Drop Down Menus

అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు | Importance of annadhanam | Dharma Sandehalu

అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు

అన్నము అంటే ఏమిటి ?

అన్నదానం అంటే ఏమిటి ?

అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా ?

అన్నదాన మహిమ చెప్పే కథ

అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...

అన్నము అంటే ఏమిటి ?

అన్నం పరబ్రహ్మ స్వరూపం !

మనలో చాలా మందికి " అన్నము " అంటే తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.

అవి అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబందించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణ శక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం.

అంతే కాదు తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూతజాతములు జనించు చున్నవి. అన్నము వలననే జీవించు చున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించు చున్నవి లేక లయించు చున్నవి అని చెప్పబడి ఉంది . మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు అని అర్ధం చేసుకోవాలి .

Also Readశివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది? 

అన్నదానం అంటే ఏమిటి ?

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే . కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి . ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది .

అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా ?

అన్నము ఇతర ఆహార పదార్ధాలను విక్రయించడం మహా పాపం అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందుకే అన్నము దానము మాత్రమే చేయాలి కానీ అమ్మకూడదు .

అన్నదాన మహిమ చెప్పే కథ

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.

ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు.

బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః

Famous Posts:

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?

 

భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి. 


తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌


చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?


ఇంట్లో పూజ ఎవరు చేయాలి?


ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?


పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...


శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం


ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను |  ధన దేవతా స్తోత్రం


annadanam meaning, annadhanam, Importance of annadhanam, annadanam benefits, Significance of Annadanam, అన్నదానం

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. దయచేసి పోస్ట్ కు తగిన టైటిల్ పెట్టండి.
    అన్నదానంలో 100 మందిలో 99 మంది చేసే తప్పు ఎక్కడ చెప్పారు. మీరు చాలా ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. క్లిక్ ల కోసం ఆకర్షణీయమైన టైటిల్ పెట్టండి . కానీ మీరుకూడా ఇతర ఛానెల్ లాగ ఆకర్షించడం కోసం సంబంధం లేని టైటిల్ మాత్రం పెట్టకండి.

    ReplyDelete
    Replies
    1. బాప్ బోజనాలు పెట్టకూడదు ఇంటికి వచ్చిన అతిథికి కూర్చో బెట్టి ఫలహారాలు ఇవ్వాలి

      Delete
  2. మీరు పెట్టిన టైటిల్ ఏమిటి..

    పెట్టిన మేటర్ ఏమిటి

    ReplyDelete
    Replies
    1. annadanam valana labhaau ani pettalu lekapote punyam ani title pettali chase tappulu ani title pettakudu misguide cheyakudadu janalanu

      Delete
  3. Title is different...depth Is different

    ReplyDelete


  4. కొంచెం ఉన్నతంగా ఆలోచించండి... పులి చంపేస్తుంది అని తెలిసిన బ్రాహ్మణుడికి కావాలి కాసాడు కానీ అతనికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు.. కానీ
    ప్రస్తుత కాలంలో కొందరు పేరుకు చెప్పుకోవటానికి మాత్రమే అన్నదానం చేస్తున్నారు. సంతృప్తి కరమైన భోజనం పెట్టి నిండు మనసుతో వారి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నేను పెట్టిందే తినాలి లేక నా దగ్గర డబ్బులు వున్నాయి నేను నలుగురికి అన్నం పెడుతున్న అని కాదు. ఒక్కరికి పెట్టిన సరే ఆ సమయంలో వారికి సేవకుల లాగా మారీ వారు తృప్తిగా భోజనం చేసేలా చూడాలి

    ReplyDelete
  5. అలా చేయనప్పుడు అన్నదానం చేసి వృదా అవుతుంది. అక్కడ నువ్వు చేసిన మంచి కనిపించదు నీలోని అహం కనిపిస్తుంది.

    ReplyDelete

Post a Comment