Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఉగాది ప్రాముఖ్యత-ఆచారాలు&సంప్రదాయాలు - Importance of Ugadi

 
ఋతువులు మారుతూ ఉంటాయి. వాటితోబాటు అవి మనకు పంచి ఇచ్చే అనుభూతులు మారుతుంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది. శిశిరంలో మోడై పోయిన చెట్లన్నీ వసంతలో చిగురించి కొత్త సింగారాలొలుకుతాయి.
ఋతువుల్లో వసంతఋతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకోని తోలిఋతువుగాను చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తోలి మాసం చైత్రం. తిథుల్లో తోలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించింది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అంటోంది బ్రహ్మపురాణం. అదే యుగాది. అన్నీ తొలిగా వచ్చే ఆరోజునే తెలుగువారు తొలిపండుగగా ఉగాది ని జరుపుకుంటారు.
రామపట్టాభిషేకం జరిగిందీ, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ, కలియుగం ప్రారంభమైంది ఆ రోజేనని పండితులు చెబుతారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్తలు వరాహమిహిరుడు అంచనాల ప్రకారం చైత్రమే తొలిమాసం. ఆరోజే తోలి పంచాంగాన్ని జన జీవన స్రవంతికి అంకితం చేసాడాయన. విక్రమార్కుడు, ఆంధ్రరాజులు చక్రవర్తి శాలివాహనుడు సింహాసనాన్ని అధిష్టించింది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే.
ఉగాది పచ్చడి :
ఈ పండుగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది 'ఉగాది పచ్చడి ' మామిడిపిందెలు, వేపపువ్వు, కొత్తబెల్లం, చింతపండు, పచ్చిమిరప, ఉప్పు వేసి చేసే ఈ పచ్చడిలోనే ఆరురుచులు జీవితంలోని సుఖదుఃఖాలకు ప్రతీకలు. ఈ జీవనతత్వం ఎలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుచులతో గూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త, దోషలేమయినా ఉంటే పోతాయంటారు. వేపపువ్వులో యాంటిసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. క్రిముల్ని, చర్మరోగాల్ని నివారించే శక్తీ ఉంది. మామిడిముక్కలు రక్తప్రసరణదోషాలను నివారిస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్తబెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరు కోకుండా చూసే పని ఉప్పుది. కొత్తకుండలలో ఈ పచ్చడిని చేయడంవల్ల అది చల్లగా ఉంటుంది. వీటితోపాటు చెరకుముక్కలు, అరటిపండును కూడా కలుపుతుంటారు కొందరు.
పంచాంగ శ్రవణం:
ఉగాదినాడు విధిగా పంచాంగశ్రవణం ఉంటుంది. ఎందులోనూ పరమార్ధముంది. ఇది మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దంపట్టే సంప్రదాయం. ఇందులో ఐదు అంగాలుంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కారణాలు.
ఛత్రచామరాల సేకరణ :
చైత్రం నుంచీ ప్రత్యక్షనారాయణుడి కిరణాల పదును పెరుగుతుంది. కాబట్టి గొడుగులు, విసనకర్రలు సేకరించుకుంటారు.

ప్రపాదన ప్రారంభం :
"ప్రప' అంటే చలవపందిరి. ప్రపదానం అంటే చలివేంద్రం పెట్టి దాహం తీరే తీర్ధాలు ఇవ్వడం. అదీ ఆ రోజే ప్రారంభిస్తారు.
వసంత నవరాత్రి ఉత్సవం:
ఉగాదితో ప్రారంభించి తొమ్మిదిరోజుల వరకూ ఈ వేడుకల్ని జరుపుతారు. ఏడాదిపొడవుగా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి తర్వాత వచ్చే దశమి వరకూ రాముడిని వేడుకుంటూ వీటిని నిర్వహిస్తారు.

చిన్న చిన్న మార్పులున్నప్పటికీ మన ఆచారాలూ, సంప్రదాయాలన్నిటిలోను ఏదో ఒక పరమార్ధముంది. అందుకే వాటిని పండుగ ల రూపంలో మన జీవనంలో భాగం చేశారు పెద్దలు..
Tags: Ugadi, ugadi importance of telugu, ugadi information in telugu, ugadi history, ugadi telugu matter, ugadi festival, ugadi temple information in telugu, ugadi telugu information, best temples information in hindu temples guide.com,

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు