Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Bala Hanuman Temple | Delhi

శ్రీ బాల హనుమాన్ ఆలయం , ఢిల్లీ :

ఢిల్లీ లోని ప్రధాన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం కన్నాట్ ప్లేస్ అనే ప్రాంతం లో కలదు. ఈ దేవాలయం చాలా పురాతన ఆలయం. మొఘల్ చక్రవర్తి నాటి కాలం లో నిర్మాణం జరిగినది.  హనుమాన్ జయంతి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు.

ఆలయ చరిత్ర :

ఈ ఆలయంలోని స్వామి స్వయంభూ.  హనుమాన్ చాలీసా శ్లోకాలను రాసిన తులసీదాస్ ఈ ఆలయాన్ని సందర్శించారు. తులసి దాస్ గారు స్వామి ని దర్శించుకొని స్వామి పై శ్లోకాలు చదువుతూ ఉండగా తులసీదాస్‌ను మొఘల్ పిలిచార చక్రవర్తి తులసీదాస్‌ చదివిన శ్లోకాలు విని సంతోషించి హనుమాన్ ఆలయాన్ని  నెలవంకతో కూడిన ఆలయ శీకరం పై అలంకరణా చెపిస్తాడు. వివిధ సమయాల్లో భారతదేశంపై దండయాత్ర చేసిన రాజులు ఈ ఆలయాన్ని ఏమి చేయలేకపోయారు.  ఇప్పటికీ ఆలయ శీకరం పై నెలవంక తో కూడిన నమూనా గమనించవచ్చు. హనుమంతుడి విగ్రహం దక్షిణ దిశకు ఎదురుగా ఉన్నందున, భక్తులు విగ్రహం యొక్క ఎడమ  కన్ను మాత్రమే గుర్తించగలరు. ఈ విగ్రహం ఒక చేతిలో గద ను కుడి చేతితో ఛాతీకి అడ్డంగా రాముడు, లక్ష్మణ మరియు సీత ధ్యానం చేస్తూ చూపిస్తుంది.


అక్బర్ చక్రవర్తి  పాలనలో దీనిని మొదట అంబర్ మహారాజా మన్ సింగ్  నిర్మించారు. దీనిని మహారాజా జై సింగ్ 1724 లో పునర్నిర్మించాడు, అదే సమయంలోనే జంతర్ మంతర్. ఆ తరువాత కాలంలో ఈ ఆలయం బాగా అభివృద్ధి జరిగినది. ఈ ఆలయంలో మరియొక విశేషం కూడా జరిగినది. ఈ ఆలయంలోని 1964 ఆగస్టు 1 నుండి శ్రీ రామ నవమి రోజు  "శ్రీ రామ్, జై రామ్, జై జై రామ్" అనే మంత్రం 24 గంటల జపం జరుగుతున్నది.  ఈ విశేషాన్ని  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయబడినది. ఈ ఆలయం శీకరం పక్కన ఎత్తున 108 అడుగులు (32.9 మీ) విగ్రహం ఉన్నది. ఈ ఆలయంలో హనుమాన్ విగ్రహంతో పాటు శ్రీ రామ సమేత సీత , లక్ష్మణ , గణపతి , శివ , దుర్గా , సంతోషి మాత వంటి ఇతర ఉప ఆలయాలు కూడా దర్శించవచ్చు. ప్రతి మంగళవారం మరియు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం       :  6.00-11.30
సాయంత్రం   : 4.30-8.00

వసతి వివరాలు :

ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే శివాజీ స్టేడియం బస్ స్టాండ్ కలదు. అక్కడి నుంచి నడిచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి సమీపంలోనే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుంచి ఆలయానికి కేవలం 2కి . మీ దూరంలోనే కలదు.

విమాన మార్గం :

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

శ్రీ బాల హనుమాన్ ఆలయం ,
బాబా ఖరక్ సింగ్ మార్గ్ ,
కన్నాట్ ప్లేస్
న్యూ ఢిల్లీ.
పిన్ కోడ్ - 110006

Key Words : Sri Bala Hanuman Temple , Famous Temples In Delhi , Hindu Temples Guide

Comments

Popular Posts