Drop Down Menus

Bhagavad Gita 18th Chapter 51-60 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత

శ్రీమద్ భగవద్ గీత అష్టాదశోఽధ్యాయః
అథ అష్టాదశోఽధ్యాయః |

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ‖ 51 ‖

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ‖ 52 ‖
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ‖ 53 ‖
భావం : పరిశుద్దమైన బుద్ది కలిగి, ధైర్యంతో మనస్సును వశపరచుకొని శబ్దాది విషయాలను, రాగద్వేషాలను విడిచిపెట్టి, ఏకాంత వాసం చేస్తూ, మితంగా తింటూ; మాటలు, శరీరం మనసును అదుపులో పెట్టుకొని, నిరంతర ధ్యాస యోగంలో వుంటూ, వైరాగ్యం ఆశ్రయించి అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం, వస్తు సేకరణలను వదిలిపెట్టి, మమకారం లేకుండా శాంత స్వభావం కలిగిన వాడు బ్రహ్మ స్వరూపం పొందినవాడు అర్హుడు.


బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి |
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ‖ 54 ‖

భావం : అలా బ్రహ్మ స్వరూపం పొందినవాడు ప్రశాంతమైన మనస్సుతో - దేనినీ ఆశ్రయించడు. దేనికి దుఃఖించడు. సమస్త భూతలను సమభావంతో చూస్తూ నా పట్ల పరమ భక్తి కలిగి ఉంటాడు.  

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ‖ 55 ‖

భావం : భక్తి వల్ల అతను నేను ఎంతటి వాడినో, ఎలాంటి వాడినో యాదార్ధంగా తెలుసుకుటాడు. నా స్వరూప స్వభావాలను గ్రహించి అనంతరం నాలో ప్రవేశిస్తాడు.

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ‖ 56 ‖

భావం : కర్మలన్నింటిని ఎప్పుడు  ఆచరిస్తున్నప్పటికి నన్ను ఆశ్రయించేవాడు నా అనుగ్రహం వల్ల శాశ్వతమూ, నాశరహితమూ అయినా మోక్షం పొందుతాడు. 

చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ‖ 57 ‖

భావం : హృదయ పూర్వకంగా అని కర్మలు నాకే అర్పించి, నన్నే పరమ గతిగా భావించి ధ్యానయోగాన్ని అవలంభించి, నీ మనస్సును నిరంతరం నా మీదనే వుంచు.

మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి |
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి ‖ 58 ‖

భావం : నామీద మనసు నిలిపితే నా అనుగ్రహం వల్ల సంసార సంబంధమైన ప్రతి ఒక్క ప్రతిబంధకాన్ని అతిక్రమిస్తావు. అలా కాకుండా అహంకారం తో నా ఉపదేశాన్నిపెడచెవిన పెడితే చెడిపోతావు. 

యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ‖ 59 ‖

భావం : అహంకారం వల్ల యుద్దం చేయకూడదని భావించిన ఆ ఫలితం ఫలించదు. ఎందువల్లనంటే నీ చేత యుద్దం చేయించి తీరుతుంది. 

స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశోఽపి తత్ ‖ 60 ‖

భావం : కౌంతేయా! అవివేకం వల్ల నీవు ఇష్టపడకపోయినా, స్వభావ సిద్దమైన స్వధర్మకర్మకు కట్టుబడి పరాధీనుడై ఆ పని తప్పకుండా చేస్తావు. 







18వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 18th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON