Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tamil Nadu Tour Planing | Chennai Chidambaram Rameswaram Thanjavur Kanyakumari


ఒక వారం రోజుల తమిళనాడు టూర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ పోస్టులో మనం తెలుసుకుందాము . తమిళనాడు లో దేవాలయాలు ఎత్తైన గోపురాలు కలిగిన మనకు స్వాగతం పలుకుతాయి . అక్కడ దేవాలయాలు చూస్తుంటే మనవారికి ఎలా సాధ్యమైందనిపిస్తుంది. ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగిఉంటుంది . తమిళనాడు టూర్ జీవితం లో రెండు మూడు సార్లైనా వెయ్యాలి అనిపించక మానదు ఈ క్షేత్రాలను చూస్తుంటే. అన్ని క్షేత్రాల వైభవం ఒకే ఆర్టికల్ లో వివరించడం కష్టం. కనుకనే వాటి లింక్స్ మీకు ఇచ్చాము . అవి కలర్ వేరేగా మీకు కనిపిస్తాయి . మీకు ఆసక్తి ఉంటే వాటిపైన క్లిక్ చేసి చూడండి . తమిళనాడు టూర్ కోసం మీరు ముందుగా చెన్నై చేరుకోవాల్సి ఉంటుంది .
మొదటి రోజు :  1st Day Trip - Chennai Pandicherry Chidambaram 
మీరు చెన్నై కవర్ చేయాలి  అనుకుంటే అదనంగా ఒకరోజు పడుతుంది. చెన్నై బీచ్ , పార్ధ సారథి టెంపుల్ , కపాలేశ్వర్ టెంపుల్ , రామకృష్ణ మఠం. షాపింగ్ ఇవన్నీ ఒకరోజు చూస్కుని మరోసాటి రోజు ఇప్పుడు చెప్పే విధంగా ప్రయాణం అవండి . మనం ముందుగా చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తాము .  చెన్నై నుంచి పాండిచ్చేరి  162 కిలోమీటర్ల దూరం . పాండిచ్చేరి లో అరవిందాశ్రమం , బీచ్ , గణపతి దేవాలయము చూడవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసి , అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరం లో ఉన్న పిచ్చవరం చేరుకుంటే , అక్కడ ఎంతో సుందరమయిన జలసయాలని , ప్రకృతి అందాలను చూడవచ్చు . అక్కడినుంచి 55 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి  చిదంబరం చేరుకోవచ్చు. చిదంబరం లో నటరాజ స్వామి ఆలయం , శివాలయం చూసి , ఆ రాత్రి చిదంబరం లోనే బస చేయవచ్చు . 
చిదంబరం నటరాజస్వామి ఆలయం 

రెండవ రోజు : Chidambaram to Thanjavur 
చిదంబరం లో అల్పాహారం తీసుకుని , చిదంబరం నుంచి 26 కిమీ దూరం లో ఉన్నప్రాచీన శివాలయం వైతీశ్వరన్ కోవెల ను చూడవచ్చు. ఇక్కడ నాడి జ్యోతిష్యం ప్రసిద్ధి. (vaitheeswaran koil) ఈ ఆలయం దర్శించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ప్రశస్తి.  ఇక్కడ నుంచి  100 కిలోమీటర్లు ప్రయాణ చేసి , తంజావూరు చేరుకోవచ్చు.  తిరిగి తంజావూరు చేరుకొని , రూమ్ లో విశ్రాంతి తీసుకుని , సాయంత్రం ఎంతో ప్రసిద్హి చెందిన బృహదీశ్వరాలయం (చోళులు నిర్మించిన దేవాలయం ) చూడచ్చు. అక్కడ ఉన్నా నంది ఏక శిలా విగ్రహం. ఈ ఆలయాన్ని చూడ్డానికి ఒక పూట పడుతుంది. ఇక్కడ అన్ని పెద్దగా నిర్మించడం వలన ఈ ఆలయాన్ని అక్కడ వారు బిగ్ టెంపుల్ అని పిలుస్తారు . బంగారు కామాక్షి అమ్మవారు కూడా తంజావూరులోనే ఉన్నారు . మ్యూజియం కూడా చూడవచ్చు . భారతదేశం  లోని అతిపెద్ద విగ్రహాలలో రెండవది గా చెప్తారు . తంజావూరు లోనే రాత్రి బస చేయవచ్చు. 
మూడవ రోజు :  3rd Day Trip Thajavur to Rameswaram 
ఉదయం అల్పాహారం తీసుకుని , దాదాపు 5 గంటల ప్రయాణం చేసి , రామేశ్వరం చేరుకోవచ్చు. తంజావూరు నుంచి రామేశ్వరం 235 కిలోమీటర్ల దూరం లో ఉంది . రామనాధ స్వామి జ్యోతిర్లింగ దర్శనం  చేసుకుని , 22 బావుల్లో స్నానం చేసి , పంబన్ బ్రిడ్జి ని చూడచ్చు. ఆ రోజు రాత్రి రామేశ్వరం లో బస చేయవచ్చు. రూమ్స్ కి పెద్ద ఇబ్బంది ఉండదు .. సత్రాలు , హోటల్స్ ఎన్నో అందుబాటులోనే ఉంటాయి . తెల్లవారు జామున స్పటిక లింగ దర్శనం ఉంటుంది . 
రామేశ్వరం 

నాల్గవ రోజు :  4th Day Trip - Rameswaram to Kanyakumari Tour 
రామేశ్వరం నుంచి 395 కిలోమీటర్ల దూరం లో కన్యాకుమారి ఉంది. దాదాపు ఏడున్నర గంటల ప్రయాణం చేసి . కన్యాకుమారి చేరుకోవచ్చు.. కన్యాకుమారి లో మూడు సముద్రాల సంగమం చూడచ్చు. బే ఆఫ్ బెంగాల్ , అరేబియా , మరియు ఇండియన్ ఓషన్ ఈ మూడు మహా  సముద్రాలల సంగమం చూడచ్చు. సూర్యోదయం , సూర్యాస్తమయం కన్యాకుమారి లో ప్రసిద్ధి. చాలామంది కన్యాకుమారి వెళ్ళేది , సూర్యోదయం , సూర్యాస్తమయం చూడటానికే. అంతటి  ప్రపంచ ప్రసిద్ధి. ఐలాండ్ లో ఉండే వివేకానంద రాక్ ని బోటు లో చేరుకొని , చూసి రావచ్చు. ఆ రోజు రాత్రి కన్యాకుమారి లో నే స్టే చేయవచ్చు. 
కన్యాకుమారి
ఐదవ రోజు : 5th Day Trip - Kanyakumari  Suchindaram Madurai
కన్యాకుమారి లో అల్పాహారం తీసుకుని , సుచీంద్రం చేరుకోవచ్చు. అక్కడ తనుమలయన్ ఆలయం చూడచ్చు. బ్రహ్మ , విష్ణు  , మహేశ్వరులు ఒక్కటే అని చెప్పే దేవాలయం కలదు . మధ్యాహ్నం భోజనం చేసి, ఇక్కడ నుంచి మనం 172  కిలోమీటర్లు ప్రయాణం చేసి  మధురై చేరుకోవచ్చు. ప్రయాణానికి  దాదాపు 4 గంటల సమయం పడుతుంది . అక్కడ రూమ్ తీసుకుని , మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చూడచ్చు. భారత దేశం లోని అతి పెద్ద దేవాలయాల్లో మధురై మొదటిది. ఆ రోజు రాత్రి మధురై లోనే బస చేయవచ్చు.  మదురై కి దగ్గర్లో కుమార స్వామి క్షేత్రాలైన ఆరుపడైవీడు క్షేత్రాలలో రెండు క్షేత్రాలు కలవు. 
మధురై 

ఆరవ రోజు :  6th Day Trip Madurai to Kodaikanal
ఉదయం మరల మీనాక్షి అమ్మవారిని దర్శనం చేస్కునే సమయం లో మీరు స్పెషల్ దర్శనం టికెట్స్ తీస్కోండి అమ్మవారికి స్వామి వారికి విడివిడిగా టికెట్ తీసుకోవాలి. స్పెషల్ దర్శనం అయితేనే మీరు లోపలి వెళ్లి చూడవచ్చు. ఉదయం 5 - 6 సమయం లో ఆలయం ఖాళీగా ఉంటుంది . మీరు ఎక్కువ సేపు దర్శనం చేస్కోవచ్చు .  అల్పాహారం తీసుకుని , తిరుమలైనాయక్ మహాల్ చూడచ్చు. తరువాత 4 గంటల ప్రయాణం చేసి , కోడైకనాల్ చేరుకోవచ్చు. మధురై నుంచి కోడైకనాల్ 95 కిలోమీటర్ల దూరం లో ఉంది. అక్కడ రూమ్ తీసుకుని , సాయంత్రం బోట్ షికారు చేయవచ్చు. కోడైకనాల్ ప్రయాణమంత యూకలిప్టస్ ఆయిల్ సువాసన మనకు తెలుస్తూ ఉంటుంది. భారతదేశం లోని అతి సుందరమయిన హిల్ స్టేషన్స్ లో కోడైకనాల్ ఒకటి. ఎంతో శీతలమయిన ప్రదేశం . ఆ రోజు రాత్రి కోడైకనాల్ లోనే బస చేయవచ్చు. 


ఏడవ రోజు: 7th day Trip Tirucharapalli 
ఉదయం అల్పాహారం తీసుకుని , షెన్ బాగనూర్ లోని సెక్రెట్ హార్ట్ మ్యుజియం , కోకర్స్ వాక్ , కోడై సరస్సు చూడచ్చు. సాయంత్రం బయలుదేరి , 195 కిలోమీటర్లు అంటే.. దాదాపు 4 గంటల ప్రయాణం చేసినట్టయితే , తిరుచ్చి చేరుకోవచ్చు. ఆ రాత్రి తిరుచ్చి లోనే స్టే చేయవచ్చు. 


ఎనిమిదవ రోజు : 8th Day Trip Tirucharapalli to Srirangam - Chennai
తిరుచ్చి ని రాక్ సిటీ అంటారు . కావేరి నదీ తీరం . ఉదయమ అల్పాహారం చేసి , రాక్ ఫోర్ట్ టెంపుల్ చూసి . ఈ రాక్ పోర్ట్ టెంపుల్ నుంచి మనకు శ్రీరంగం కనిపిస్తుంది. రాక్ పోర్ట్ టెంపుల్ కొండపైన ఉంటుంది. కాస్త మెట్లు ఎక్కువుగానే ఉంటాయి . క్రింద శివుని ఆలయం పైన వినాయకుని ఆలయం ఉంటుంది. తిరుచిరాపల్లి నుంచి  కేవలం 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి , శ్రీరంగం చేరుకోవచ్చు. ఇండియా లోని రెండవ ఎత్తైన గోపురం శ్రీరంగం గోపురమే . చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇక్కడకు 2 కిమీ దూరం లోనే పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటైన జల లింగం జంబుకేశ్వరం లో ఉంటుంది.  శ్రీరంగాన్ని భూలోక వైకుంఠము అంటారు. శ్రీరంగం నుంచి 7 గంటల ప్రయాణం చేసి , చెన్నై చేరుకోవచ్చు. శ్రీరంగం నంచి చెన్నై కి 320 కిలోమీటర్ల దూరం .. అక్కడి నుంచి మీ స్వస్థలానికి చేరుకోవచ్చు. 

పైన చెప్పిన విధం గా వారం రోజుల తమిళనాడు టూర్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు . ఈ టూర్ లో మీరు మిస్ అయినా  కాంచీపురం , గోల్డెన్ టెంపుల్ , అరుణాచలం , పళని , తిరుచెందూర్ , కుంభకోణం గురించి మరల తెల్సుకుందాం . 

Tamil Nadu 8 day Trip Plan Places Covered Chennai Madurai Rameswaram Srirangam Kanyakumari Thanjavuru Chidambaram Kanyakumari Kodaikanal Tamil Nadu Tour Guide Best Places in Tamil Nadu . Most Famous Places in Tamil Nadu .

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు