చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | Annamayya Keerthanalu | Hindu Temples Guide


అన్నమయ్య కీర్తనలు :

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు |
జాలెల్ల నడగించు సంకీర్తనం ||

సంతోష కరమైన సంకీర్తనం |
సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం |
సంతతము దలచుడీ సంకీర్తనం ||

సామజము గాంచినది సంకీర్తనం |
సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం |
సామాన్యమా విష్ణు సంకీర్తనం ||

జముబారి విడిపించు సంకీర్తనం |
సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం |
శమదమాదుల జేయు సంకీర్తనం ||

జలజాసనుని నోరి సంకీర్తనం |
చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం |
చలపట్టి తలచుడీ సంకీర్తనం ||

సరవి సంపదలిచ్చు సంకీర్తనం |
సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం |
సరుగనను దలచుడీ సంకీర్తనం ||

మరికొన్ని అన్నమయ్య కీర్తనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Postings :



keywords : Annayyamayya Keerthanlu , annamayya history, annamayya lyrics, annamayya keerthanas pdf , annamayya telugu lyrics, keerthanalu, Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS