Gokarna Temple History in Telugu | Karnataka

గోకర్ణ :
'భూకైలాస క్షేత్రం' గా ప్రసిద్ధి చెందిన గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కలదు. గోకర్ణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. బెంగళూరుకి 545 కి.మి., ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్ కి 55 కి.మి దూరంలో ఉంది. గోకర్ణ శైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామములో అత్యంత సుందరమైన బీచ్ లు కూడా ఉన్నాయి.

గోకర్ణ రెండు అగ్నశిని మరియు గంగావతి అనే రెండు నదుల మధ్యలో కలదు. ఈ రెండు నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని 'గోకర్ణ' అన్నారు. గోకర్ణ శివాలయానికి ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం ఆవిర్భవించటానికి గల కధనం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 6.00AM  TO  8.30PM.

రైలు సౌకర్యం
గోకర్ణ గ్రామానికి 10 కి.మి. దూరంలో మంగళూరు-ముంబాయి కొంకణ్ రైల్వే లైనులో గోకర్ణ రోడ్ రైల్వే స్టేషను ఉంది. కాని ఈ గోకర్ణ రైల్వే స్టేషనులో ప్యాసింజర్ బళ్ళు మాత్రమే నిలుస్తాయి. ఎక్స్‌ప్రెస్‌ బళ్ళు గోకర్ణకు 23 కి.మి. దూరంలో ఉన్న కుంటా, 25 కి.మి. దూరంలో ఉన్న అంకోలా, ఉత్తర కన్నడ రాజధాని కార్వార్లో నిలుస్తాయి.

బస్సు సౌకర్యం
కార్వార్‌ నుండి ప్రొద్దున్న 7,8 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు గోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి. మిగతా సమయంలో కార్వార్ నుండి ఆంకోలా వరకు బస్సులు నడుస్తాయి. హొబ్లీ నుండి, హంపినుండి కూడా గోకర్ణకు తరచు బస్సులు ఉన్నాయి. గోవా నుండి ప్రొద్దున్న 8 గంటలకు సరాసరి గోకర్ణకు చేర్చే బస్సు ఉన్నది (5 గంటల ప్రయాణం). మంగళూరు (252 కి.మి. దూరంలో ఉన్నది) నుండి ఉదయం 7 గంటలకు బస్సు ఉంది. బెంగళూరు నుండి పగలు 9 గంటలకు, మైసూర్ నుండి పగలు 6 గంటలకు గోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి.

టెంపో బళ్ళు
కుంటా నుండి తెల్లవారు జామున 6 గంటల నుండి తరచు టెంపో బస్సులు నడుస్తాయి.

విమానసౌకర్యం
మంగళూరు లేదా పనాజిలోని విమానశ్రయం దగ్గరలోని విమానశ్రయాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS