Drop Down Menus

మిమ్మల్ని బాధపెట్టే వారికి సరైన జవాబు చెప్పండిలా | Chanakya Niti Ethics of Chanakya | Hindu Temple Guide

చాణక్య నీతి : మిమ్మల్ని బాధపెట్టే వారికి సరైన జవాబు చెప్పండిలా..
మనలో చాలా మంది ప్రతికూల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు అవి మనల్ని మరింత వెనక్కి నెట్టేస్తాయి కూడా. అయితే మన దేశంలో చాలా మందికి ఒక అలవాటు ఉంది.
తాము బాగుపడకపోయినా పర్వాలేదు. తమ ఎదుటి వారు మాత్రం బాగుపడకూడదు. ఇలాంటి అలవాట్ల వల్ల మనలో చాలా మంది జీవితంలో పైకి ఎదగలేకపోతున్నారు.

మనం ఎప్పుడూ ఏ పని చేసినా.. కొంతమందికి అస్సలు నచ్చదు. అందుకే వారు మనకు నచ్చినా కూడా మనకు అది నచ్చకుండా చేయడానికి రకరకాల పోలికలు, ఎన్నో కారణాలు చెబుతూ ఉంటారు. చివరికి వారి పంతం నెగ్గేలా ప్రయత్నిస్తారు. ఇలాంటి వారిలో బంధువులు ఎక్కువగా ఉంటారు.

అంతేకాదు మన వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయంలోనూ తలదూర్చి అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. 'నా చావు నేను చస్తా' అన్నా కూడా అస్సలు వినరే. ఎందుకంటే మనల్ని బాధపెట్టడమే వారి పని కాబట్టి. ఇలా మీరు నిత్యం ఇలాంటి వారి గురించి బాధపడుతున్నారా? అయితే ఇలాంటి వారిని వారి దారిలోనే వారిని ఎలా బోల్తా కొట్టించాలో చాణక్యుడు కొన్ని చాణక్య నీతులు చెప్పాడు. అవేంటో మీరే చూడండి..
బాధపెట్టే వారిని గుర్తించాలి..
ముందుగా మీ చుట్టూ ఎవరైతే నెగిటివ్ గా ఉన్నారో వారిని మీరు గుర్తించాలి. ఎందుకంటే వారు ప్రతికూలంగా మాట్లాడి మిమ్మల్ని ఎప్పుడూ నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అంతా తమకే తెలుసన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారి మాటలు విని చాలా మంది తమ లక్ష్యాలను అధిగమించలేకపోయారు.

మానసికంగా బలహీనంగా..
‘దుర్జనేషు చ సర్పేశు వరం సర్పో న దుర్జనహ.. సర్పో దషాటి కాలేన్ దుర్జనస్తు పదే పదే‘ అంటే పాము ఒక్కసారి మాత్రమే కాటు వేస్తుంది. కానీ నెగిటివ్ ఆలోచనలు ఉండే వారు మాత్రం పదే పదే నెగిటివ్ మాటలు చెబుతూ మానసికంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది నెగిటివ్ గా ఉండే వారి లక్షణం.
సహజ ప్రవర్తన..
ఈ ప్రపంచంలో అందరికీ అన్ని విషయాలు నచ్చాలని ఎలాంటి రూల్ లేదు. మీకు ఎలాగైతే కొన్ని విషయాలపై సదాభిప్రాయం లేకుండా ఉంటుందో.. అలాగే ఎదుటి వ్యక్తులకు కూడా అలాంటి అభిప్రాయాలే ఉంటాయి. కాబట్టి మీ గురించి ఎల్లప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మీ బలాన్నే నమ్ముకోండి..
మీరు ఏదైనా పని చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా విషయం గురించి ఆలోచించేటప్పుడు ఇతరులు చెప్పే విషయాలను పూర్తిగా వినండి. అందులో కొందరు మిమ్మల్ని నిరుత్సహాపరిచే మాటలు చెప్పొచ్చు. మరికొందరు మీకు ఉపయోగపడే సలహాలు ఇవ్వొచ్చు. కాబట్టి వాటిలో ఏది మంచో ఏది చెడో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముందుగా పక్కనవారి కంటే మీ బలాన్నే నమ్ముకోండి. మీరు విశ్వాసంగా ముందడుగు వేయండి.
పాజిటివ్ థింకింగ్..
మీ చుట్టూ ఉండే వారు ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచిస్తే, మీరు కూడా అలాంటివే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు అలాంటి వారి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముందుగా మీరు మీ మనసులో పాజిటివ్ థింకింగ్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
కొన్నిసార్లు నెగిటివ్..
అయితే కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఆలోచనలు కూడా అవసరం అవుతాయి. ఎందుకంటే మీ చుట్టూ ఎప్పుడూ సానుకూల వ్యక్తులు, సానుకూల శక్తి ఉంటే, మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడొచ్చు. ‘నేను ఏదైనా చెయ్యగలను. నాకు ఎదురేలేదు‘ అనుకునే అవకాశాలున్నాయి. అందుకే అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ నుండి దూరంగా ఉండొచ్చు. దీని వల్ల మీ జీవితంలో ఫెయిల్యూర్స్ చాలా తక్కువగా ఉంటాయి.
మిమ్మల్ని టార్గెట్ చేస్తే..
మీరు ఏ పని చేసినా.. మీరు ఎంత పర్ఫెక్ట్ గా చేసినా మిమ్మల్ని ఇష్టపడని వారు లేదా మిమ్మల్ని బాధపెట్టేవారి నుండి నెగిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.వారు మాటలతో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు మీరు మీ మొబైల్ వాల్ పేపర్లో లేదా ఆఫీసులో డెస్క్ పైనా లేదా మిమ్మల్ని మోటివేట్ చేసుకునే ఓ నోట్స్ లో ‘Your Words Can Never Hurt Me' అని రాసేయండి. దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది.
అంతా సవ్యంగా జరిగితే..
జీవితం అన్నాక అన్నీ సాఫీగా సాగిపోవు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు అనేవి సాధారణంగా ఉంటాయి. మీరు ఎన్ని కష్టాలను ఎదుర్కొంటే, మీరు అంత మెరుగవుతారు. మీకు నెగిటివ్ పీపుల్స్ ఎదురైనప్పుడు ఇలాంటి మాటలను గుర్తు చేసుకోండి. మీ ఎదుగుదలకు వచ్చే అడ్డంకులు అని భావించండి. కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. అప్పుడే మీ జీవితంలో విజయం సాధిస్తారు. మీ జీవితం సంతోషకరంగా మారుతుంది.
Related Posts:
కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు.

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు 


చాణక్యుడు నీతి సూత్రాలు, neeti sutralu telugu, chanakya neeti sutralu telugu pdf, chanakya telugu, chanakya story in telugu pdf, chanakya arthashastra telugu, neethi sastram in telugu, kautilya arthashastra in telugu pdf, chanakya telugu quotes, చాణక్యుడు
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments