Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Famous Temples In Bihar State | Hindu Temple Guide

బీహార్ భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని పాట్నా. బీహార్ రాష్ట్రం హిందీ మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన గంగానదీ మైదానం బీహార్‌లో విస్తరించి ఉంది. బీహారు చరిత్ర పురాతనమైనది. ఒకప్పుడు ఇది మగధ ప్రాంతము.నేటి పాట్నా ఆనాటి పాటలీపుత్రనగరం. మౌర్యసామ్రాజ్యానికి రాజధాని. అప్పటినుండి వెయ్యేళ్ళకాలం ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. నలందా, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి.బౌద్ధ, జైన మతాలకు బీహార్ జన్మస్థలం. బోధ్‌గయలో గౌతమబుద్ధుడు జ్ఙానోదయం పొంది, ధర్మ బోధన ఆరంభించాడు. జైనమత ప్రవక్త మహావీరుడు బీహారులోని వైశాలిలో జన్మించాడు. అన్ని మతాలవారికి బీహారు నెలవైనట్లే అన్ని పండుగలూ జరుపబడతాయి.మకర సంక్రాంతి, సరస్వతీ పూజ దసరా, హోలీ, ఈద్-ఉద్-ఫిత్రా, ఈద్-ఉద్-జోహా (బక్రీద్), ముహర్రం, శ్రీరామ నవమి, రథయాత్ర, రాఖీ, మహాశివరాత్రి, దీపావళి, లక్ష్మీపూజ, క్రిస్టమస్, మహావీర జయంతి, బుద్ధపూర్ణిమ, ఇంకా అనేక జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలు బీహారులో సంరంభంగా జరుపుకొంటారు. బీహారులో గంగా మైదానంలో సంస్కృతి పురాతనమైనట్లే వారి జానపద సంగీతం చాలా పురాతనమైనది. 
బీహార్ ప్రసిద్ధ దేవాలయాలు 
గయ - విష్ణు పాద ఆలయం
గయ - గయాక్షేత్రం
గయ - శ్రీ మంగళగౌరి దేవి ఆలయం
బుద్ధగయ - మహాబోధి ఆలయం
గయ - గదాధరుని దేవాలయం
బుద్ధగయ - సుజాత ఆలయం
గయ - సూర్య దేవాలయం
సుల్తాన్ గంజ్ - అజగవ్ నాధ్ ఆలయం
పాట్నా - పఠాన్ దేవి ఆలయాలు
గయ - గయాదిత్య మందిరం
సోనేపూర్ - హరిహరనాధలయం
మసారా - పరాశనాథ్ దేవాలయం
సిద్దేశ్వర్ - సిద్దేశ్వర స్వామి ఆలయం
ధుoకా - వాసుకీనాధ దేవాలయం
బక్సర్ - సీతామర్హి
బక్సర్ - రామాలయం 

Comments