వేదమాత అయిన శ్రీ సరస్వతి,సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు,పవిత్ర గోదావరి నది తీరం ఈ మూడు విశేషములు వలన వేదనిలయమై శోభిల్లుచున్నది. వ్యాసుడు ఈ క్షేత్రంలో తపస్సు చేసిన కారణంగా ఈ ప్రాంతం వ్యాసపురిగా ప్రసిద్ధి చెందింది. ప్రధాన ఆలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం,దత్తపాదకులు,పశ్చిమభాగమున మహాకాళీ దేవాలయం,దక్షిణ దిశలో శ్రీ వ్యాస మందిరం ఇందులో వ్యాసభగవానుని విగ్రహము,వ్యాస లింగము ఉన్నాయి.ఆలయ ప్రాంగణంలో జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు అశ్రద్ధ చూపిస్తారు.గుడి సమీపంలో వాల్మీకి సమాధి పాలరాతి శిలతో ఉంటుంది. ఈ మందిరానికి దగ్గర్లో ఒక గుహఉంది. ఇది నలహరి మలుకుడు తపస్సు చేసిన స్థలం అని అంటుంటారు. అక్కడే ధనపుగుండు అనే శిల తడితే ఒకో ప్రక్క ఒకో శబ్దం వస్తుంది. అందులోనే సీతమ్మవారి నగలు ఉన్నాయంటారు. ఇక్కడి సమీపంలోనే 8 పుష్కరిణిలు ఉన్నాయి. అవి ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం,వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్థం,గణేష్ తీర్థం, పుత్ర తీర్థం,శివతీర్థం.మహా శివరాత్రి,వసంత పంచమి, దేవి నవరాత్రులు,వ్యాసపూర్ణిమ,వంటి రోజులలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ప్రతి రోజు ఉదయం అమ్మవారికి అభిషేకాలు,కుంకుమార్చనలు,పల్లకీసేవ,వాహనపూజలు జరుగుతాయి.
Sri Gnana Saraswathi Temple Timings :
Morning : 5 am to 12 pm
Evening : 4 pm to 9 pm
Accommodation :
Basara Devasthanam Phone number: (91) 08752243503 Sri Gnana Saraswathi Temple Address :
Sri Gnana Saraswathi Devasthanam,
Basara,
Mudhole Mandal,
Adilabad.
Pin-504101,
Telangana,
phone :(91) 08752-243503.
Sri gnana saraswathi temple details,gnana saraswathi temple information in telugu,basara sri saraswathi temple information,famous temples in basara,history of sri gnana saraswathi temple, sri saraswathi temple pdf file, basara saraswathi temple information in telugu, best temples information in hindu temples guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Hi Raja Chandra, I think you missed Saraswathi Kshetra , which is in Sringeri and is a Sakthi peetham as well
ReplyDelete