Drop Down Menus

Sri Shakuni Temple | Pavithreswaram | Kerala Famous Temples


శ్రీ శకుని పవిత్రేశ్వరం , కేరళ : 

దక్షిణా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ప్రాచీన మరియు ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం  కొల్లం జిల్లాలో పవిత్రేరేశ్వరం అనే గ్రామంలో  కేరళ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఒక విచిత్రమైన ఆలయం. శత్రువుల కొరకు కూడా ఆలయం ఉన్నది.  అదే ఈ ఆలయం. మహాభారతంలో కౌరవుల మామ అయిన శకుని మామా హిందూ గ్రంథాలలో ముఖ్యంగా మహాభారతంలో అత్యంత అసహ్యించుకునే పాత్రలలో ఒకటి.

ఆలయ చరిత్ర : 

ఈ ప్రదేశంలో శకుణి శివుడినకోసం ఘోరమైన తపస్సు చేసి ప్రార్థించాడు. తన భక్తికి మెచ్చిన శివుడు శకుణికి మోక్షంని ప్రసాదిస్తాడు. ఈ పుణ్యక్షేత్రం లోపల శకుణి యొక్క చాలా కళాత్మక రాతి సింహాసనం (గుట్ట) ఉన్నది. దానిపై తపస్సు చేయడం వల్ల దానిని ఇక్కడి ప్రజలు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆలయంలోని అతి ముఖ్యమైన శకుణి ఉపయోగించిన సింహాసనం (ఆలయం లోపల ఉన్న గుట్ట)కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ఈ ప్రాంతంలోని కురవ సమాజం దీనిని  నిర్వహిస్తుంది. కానీ సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తిలో చెడుతో పాటు ఎంతో కొంత మంచి కూడా ఉంటుంది. దానిని కూడా అందరూ గమనించాలి అని చెపుతారు. దానికి కారణంగానే శకుణిలో కూడా తామాసిక  లక్షణాలు ప్రబలంగా ఉన్నాయన్నది నిజం, కానీ ఆయనకు తామాసిక  లక్షణాలుతో పాటు  సాత్విక్ అంశాలు ఉన్నాయి మరియు దీనిని కేరళలోని కూరవ సమాజం గుర్తించింది. అందుకే ఇప్పటికీ వల్లే ఉత్సవాలు నిర్వహిస్తారు. మరియు కొట్టారక్కర సమీపంలోని పవిత్రేశ్వరం వద్ద ఉన్న మాయంకోట్టు మలంచారువు మలనాడలో శకుణికి ఆలయం కట్టి ఆయనకి అంకితం చేయబడిన పురాతన ఆలయం. ఈ ఆలయానికి సరైన ఆలయ నిర్మాణం లేదు. పూజలు జరిగిన వేదికపై ఉత్సవ మూర్తి ఉంచుతారు. పూజలు జరిపిన తరువాత వేదికపై ఉత్సవ మూర్తిలు ఉంచి ఊరేరిగింపు చేస్తారు. దీనితో పాటు అనుబంధ దేవతలను సమీపంలో చూడవచ్చు.  మహాభారత యుద్ధంలో, శకుణి తన మేనల్లుళ్ళు కౌరవులతో కలిసి దేశవ్యాప్తంగా పర్యటించారు. వారు ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు, కౌరవులు తమ ఆయుధాలను వారిలో విభజించారు. అప్పటి నుండి, ఈ ప్రదేశం ‘పాకుతేశ్వరం’ గా పిలువబడింది, తరువాత ఇది పవిత్రేశ్వరం అయింది.


ఈ ఆలయం యొక్క ఉపవిభాగాలలో భువనేశ్వరి దేవి, కిరత మూర్తి మరియు నాగరాజు ఉన్నారు. మలక్కూడ మహోల్సవం అని పిలువబడే ఆలయ పండుగ 28 వ తేదీన ప్రారంభమవుతుంది. మకరం నెలలో ఈ ఉత్సవం జరుగుతుంది. శకుని ఆలయానికి సమీపంలో దుర్యోధనుడిఆలయం కూడా ఉంది.


ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 6:00 – 12:00
సాయంత్రం : 4:30 – 7:30

వసతి వివరాలు  :

ఆలయంనికి  ప్రైవేట్ హోటల్ లు కూడ లేవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

తిరువనంతపురం నుంచి 65కిలోమీటర్ల దూరంలో కొట్టారక్కర అక్కడి నుంచి ఈ ప్రాంతం అయినా పవిత్రేశ్వరంకి 16 కి. మీ దూరంలో ఈ ఆలయం ఉంటుంది.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే  మున్రోతురుత్తు అనే రైల్వేస్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 30 కి. మీ దూరంలోనే ఈ ఆలయం ఉన్నది. లేదా కొట్టారక్కర లోకల్ స్టేషన్ కూడా ఉన్నది.

విమానా మార్గం :

ఈ ఆలయానికి తిరువనంతపురం విమానశ్రయంలో చేరుకొని  అక్కడి నుంచి  కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవాలి.

ఆలయ చిరునామా  :

శ్రీ శకుని ఆలయం
పవిత్రేశ్వరం
కొల్లం  జిల్లా
పిన్ కోడ్ : 691507
కేరళ.

Keywords : Sri Shakuni Temple , Pavithreswaram , Kollam , Famous Temples In Kerala , Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.