Bhagavad Gita 18th Chapter 1-10 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత


ŚRĪMAD BHAGAVAD GĪTA AŚHṬĀDAŚOADHYĀYAḤ

శ్రీమద్ భగవద్ గీత అష్టాదశోఽధ్యాయః
atha aśhṭādaśoadhyāyaḥ |
అథ అష్టాదశోఽధ్యాయః |

arjuna uvācha |
అర్జున ఉవాచ |
saṃnyāsasya mahābāho tattvamichChāmi veditum |
tyāgasya cha hṛśhīkeśa pṛthakkeśiniśhūdana ‖ 1 ‖

సన్యాసస్య మహాబాహో! తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |

త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ‖ 1 ‖భావం : అర్జునుడు : కృష్ణా ! సన్యాసం, త్యాగం వీటి స్వరూపాలను విడి విడిగా తెలుసుకోదలచాను.

śrībhagavānuvācha |

శ్రీభగవానువాచ |
kāmyānāṃ karmaṇāṃ nyāsaṃ saṃnyāsaṃ kavayo viduḥ |
sarvakarmaphalatyāgaṃ prāhustyāgaṃ vichakśhaṇāḥ ‖ 2 ‖

కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః |

సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ‖ 2 ‖


భావం : శ్రీ భగవానుడు : ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు .సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం.

tyājyaṃ dośhavadityeke karma prāhurmanīśhiṇaḥ |
yaGYadānatapaḥkarma na tyājyamiti chāpare ‖ 3 ‖

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః |

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ‖ 3 ‖


భావం : దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరికొంతమంది యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు.

niśchayaṃ śṛṇu me tatra tyāge bharatasattama |
tyāgo hi puruśhavyāghra trividhaḥ samprakīrtitaḥ ‖ 4 ‖

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ |

త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ‖ 4 ‖


భావం : అర్జునా! కర్మత్యాగ విషయంలో నా నిర్ణయం విను.త్యాగం మూడు విధాలు.

yaGYadānatapaḥkarma na tyājyaṃ kāryameva tat |
yaGYo dānaṃ tapaśchaiva pāvanāni manīśhiṇām ‖ 5 ‖

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |

యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ‖ 5 ‖

భావం : యజ్ఞం,దానం, తపస్సు అనే కర్మలు బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అందువల్ల వాటిని విడిచి పెట్టకూడదు. తప్పకుండా చేయాలి.

etānyapi tu karmāṇi saṅgaṃ tyaktvā phalāni cha |
kartavyānīti me pārtha niśchitaṃ matamuttamam ‖ 6 ‖

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ |

కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ‖ 6 ‖


భావం : పార్థా ! అయితే యజ్ఞం, దానం, తపస్సు అనే ఈ కర్మలను కూడా అసక్తినీ, ఫలాన్ని విడిచి పెట్టే ఆచలించాలని నిశ్చితమూ, ఉత్తమమూ అని నా అభిప్రాయం.

niyatasya tu saṃnyāsaḥ karmaṇo nopapadyate |
mohāttasya parityāgastāmasaḥ parikīrtitaḥ ‖ 7 ‖

నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే |

మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ‖ 7 ‖


భావం : స్వధర్మానుసారంగా నిత్యం ఆచరించవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిది కాదు.అవివేకంతో చేసే అలాంటి త్యాగాన్ని తామసత్యాగా మంటారు.


duḥkhamityeva yatkarma kāyakleśabhayāttyajet |
sa kṛtvā rājasaṃ tyāgaṃ naiva tyāgaphalaṃ labhet ‖ 8 ‖

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ |

స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ‖ 8 ‖


భావం : దుఃఖం కలగజేస్తాయనే భావనతో కానీ, శరీరానికి శ్రమ కలుగుతుందనే భయంతోకని, నిత్యకర్మలను విడిచిపెడితే అది రాజస త్యాగం అవుతుంది. అలాంటి త్యాగం చేసినవాడు త్యాగఫలం పొందలేడు.

kāryamityeva yatkarma niyataṃ kriyatearjuna |
saṅgaṃ tyaktvā phalaṃ chaiva sa tyāgaḥ sāttviko mataḥ ‖ 9 ‖

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున |

సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ‖ 9 ‖


భావం : అర్జునా! వేదశాస్త్రాదులు విధించిన కర్మలను కర్తవ్యబుద్ధితో అసక్తినీ , ఫలాన్ని విడిచి పెట్టి ఆచరించడమే సాత్త్విక త్యాగం.

na dveśhṭyakuśalaṃ karma kuśale nānuśhajjate |
tyāgī sattvasamāviśhṭo medhāvī Chinnasaṃśayaḥ ‖ 10 ‖ 

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |

త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ‖ 10 ‖


భావం : సత్త్వగుణ సంపన్నుడు, బుద్ధిమంతుడు, సంశయరహితుడు అయిన త్యాగశీలి కామ్యాలు, కష్టప్రదాలైన కర్మలను ద్వేషించాడు శుభప్రదాలు, సులభసాధ్యాలు అయిన కర్మలను అభిమానించాడు.
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 18th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments