Drop Down Menus

Chaya Someswara Temple Mystery In Telugu | Chaya Someswara Temple

ఛాయా సోమేశ్వరాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్టంలో నల్లగొండ జిల్లాలోని నల్లొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలోని  పచ్చని పొలాల మధ్య  11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటి ఒక పురాతన దేవాలయం. ఇక్కడ పరమేశ్వరుడు ఛాయా సోమేశ్వరుడిగా భక్తులతో నిత్యపూజలు అందుకుంటున్నాడు.

Temple Timings
6.00 am to 12.00 pm

4.00 pm to 8.00 pm
సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఛాయా సోమేశ్వరాలయం కూడా  ఒకటి. 
సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ఛాయా సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోళులు పరిపాలించిన ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్ర అద్బుతం.
ఇక్కడి ఛాయా సోమేశ్వరుడు ఎంతో ప్రాముఖ్యత మరియు విశిష్టతను కలిగి ఉన్నాడు. అది ఎందుకో తెలిస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది.  
ఈ దేవాలయంలో  ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని అంతుచిక్కని ఆ నిగూఢాన్ని రహస్యం  అ గ్రామంలోని  ఛాయా సోమేశ్వరాలయం ఉన్నది.
ఊరికి దూరంగా  పొలాల మధ్య  రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. 
తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు.ఈ ఆలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి. 
పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయం. మండప స్థంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూప లతలు, పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా, ద్వారానికిరుపక్కలా విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. 
ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనుపించి హృదయాన్ని కలవర పరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా, ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు.క్రీ.శ.11 మరియు 12 శతాబ్దకాలంలో కుందూరు చోళులు నిర్మించినట్లుగా మనకు ఆర్కియాలజీ మరియు మ్యూజియం విభాగం వారి వివరాలను బట్టి తెలుస్తుంది. 
ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. 
అతి ముఖ్యమైంది  ఈ దేవాలయం  గర్బగుడిలో శివలింగము వెనుక వున్న గోడపై పగలు మొత్తం కనిపించే, సూర్యరశ్మితో సంభంధం లేని స్తంభాకార నీడ ఇక్కడి విశేషము. విషయానికి వస్తే ఈ ఆలయానికి పడమర ఉన్నటువంటి గర్భగుడిలో శిలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చల ఛాయ, సూర్యుని స్థానముతో సంబంధం లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏర్పడడం ఈ ఆలయం సంతరించుకున్నటువంటి అద్భుతం. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. 
అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు.  ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఆ నీడ ఏ వస్తువుది అన్న విషయము కూడా ఇంతవరకూ అంతు చిక్కలేదు. 
అలనాటి నిర్మాణకౌశలం, శిల్ప నైపుణ్యం మరియు శాస్త్ర సిద్ధాంతాల మేళవింపుకు ప్రతీకగా ఈ ఆలయాన్ని పేర్కొవచ్చు. 
రెండోవ  ప్రత్యేకత: 
అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్బగుడిలో కూడా నీరు ఉబికి రావడం. 
చెరువు ఎండితే గర్బగుడిలో నీరు కూడా ఎండిపోతుంది. శివ భక్తులు ఇది అంత ఈశ్వరుడి లీలా అని నమ్ముతారు.ఇది ఒక్క యాత్రిక ప్రదేశము ఈ దేవాలయాన్ని చూడడానికి అందరూ ఎంతగానో ఇష్ట పడడమే కాకుండా ఈ దేవాలయంలో చోటు చేసుకున్న ఈ నీడ రహస్యాన్ని చేధించడానికి ఆసక్తి చూపుతారు. 
Related Postings 

Transport:
Panagal is located 4km from the district headquarters of Nalgonda. Nalgonda is easily accessible by road and rail, situated 100km away from Hyderabad. Panagal is next to Nalgonda city on Addanki - Narkatpally highway which extends to Hyderabad around 94km, Suryapet around 55km, and Guntur around 190km.
By Road: 
The buses are frequently available in Nalgonda to reach the temple.
By Train:
The railway lines are well connected from all the major cities of the country. Nalgonda is the nearest railway station which is around 2.5km away from the temple. 
By Air: 
The Nearest International Airport is at Hyderabad around 118km. The other nearest airport is at Vijayawada around 204kms to the temple.

keywords:
Searches related to chaya someshwara temple,chaya someshwara temple timings,chaya someshwara temple mystery,chaya someswara temple history,chaya someswara swamy temple distance from hyderabad,pachala someswara temple,chaya someshwara temple wiki,someswara temple mystery revealed,hyderabad to chaya someshwara alayam,Chaya Someshwara temple In Telugu,Chaya Someshwara temple History In Telugu,Chaya Someshwara temple Story In Telugu,Mysterious Chaya Someshwara Swamy Temple Panagal,Chaya Someswara Panagal - Nalgonda, History, Timing, Mystery,Physics lecturer throws light on mystifying shadow,Chaya Someswara Temple Shadow,Chaya Someshwara Temple - Panagal, Nalgonda,Mysterychaya someswara temple mystery in telugu Chaaya Someshwara Temple,chaya someswara temple mystery in telugu
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.