Drop Down Menus

What is the significance of giving the Talaneelalu (hair) to God? | Talaneelalu

దేవునికి తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి?
చాలా దేవాలయాల్లో భక్తులు తలనీలాలు ఇవ్వడం అనేది ఎప్పటినుంచో ఉన్న ఆచారం. ముఖ్యంగా, ఈ ఆచారం తిరుమలలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. తిరుమలలో దేవునికి కల్యాణకట్ట వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.
కలియుగంలో మనుషులు చేసే పాపాలను తొలగించేది కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి. అందుకనే ఆయన సన్నిధానంలోనే తలనీలాలు సమర్పించడానికి భక్తులు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
దేవుడికి తలనీలాలు సమర్పించడమే సంప్రదాయాన్ని వేదకాలం నుంచి భారతీయులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతంలో కేశఖండనకు ప్రాధాన్యత ఉంది. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయమని పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిని దైవానికి సమర్పిస్తే మన పాపాలను తొలగించుకుంటామని నమ్మకం. శిశువు జన్మించినప్పుడు ముందు తల భాగం బయటకు వస్తుంది. తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి.
అందుకే చిన్న వయసులో కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను తనలో దాచుకున్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతుడికి తలనీలాలు సమర్పిస్తామని భక్తితో మొక్కుకుతాం. ఒక విధంగా చెప్పాలంటే మన శిరస్సును దైవానికి అర్పించడానికి బదులు తలనీలాలను ఇస్తాం. దీని గురించి మహాభారతంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. 
మహాభారతంలో ఓ సంఘటన:
కౌరవుల సోదరి దుశ్శలను పాండవులు సైతం ఎంతగానో అభిమానించారు. ఆమెకు సింధు దేశపు రాజు జయద్రధుడి (సైంధవుడు)తో వివాహం జరిగింది. కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు ఒప్పందం ప్రకారం వనవాసానికి వెళ్లారు. పాండవుల లేని సమయంలో వరసకు సోదరి అయ్యే ద్రౌపదిని సైంధవుడు అపహరించి, తన రథంపై బంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన పాండవులు సైంధవుడిని అడ్డుకుని, ద్రౌపదిని విడిపించారు. ఆవేశంతో భీముడు అతడిని సంహరించబోతే ద్రౌపది వారించింది.
సైంధవుడిని చంపితే మీరు ప్రేమగా చూసుకున్న సోదరి దుశ్శల వెధవరాలిగా మారుతుందని అనడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అతడి తల వెంట్రుకలను తీసేస్తే, తలతీసేసినంత పనవుతుందని ధర్మరాజు చెప్పడంతో గుండు గీసి, అవమానించి పంపుతారు. ఈ అవమానభారంతో పాండవులపై ప్రతీకారం తీర్చుకోడానికి సైంధవుడు కఠోర తపస్సు చేశాడు. 
ఇక తిరుమలలో శ్రీవారికి కేశఖండన చోటును కల్యాణకట్ట అంటారు. హిందూ సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభం పలకాలనేది పెద్దల భావన. అందుకే క్షవరానికి బదులు కల్యాణమని ఉచ్చరించాలని జనమేజయుని సోదరుడు శతానీకుడు సూచించాడు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చి, కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. ‘వేం’ అంటే పాపాలు.. ‘కట’ అంటే తొలగించేవాడు. కాబట్టే శ్రీనివాసుని కలౌ వేంకటనాయక అయ్యాడు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకే ఆయన సన్నిధానంలో శిరోజాలు సమర్పించడానికి అంతటి ప్రాధాన్యత ఉంది. 
Related Postings:

Keywords:
దేవుడికి తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి.,Why We Offer Talaneelalu (Hair) to God?, Dharma Sandehalu,తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు,Talaneelalu,Talanilalu Images,Talaneelalu History,,Why We Offer Talaneelalu to God in Telugu?,తలనీలాలు తిరుపతిలో కాకుండా ఇతర క్షేత్రాలలో కూడా సమర్పించవచ్చా? - ధర్మ సందేహాలు,Belief behind donating hair at Temples,Download Belief Behind Donating Hair At Temples,Why do we offer hair to God ?Devotees donating hair at Tirumala demand for barber services ,Tirumala,Tirupati,Lord balaji,Download Belief Behind Donating Hair At Temples ,Why are Talaneelalu Gives to Bhagavan,Sri Balaji Temple Tirumala Tala Neelalu you never seen video,Talaneelalu in telugu,TTD Talaneelalu,talaneelalu in tirumala,talaneelalu in english,puttu ventrukalu


ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Very nice Post, thanks for more information, I have share to Sri Garuda Travels. We are daily provided to Chennai to Kalahasti Tour Package morning (6.00 am To 9.00 pm), car type:- Indica, Swift Dzire, Etios, Innova, Innova Crysta, Tavera, Xylo, Tempo Traveller.
    Chennai To kalahasti Tour Package | Kalahasti Tour package From Chennai

    ReplyDelete

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.