Birla Mandir | Connaught Place | New Delhi

బిర్లా మందిరం, కానాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ :

ఢిల్లీ వెళ్ళినప్పుడు చూడవలసిన ఆలయాలలో ఈ దేవాలయం కూడ ఒకటి. ఈ ఆలయాన్ని ఇక్కడ శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఢిల్లీ కానాట్ ప్లేస్ అనే ప్రాంతంలో కలదు. ఢిల్లీ లో ఇది ఒకానొక ప్రధాన ఆలయం.

ఆలయ చరిత్ర :

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ మహా విష్ణువు మరియు లక్ష్మీ దేవి. ఈ ఆలయాన్ని 1939 లో పారిశ్రామికవేత్త శ్రీ,జీ .డీ బిర్లా గారు కట్టించారు. మహాత్మా గాంధి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని  ఆవిష్కరించడం జరిగినది.  ఈ దేవాలయంలో లక్ష్మీదేవి సహితంగా విష్ణుమూర్తి తో పాటుగా ఉప ఆలయములు అయినా వినాయక స్వామి ఆలయం కుడి వైపు  , ఆ పక్కనే పరమేశ్వర స్వామి ఆలయం , హనుమ , కృష్ణా ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎడమ వైపు దుర్గా దేవిఆలయం కూడా ఒక ప్రత్యేకంగా నిర్మించారు.


ఈ ఆలయం మొత్తం 7.5 ఎకరాలలో విస్తరించి ఉన్నది. చుట్టూ అత్యంత సుందర ఉద్యాన వనాలు ఉన్నాయి.  ప్రతీ సంవత్సరం యాత్రికులు విరివిగా ఇక్కడకి వస్తు ఉంటారు. భారత దేశం లోని భక్తులు మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తారు.  దీపావళీ, క్రిష్నాష్టమి సమయాలలో ఈ గుడి కిక్కిరిసిపోతుంది. కానాట్ ప్లేస్ కి దగ్గర లో మందిర్ మార్గ్ మధ్యలో ఉంది.

ఆలయ దర్శన సమయం :

ఉదయం     : 4.30 - 1.30
సాయంత్రం : 3.00 - 9.00

వసతి వివరాలు :

ఈ ఆలయానికి దగ్గరలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

అన్నీ ప్రాంతాల నుంచి మొదట కానాట్ ప్లేస్ కి చేరుకొని అక్కడి నుంచి నడక దారిలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ఆర్. కే ఆశ్రమ మెట్రో స్టేషన్ కలదు. అక్కడి నుంచి కూడా ప్రైవేట్ వాహనల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

విమాన మార్గం :

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనలో చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

బిర్లా మందిరం,
కానాట్ ప్లేస్,
మందిర్ మార్గ్ రోడ్డు ,
న్యూ ఢిల్లీ
పిన్ కోడ్ : 110001

KeyWords : Birla Mandir , Sri Laxmi Narayana swamy Temple ,  Famous Temples In Delhi , Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS