Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వినాయక పూజల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి | How to celebrate Ganesh Chaturthi | Hindu Temple Guide


వినాయక పూజల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
వీధివీధిన మండపాలు లేవు..! పెద్ద పెద్ద విగ్రహాలు లేవు..! సామూహిక ప్రార్థనలు..లేవు..! ఈ ఏడాది వినాయక చవితిపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగానే పడింది. ప్రతి ఏడాది
భారత దేశమంతటా వినాయక చవితిని ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో గణేశ్ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. వాడవాడలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి.. తొమ్మిది రోజుల తర్వాత కోలాహాలంతో వినాయ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే ఈ ఏడాది కొవిడ్ కారణంగా వినాయక చవితి పండగ ఇళ్లకే పరిమితం అయింది. వైరస్ వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మండపాలకు, సామూహిక ప్రార్థనలకు అనుమతులు ఇవ్వలేదు. ఇళ్లలోనే ప్రశాంతంగా వినాయక చవితిని జరుపుకోవాలని మార్గదర్శకాలు ఇచ్చాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో వినాయక చవితి నిర్వహించుకుంటున్నారు. అయితే ఇళ్లలో పండుగచేసుకున్నా కరోనాను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇళ్లలోనూ పూజలు నిర్వహించుకునే సమయంలో ముందు జాగ్రత్త చర్యలను పాటించడం చాలా ముఖ్యం.

సాధారణంగా పండుగ సమయంలో ఎవరైనా బంధువులు ఇళ్లకు వస్తుంటారు. అలాగే ఇంట్లో చేసుకునే స్వీట్స్‌ను స్నేహితులకు ఇచ్చేందుకు వెళ్తూ ఉంటాం. ఇలాంటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పూజలు అందరూ ఒకే దగ్గర కాకుండా దూరదూరంగా కూర్చోవడం మంచిది.
అదే విధంగా ఫేస్-మాస్క్‌లను ధరించాలి. శానిటైజర్‌లను చేతిలో ఉంచుకోవాలి. హ్యాండ్‌షేక్‌లు, కౌగిలింతలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకూ ఎవరినీ ఇంటికి రమ్మనకపోవడమే మంచిది.

ఒకే వేళ ఎవరినైనా పిలిస్తే ఇద్దరు లేదా నలుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడకుండా చూసుకోవాలి. అతిథులను ఒకేసారి రమ్మనకుండా ఒక్కో సారి ఒక్కోక్కొరు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. వీలైతే సందర్శకులు ఇంటి లోపల సమావేశమవ్వకుండా చూసుకోవడం మంచిది. అలాగే గణపతి విగ్రహాన్ని బయటి గదిలో లేదా తలుపుకు దగ్గరగా ఉంచడం మంచిది.

అదే విధంగా పూజ చేసే సమయంలో లోపల ఫ్రెష్ గాలి వచ్చేలా కిటికీలను తెరిచి ఉంచాలి. ఎయిర్ కండిషనర్లను ఆపివేయడం మంచిది. అదే విధంగా కలసి కట్టుగా భోజనం చేయడం మానుకోవడం, స్వీట్లు పంపిణీ చేయడం మానేస్తే మంచిది. వీలైనంత వరకూ మీరు బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లకుండా ఉండడం బెటర్. ఇంట్లో పెట్టిన విగ్రహాలను, పూజా సామాగ్రి మాటిమాటికి ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. బయట నుంచి తెచ్చిన పూజ సామాగ్రిని, విగ్రహాన్ని ఇతర వస్తువులను తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలి. అదే విధంగా బయటకు వెళ్లే బదులు ఇంట్లో విగ్రహాల నిమజ్జనం చేయడం ఎలాగో తెలుసుకోవాలి. వివిధ పద్ధతుల్లో ఇంట్లో వినాయక నిమజ్జనం చేసేలా ప్లాన్ చేసుకోవడం మంచిది.
Famous Posts:
పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

vinayaka chavithi, vinayaka chavithi 2021, vinayaka chavithi 2020, calendar 2021 ganesh chaturthi, ganesh chaturthi 2019 date in india calendar, ganesh chaturthi 2021, how to celebrate ganesh chaturthi, teluguone vinayaka chavithi pooja pdf

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు