Drop Down Menus

Shri Mata Vaishno Devi Temple History | jammu and Kashmir

వైష్ణవ దేవి :
వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు.

ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూద కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే అమ్మవారి ఆలయం కనిపుస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు.  వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.

శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ తీర్థయాత్రకు సమీప రైల్వే స్టేషన్, సుమారు 20 కి.మీ. పవిత్ర భవన్ నుండి దూరంగా. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ లేనప్పటికీ, సమీప విమానాశ్రయం జమ్మూ తవిలో ఉంది, ఇది 46.7 కి.మీ. మీరు NH 144 ద్వారా ప్రయాణిస్తే, కత్రా నుండి దూరంగా.

ఆలయ సమయాలు :05:00 నుండి - 12:00 PM, 04:00 PM - 09:00 PM
vaishno devi temple history, vaishno devi temple images, vaishno devi temple best time to visit, katra to vaishno devi temple distance in km, vaishno devi trip, vaishno devi helicopter booking, battery car vaishno devi, vaishno devi helicopter price
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.