భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :
ఈ భద్రాద్రి - కొత్తగూడెం నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇంతకు ముందు ఈ ప్రాంతం ఖమ్మం అనే జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినది.1. శ్రీ రామ ఆలయం , భద్రాచలం :
కంచర్ల గోపన్న ఈ ఆలయని నిర్మించారు. 17 వ శతాబ్దానికి చెందినది. గోదావరి నది ఒడ్డున ఈ ఆలయం కలదు. భక్తుడు కొండగా తనని చేయాలని , ఆ కొండపై తన స్వామి ఆలయం నిర్మించాలి అని కోరగా ఈ ఆలయం నిర్మించారు. శ్రీ రామ నవమి , దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 8.30PM.
2. శ్రీ రామ ఆలయం , పర్ణశాల :
శ్రీ రామ స్వామి స్వయంగా ఈ ప్రదేశంలో ఉండేవారు అని భక్తుల నమ్మకం. భద్రాచలం నుంచి ఈ ఆలయానికి 35 కి. మీ దూరంలో కలదు . సీత దేవి తను అరవేసుకున్న చీర గుర్తులు, కుంకుమ , పసుపు రాళ్ళు , సీతదేవి అపహరణ , జటాయువు గుర్తులు ఇక్కడ గమనించవచ్చు. భద్రాచలం నుంచి ప్రైవేట్ వాహనాలలో కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.30PM - 3.30PM TO 7.00PM.
3. శ్రీ వేంకటేశ్వర ఆలయం , అన్నపూరెడ్డి :
ఈ ఆలయం అన్నపూరెడ్డి పల్లి అనే గ్రామంలో కలదు. టౌన్ నుంచి 25 కి. మీ దూరంలో కలదు. వైకుంటా ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 11.00AM - 3.00PM TO 8.00PM.
4. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం :
ఈ ఆలయం గర్లవడ్డూ అనే గ్రామం లో కలదు. ఖమ్మం నుంచి 35 కి . మీ దూరంలో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.30PM - 3.30PM TO 7.00PM.
5. శ్రీ జ్ఞానాపేశ్వరాలయం , కూసుమంచి :
ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామం లో వెలసీన ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. కాకతీయుల కాలం నాటి ఆలయం. కాకతీయుల శిల్పకళకి నిదర్శనం ఈ దేవాలయం. ఈ ఆలయం మొత్తం బండరాళ్ళతో ఒకదానిపై ఒక్కటి చక్కగా అమర్చి అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయానికి దక్షిణా వైపు వేణుగోపాల స్వామి దేవాలయం ఉంటుంది. నేడు ఈ ఆలయం శిధిలావస్థకి చేరుకుంది.ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 3.30PM TO 7.30PM.
6. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం , (శాస్త నగర్ ), వైరా :
ఈ ఆలయం వైరా గ్రామానికి 25 కి. మీ దూరంలో కలదు. విశాలమైన ప్రగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఆవరణలో 45 అడుగుల హనుమాన్ విగ్రహం కలదు.ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.30PM - 4.00PM TO 8.00PM.
7. శ్రీ లలిత పరమేశ్వరి ఆలయం , తక్కెల పల్లి :
ఈ ఆలయం ఖమ్మం జిల్లా ఏరూపాలెం మండలం , తక్కెల పల్లిలో కలదు. ఈ ఆలయానికి 30 సం || చరిత్ర కలదు. దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.ఆలయ దర్శించే సమయం : 6.30AM TO 1.00PM - 3.30PM TO 7.30PM.
8. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , ఖమ్మం :
ఈ ఆలయం ఖమ్మం పట్టణంలో వెలసిన ఈ మహిమనిమ్మిత లక్ష్మీ నరసింహ ఆలయం ఈ ఆలయం. రెడ్డి రాజుల కాలం నాటి ఆలయం. ఈ ఆలయంలో స్వామి వారు స్వయంభూ. ఈ ఆలయానికి స్తంభాద్రి లక్ష్మీ అనే నామం కూడా కలదు. ఈ స్వామికి రోజు పానకంతో అభిషేకం నిర్వహిస్తారు.ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.30PM - 3.00PM TO 8.00PM.
భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise
KeyWords : Bhadradri Kothagudem Famous Temples List, Bhadradri Kothagudem District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide