సప్త చిరంజీవులు ఎవరు ?
మరణం లేనివారిని చిరంజీవి అని పిలుస్తారు. మన పురాణాలూ ఆధారంగా సప్త చిరంజీవులు కలరు. సప్త అనగా ఏడూ, ఈ ఏడుగురు ఎవరో ఇప్పుడు తెల్సుకుందాం. ఈ ఏడుగురు ఎప్పుడు తమకు మరణం లేకుండా ఉండాలని కోరలేదు. కోరినవారిని ఎవరిని భగవంతుడు ఉండనివ్వలేదు.సప్త చిరంజీవుల శ్లోకం :
అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥
అశ్వత్థామ :
అశ్వత్థమా ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. ద్రోణిని మరణానానికి ప్రతీకగా పాండవుల రాత్రిపూట పాండవుల శిబిరాలలోకి వెళ్లి నిద్రిస్తున్న ఉపపాండవులను చంపుతాడు. విషయం తెల్సుకున్న పాండవులు అశ్వత్థమాను బందించి తీస్కుని వచ్చి ద్రౌపతి వద్ద నిలబెట్టగా , ద్రౌపతి ఇతను మన గురువు ద్రోణాచార్యుని కుమారుడు గురు పుత్రులను చంపకూడదు కనుక విడిపెట్టమంటుంది. కృష్ణుడు అశ్వత్థమాను భయంకర కుష్ఠు రోగంతో చిరంజీవిగా ఉండు అని శపిస్తాడు.బలిచక్రవర్తి :
వామన అవతారం లో విష్ణుమూర్తి వామనునిగా వచ్చి మూడు అడుగుల నెల దానం అడిగింది బలిచక్రవర్తినే . ఇంతై ఇంతై వటుండంతై అనే పద్యం అందరికి సుపరిచితమే . రెండు అడుగులతో భూమిని ఆకాశాన్ని కొలిచి మూడో అడుగు బలిచక్రవర్తి తలపై వేసి పాతాళ లోకం లో రాజుని చేసి ఆ రాజ్యానికి వరాహ రూపం లో విష్ణువే కాపలాగా ఉన్నాడుహనుమంతుడు :
అంజనీ పుత్రుడు హనుమంతుడు. సుగ్రీవుని వద్ద మంత్రుని గా ఉన్నాడు. శ్రీరామా భక్తి తో రామ నామం తో రామాయణం లో రామునికి దాశునిగా హనుమంతుడు మనకు కనిపిస్తాడు. ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఏదైనా కార్యం పై బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ దండకం పఠించడం ఇప్పటికి మనం చూస్తాము.విభీషణుడు :
రామాయణం లో రావణుని సోదరులలో విభీషణుడు ఒకరు. లంకను వదిలి రాముని శరణు కోరతాడు విభీషణుడు. యుద్ధం జరగకుండానే శ్రీరాముడు విభీషణునకు లంకా నగరానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. యుద్ధం తరువాత లంకకు రాజావుతాడు విభీషణుడు.కృపాచార్యుడు:
మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు కృపాచార్యుడు, మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసాడు కృపాచార్యుడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికిఉన్న వారిలో కృపాచార్యుడు ఒకడు. యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన పరీక్షిత్తుకు ఆచార్యునిగా నియమింపబడ్డాడు.పరశురాముడు:
శ్రీమహావిష్ణువు దశావతారములలో ఆరవది పరశురామావతారము. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. పరశురాముడు రామాయణం లోను మహాభారతం లోను కూడా మనకు కనిపిస్తాడు. మహాభారతం లో భీష్ముని గురువు పరశురాముడే.కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.వ్యాసుడు :
సనాతన ధర్మం లో వ్యాసునకు ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే సాహిత్య సంపదను భావితరాలకు అందించిన ఘనుడు వ్యాసుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసునిగా పిలవబడాడ్డు. తన శిష్యుల ద్వారా వేదాలను ప్రచారం చేసాడు. మహాభారతం , అష్టాదశ పురాణాలను రచించాడు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వ్యాసమహర్షి జన్మించారు . ఈ రోజునే గురుపౌర్ణమిగా జరుపుకుంటారు .ఇవి కూడా చూడండి :
మహాభారతం పుస్తకాలూ దశావతారాలు అష్టాదశ పురాణాలూ 1956-2020 వరకు గల పంచాంగాలు సకలదేవత స్తోత్రాలు.
KeyWords : Saptha Chiranjeevulu, Saptha chiranjivula names, SanathanaDharma
Comments
Post a Comment