ఈ ఏడాది ఐదు సోమవారాలు అది ఒక రోజు పండుగ కాదు.. నెల రోజుల పండుగ.. అదే కార్తీక పండుగ. కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగలో ఈ సారి చాలా ప్రత్యేకతలున్నాయి.
కార్తీక మాసం ప్రారంభం కావడమే సోమవారం ప్రారంభమవుతుంది. అందునా కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ప్రత్యేకత.. మరొక ప్రత్యేక ఏమిటంటే ఈ ఏడాది కార్తీకమాసంలో 5 సోమవారాలు వచ్చాయి.ఈ పండుగ ఈ నెల 31 నుంచి వచ్చే నెల 30తేదీ వరకు ఉంటుంది.. అటువంటి ఆధ్యాత్మిక పండగ నెలలో వచ్చే వాటి గురించి తెలుసుకుందాం... ఆచరిద్దాం..
1వ తారీఖున సోదరి ఇంట భోజనం చేయాలి
కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.. దీనినే భగినీ హస్త భోజనం.. అన్నా చెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు.ఈ పండుగ నవంబరు 1వ తేదీన వస్తోంది. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒక రోజు అలక చెందగా ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక భాదలు ఉండవని చెబుతారు.అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
3వ తేదిన నాగుల చవితి...
మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి. ఈ రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు. పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి. సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడుని ప్రార్థిస్తాడు. ఆయన ఆ యాగాన్ని ఆపించడం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుంది. అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలు పోసి వారికి సమర్పిస్తారు.
10వ తేదిన ఏకాదశి ఉపవాసాలు
కార్తీక మాసంలో వచ్చే నెల 10వ తేదీన ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఉపవాసాలు ఉంటారు.మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగిలేస్తారు. అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మ ణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు.
11వ తేదిన క్షీరాబ్ది ద్వాదశి
11వ తేదీ సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి (ఉసిరి మొక్క)ను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. 12,16,21 దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు.ఆ రోజున ప్రతీ ఇంటా ఈ దీపాల వెలుగులతో నిండిపోతుంది.
14వ తేదిన కార్తీక పౌర్ణమి
కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలి తం ఉంటుందని పండితులు చెబుతున్నారు.వచ్చే నెల 14వ తేదీన ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరున్ని పూజించి 365 ఒత్తులు వెలిగించి చం ద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. అంతే కాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయం పాకం ఇప్పిస్తారు.
30వ తేదిన పోలి స్వర్గం
కార్తీక మాసం ఆఖరి రోజు వచ్చే నెల 30న అమావాస్య వెళ్లిన మరుసటిరోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు.దీనికి సంబంధించిన కథను పురోహితుల ద్వా రా విని వారికి స్వయంపాకాలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాల్వలో గానీ, చెరువులోగానీ వదులుతారు .దాంతోకార్తీక మాసం దీక్షలు పరిసమాప్తి అవుతాయి.
Credits: Sai Anjeneya Prasad Dodla
2016 karhikamasa importance, karthika masa puranam in telugu, karthika masam special, importance of the karhika masam in telugu, karthika puranam telugu pdf files