శ్రీ శివ ఆలయం, కోర్బా బిలాస్ పూర్,ఛత్తీస్ ఘర్ :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ శ్రీ శివ ఆలయం ఛత్తీస్ ఘర్ రాష్ట్రం లోని కోర్బా బిలాస్ పూర్ అనే గ్రామం మధ్యలో కలదు. క్రీస్తుపూర్వం 870 లో నిర్మించిన ఈ ఆలయంలో ఖజురాహో తరహా ఆలయ భవనం యొక్క ఆనవాళ్లు ఉన్నాయి. 12 వ శతాబ్దంలో రాజు జజ్వల్యాడియో చేత మరమ్మతులు జరిగాయి. సరిహద్దు గోడ ఏర్పాటు కోసం మరమ్మతు సమయంలో, రెండు విగ్రహాలు మరియు రెండు నాణేలు కూడా ఇక్కడ కనుగొనబడ్డాయి. ఈ ఆలయం కోర్బా-బిలాస్‌పూర్ రహదారిపై నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఆలయ చరిత్ర :
పూర్వం ఒక భక్తురాలు శివునికి అత్యంత భక్తితో పూజలు నిర్వహించేది. ఆ సమయంలో ఆమె భక్తిని పరీక్షించాలి అని స్వామి ఒక వృద్దిని రూపంలో వచ్చి ని యొక్క భక్తి నిజమైనదే అయితే ఆ స్వామి కి ని యొక్క నాలుక ని నైవేద్యంగా సమర్పించాలి అని కోరగా ఆ భక్తురాలు అదే విధముగా చేయగా ఈ వృద్దా రూపంలో ఉన్న శివుడు తన అస్సలు రూపంలో దర్శనం కల్పించి ఆమె యొక్క భక్తికి మెచ్చి నీకు ఇష్టం వచ్చిన ఒక వరం కోరుకోమని చెప్పగా ఆమె సదా నిన్ను నేను అర్చించాలి అని ఇక్కడే ప్రతిష్ట అవ్వమని వరం కోరినది. ఆమె కోరిక మేరకు తాను ఇక్కడే ఎల్లపుడూ ఉంటాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. పాలి ప్రాంత పరిపాలకుడు రాజా విక్రమాదిత్య యొక్క ఆరాధనా స్థలం అని కూడా ఇక్కడి ప్రజలు నమ్ముతారు, అతను బన్నా రాజవంశానికి చెందినవాడు. ఒక పెద్ద చెరువు ప్రక్కన ఈ పురాతన శివ మందిరం ఉంది. ఈ ఆలయం తూర్పు వైపు ఉంది మరియు దాని ప్రవేశం అష్టభుజిలో ఉంది. ఈ ఆలయం యొక్క పునాది 5 వేదికలపై ఉంది. ఆ తరువాత కాలం లో 11 మరియు 12 వ శతాబ్దాలలో కల్చురి రాజు జజ్వాల్యాడియో మొదటిసారి మరమ్మతులు చేశాడు. అతని పేరు ఆలయంలో చెక్కబడింది. ఈ ఆలయంలో చెక్కబడిన శిల్పాల యొక్క ఆర్కిటెక్చర్ అబూ హిల్స్ యొక్క జై మందిర్స్ మందిరాలకు చాలా దగ్గర పోలిక ఉంటుంది. ఇది ప్రపంచ ప్రఖ్యాత ఖజురాహో ఆలయానికి కూడా చాలా పోలి ఉంటుంది. మహామండలేశ్వర్ మాల్డియో కుమారుడు అయిన ‘జయమేయు’ అని కూడా పిలువబడే విక్రమాదిత్య దీనిని దాదాపు 870 సం || సమయంలో అతని అధీనంలో ఈ ఆలయం ఉండేది.ఈ ఆలయ ప్రవేశద్వారం దగ్గర ఉన్న చెరువులో తొమ్మిది మూలలు ఉన్నాయి. ఈ చెరువు ఏడాది పొడవునా నీరు ఎప్పడూ ఉంటుంది. ఈ ఆలయం కూడా పూర్తిగా ఎర్ర రాతి తో నిర్మించారు. అందువల్ల ఇప్పటికీ ఈ ఆలయం ఎటువంటి బీటలు కనిపించవు. కానీ కొంత మంది రాజులు ఈ ఆలయం పై కూడా దండెత్తి ఆలయం ద్వంసం చేసిన ఇక్కడి ప్రాంత ప్రజలు ఆ కాలంలో పునః నిర్మాణం చెప్పటారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 5.00-12.00సాయంత్రం : 3.30-8.30
వసతి సౌకర్యాలు :
ఆలయనికి కొద్ది దూరంలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.ఆలయానికి చేరుకునే విధానం :
రోడ్డు మార్గం :
కోర్బా-బిలాస్‌పూర్ రహదారిపై నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.రైలు మార్గం :
ఈ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ బిలాస్ పూర్ రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఈ ఆలయానికి 55 కి.మీ దూరంలో కలదు.విమాన మార్గం :
ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం స్వామి వివేకానంద విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం నుంచి ఈ ఆలయానికి 200 కి.మీ దూరంలో కలదుఆలయ చిరునామా :
శ్రీ శివ ఆలయం,కోర్బా గ్రామం,
బిలాస్ పూర్,
ఛత్తీస్ ఘర్.
పిన్ కోడ్ - 495445
Key Words : Sri Shiva Temple Information, Pali, Korba, Famous Temples In Chhattisgarh, Hindu Temples Guide