శ్రీ సాయి బాబా ఆలయం , ఢిల్లీ :
ఢిల్లీలోని చూడవలసిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఢిల్లీలో ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయం ఢిల్లీ లోని లోధి అనే రోడ్డు సమీపంలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద కలదు. ఢిల్లీ లోని పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఆలయ నిర్మాణం ఇప్పడు పునః నిర్మించారు.ఆలయ చరిత్ర :
ఈ ఆలయాన్ని శ్రీ సాయి భక్త సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉన్నది. ఈ సంస్థ అక్టోబర్ 1968 లో నమోదు చేయబడింది. అప్పటి నుంచి ఆలయానికి కావలసిన పూజ సామగ్రి తో పాటు ఆలయ నిర్వహణ ఖర్చు కూడా వీరే చూస్తున్నారు. ఈ ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర లేదు. ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజు , శ్రీరామ నవమి , దీపావళి పండుగలని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆలయం రోడ్డు పక్కనే నిర్మించబడినది. ఈ కారణంగానే చాలా మంది భక్తులు రోడ్డు గుండా వెళుతు సాయి బాబా దర్శనం చేసుకుంటూ వెలుతారు. రోడ్డు నుండి సాయి బాబా విగ్రహాన్ని చూడవచ్చు. విగ్రహాన్ని తెల్లని పాలరాయితో నిర్మించారు. ఈ ఆలయంలో విశాలమైన ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు మరియు ఆ రోజు సాయి బాబా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు. గురువారం రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.హారతి వివరాలు :
ప్రతి రోజు ఉదయం 5.00 గంటలకి మంగళ స్నానంఉదయం 5.30 గంటలకు మొదటి హారతి అయిన కాకడ హారతి ఇస్తారు.
ఉదయం 8.00 గంటలకి రెండవ హారతి ఇస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న హారతి.
సాయంత్రం 6.30 గంటలకి ధూప్ హారతి,
రాత్రి 9.30 రాత్రి షెజ్ హారతి ఇచ్చి ఏకాంత సేవ నిర్వహించి ఆలయని మూసి వేస్తారు.
ప్రతి గురువారం రోజు ధూప్ హారతి రాత్రి 7.00 గంటకి ఇస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 7.00-1.00సాయంత్రం : 5.00 - 9.45
వసతి వివరాలు :
ఈ ఆలయం కొద్ది దూరంలోనే ప్రైవేట్ హోటల్ లు ఉన్నాయి.ఆలయానికి చేరుకునే విధానం :
రోడ్డు మార్గం :
ఈ ఆలయానికి దగ్గరలోనే జెఎల్ఎన్ స్టేడియం బస్ స్టాండ్ కలదు. అక్కడి నుంచి నడిచి ఆలయానికి చేరుకోవచ్చు.రైలు మార్గం :
ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే రెండు రైలు స్టేషన్ లు కలవు. అందులో ఒకటి జవహర్‌లాల్ నెహ్రూ మెట్రో స్టేషన్ ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 2 కి. మీ దూరంలో కలదు. మారియొక్కటి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 8 కి. మీ దూరంలో కలదు.విమాన మార్గం :
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.ఆలయ చిరునామా :
శ్రీ సాయి బాబా ఆలయం ,17వ లోధి రోడ్,
గోకాల్‌పురి,
ఇనిస్టిట్యూషనల్ ఏరియా,
లోధి కాలనీ,
న్యూ ఢిల్లీ.
పిన్ కోడ్ : 110003.
Key Words : Sri Sai Baba Temple , Famous Temples In Delhi , Hindu Temples Guide