikanteshwara Temple Address:
Nanjangudu,
Chamarajanagara Rd,
Mullur District,
Karnataka State,
Pin:571301.
SriKanteshwara Temple Timings:
Only In Mon, Tue, Wed, Thu, Fri
Morning: 6:00 AM - 1:00 PM
Evening: 4:00 PM - 8:30 PM
The Nearest Railway Station:
Mysore Jn Train Station , 22 km from Srikanteshwara Temple.
The Nearest Airport:
Mysore airport , mysore, 20 km from Lord Srikanteshwara Temple.
Key Words: Siva Temples,Karnataka State famous temples, Famous temples in Karnataka,Srikanteshwara Temple address,Lord shiva temples in Karnataka,Srikanteshwara Temple Timings,Hindu temples Guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment