Drop Down Menus

Bhagavad Gita 18th Chapter 41-50 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత

శ్రీమద్ భగవద్ గీత అష్టాదశోఽధ్యాయః
అథ అష్టాదశోఽధ్యాయః |

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప |
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ‖ 41 ‖



భావం : పరంతపా! బ్రాహ్మణులు, క్షత్రియలు, వైశ్యులు, శూద్రులకు వారి వారి స్వభావం వల్ల కలిగిన గుణాలను బట్టి కర్మలు విభజించబడ్డాయి.

శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ‖ 42 ‖

భావం : బ్రాహ్మణులకు, స్వభావ సిద్ధమైన కర్మలు ఇవి-మనోనిగ్రహం, బాహ్యేంద్రియా నిగ్రహం, తపస్సు శుచిత్వం, ఓర్పు, సత్ప్రవర్తన, శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం, దేవుడి మీద నమ్మకం.

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ‖ 43 ‖

భావం : పరాక్రమం, పౌరుషం, ధైర్యం, దక్షత, యుద్ధంలో పారిపోకపోవడం దానం, పరిపాలన సామర్థ్యం-ఇవి క్షత్రియుల కర్మలు.

కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ |
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ‖ 44 ‖
భావం : వైశ్యులకు స్వభావం వల్ల కలిగిన కర్మలు-వ్యవసాయం, పశుపోషన, వ్యాపారం. ఇక శూద్రుల కర్మ-సేవచేయడం.

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః |
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు ‖ 45 ‖

భావం : తాను ఆచరించే కర్మ పట్ల శ్రద్ధ కలిగిన వాడు సిద్ధి పొందుతాడు. స్వభావ సిద్ధమైన తన కర్మమీద ఆసక్తి వున్నవాడు ఎలా సిద్ధి పొందుతాడో చెబుతాను, విను.
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ‖ 46 ‖

భావం : సమస్త ప్రాణుల పుట్టుకకు, పోషనకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించివున్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్పించి మానవుడు పరమగతి పొందుతాడు.

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మోత్స్వనుష్ఠితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ‖ 47 ‖

భావం : బాగా ఆచరించబడ్డా ఇతరుల ధర్మం కంటే గుణం లేనిదిగా కనిపించినా తవ ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు.

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ‖ 48 ‖

భావం : కౌంతేయా! నిప్పును కప్పుకున్న పొగలగా కర్మ లన్నిటిని దోషం ఆవరించి వుంటుంది. అందువల్ల ఏదయినా దోషమున్న స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు.

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్ఛతి ‖ 49 ‖

భావం : అన్ని విషయాల పట్ల ఆసక్తి విడిచిపెట్టి, ఆత్మ నిగ్రహంతో, ఆశలు లేకుండా, ఫల త్యాగబుద్ధితో కర్మలు ఆచరించేవాడు పరమొత్తమమైన కర్మా తేతస్థితి పొందుతాడు.

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ‖ 50 ‖

భావం : కౌంతేయా! నిష్కామకర్మసిద్ధి పొందినవాడు పరమాత్మను ఎలా పొందుతాడో, జ్ఞాననిష్ఠ అంటే ఏమిటో సంగ్రహంగా చెబుతాను; సావధానంగా విను.







18వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 18th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.