Drop Down Menus

మంగళవారం చేయవలసిన పనులు| చేయకూడని పనులు | Do not this mistakes on Tuesday | Hindu Temple Guide

మంగళ వారం చేయవలసిన, చేయకూడని పనులు
మంగళ వారం కొన్ని పనులు చేయాలి, మరికొన్ని చేయకూడదు..
మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రీ పుత్రుడు, భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు… శుభకార్యాలు తలపెట్టరు.
మంగళవారం చెయకూడని పనులు
1.మంగళవారం గోళ్ళు కత్తిరించడం, క్షవరం అలాంటివి చేయకూడదు.
2.మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావడం చాలా కష్టం.
౩.అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు, అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి, తీరకపోయే ప్రమాదం ఉంది.
4.మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు.
5.మంగళవారం అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు. ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుని ధ్యానించి ప్రయాణం సాగించాలి.
6.మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్ధాలు తినకూడదు.
7.మంగళవారం తలంటు స్నానం చేయకూడదు.
8.దైవకార్యాలకు, విద్యా వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు.
మంగళవారం చేయవలసిన పనులు
1.మంగళవారం ఆంజనేయుడిని ద్యానించడం వలన ధైర్యం చేకూరి, అన్ని పనులు అవుతాయి.
2.సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు.
౩.మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది.
4.మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్ధించడం చేస్తే మంఛి ఫలితం ఉంటుంది.
5.జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు.
6. మంగళవారం అప్పు తీరిస్తే..ఆ అప్పు తొందరగా తీరిపోతుంది.
7. మంగళవారం నాడు..మన బ్యాంకు అకౌంట్ లో ఎంతో కొంత మనీ వేయడం వలన అది వృద్ది అవుతూ ఉంటుంది.
8.మంగళవారం రాహుకాలంలో..( మధ్యాహ్నం 3 నుండీ 4.30 వరకు) దుర్గాదేవి దర్శనం.. దుర్గా స్తోత్రాలు పారాయణము చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.
9.హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన, సుబ్రమణ్యస్వామికి పదకొండు ప్రదక్షణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది..
Famous Posts:

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ

 > దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?

ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు 

tuesday, hanuman, tuesday మంగళవారం, tomorrow which god day, tuesday goddess, gods days of the week, which god to worship, tuesday in hinduism, which day is lord krishna day, wednesday goddess
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.