Drop Down Menus

దేవుడు చూస్తున్నాడు | Telugu Devotional Story | Sanatana Dharmam | Hindu Temple Guide

దేవుడు చూస్తున్నాడు

మనిషి జన్మించిన సమయం నుండి అంతిమ శ్వాస విడిచే వరకూ .ఆరాటం. జీవన పోరాటం .ప్రాణాలతో చెలగాటం చేస్తుంటాడు. .కొత్తదనం కోసం.. ప్రయత్నం.. పాత ఇల్లు కారు వస్తువులు అస్తులు మనుషులు ఉద్యోగం, బంధువులతో సరిపెట్టుకోక.. ఉన్నదానితో తృప్తి పడకుండా నిరంతర ప్రయత్నం చేస్తూ.జీవిత లక్ష్యం మాత్రం మరచిపోతున్నాడు..

తెలియనిదాన్ని దొరికించుకునే మార్గంలో బాల్యం నుండీ వృద్ధుడయ్యేవరకు సాధన చేస్తూనే ఉన్నాడు.. ఒకటి సాదించాక ఇది కాదు..ఇది సరిపోదు.. ఇంకా కావాలి.. ఇంకా చూడాలి ఇంకా సంపాదించాలి ..ఇలాంటి అంతులేని కథల సారాంశం ఏమిటి..అసంతృప్తి అనే జవాబు వస్తుంది.. మరి తృప్తి ఎలా కలుగుతుంది అన్న ప్రశ్నకు జవాబు భగవద్భక్తి మాత్రమే అని చెప్పవచ్చును.. మన ప్రయత్నం బాహ్యంగా దొరికే లౌకిక ఆనందాల కోసమే ..అవుతోంది.. ఉద్యోగాలు చదువులు గ్రామాలు పరిశోధనలు.

ఇళ్ళు. మనుషులు. ఇలా ఎన్నెన్నో తెలియనివాటికోసం సాధించి దొరికించుకుంటాం.. కానీ దేవుని విషయంలో మాత్రం ఆ ప్రయత్నం చెయ్యం.. కనీసం ఆలోచన కూడా చేయడానికి సాహసించం. .అందరిలో అన్నింటిలో అంతటా నీలో నాలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో పంచభూతాల్లో దైవశక్తి ఉందని. అందుకే ఈ జగతి .లోని చరాచర ప్రాణులు. అందంగా ఆనందంగా శోభిల్లుతున్నాయని మనకు తెలుసు.. కానీ విశ్వసించం! ..గదిలో ఒంటరిగా ఉండి ఎవ్వరికీ తెలీకుండా మనం చేసే ప్రతీ పనిని దైవం గమనిస్తుంది. అన్న విషయం నమ్మలేం కదా !.. అందుకే ఈ ఆందోళనలు. అలజడులు..అల్లరులు.! "దేవుడు చూస్తున్నాడు" అన్న ఒక్కవిషయం గుర్తుంటే మనం చెడ్డపనులు.

ఇతరులను బాధించే చర్యలు చేయలేం.! కుటుంబ సభ్యులను స్నేహితులను అపరిచితులను నమ్ముతాం కానీ మనకు ఇన్ని వసతులు. సంపదలను ఇచ్చిన దేవుని ఉనికిని మాత్రం నమ్మం !..." ఇదంతా దేవుడిచ్చిన వైభవమే "అని అనడం వేరు.. !నమ్మడం వేరు...! నమ్మకం అనేది ఆచరణ ద్వారా మాత్రమే తెలుస్తుంది.

Also Readఇంట్లో పూజ ఎవరు చేయాలి? 

అప్పుడు లక్షల డబ్బు వచ్చినా పోయినా బాధ ఉండదు.. ఎంత విశ్వాసమో అంత ఫలితం.. దేవుని విషయంలో కూడా అంతే.. !దైవాన్ని నమ్మి చెడినవాడు లేడు.!. అయ్యప్ప భక్తులు కానీ. దుర్గాభవాని భక్తులు కానీ హనుమాన్. సుబ్రహ్మణ్య వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ తమ దీక్షసమయంలో అంతులేని దైవబలాన్ని ఆత్మానందాన్ని.. అభీష్ట పలితాలని పొందుతూ ఉంటారు..!ఇష్టదైవాన్ని తమలో భక్తులు ఆవహింప జేసుకుంటారు.

నోములు వ్రతాలు చేసే స్త్రీల నమ్మకానికి దైవం చక్కని సత్ఫలితాలను ఇస్తుంది కూడా.. ప్రయత్న లోపం లేకుండా త్రికరణ శుద్ధితో చేసే ప్రతీ పనికి దైవం తోడుగా ఉంటుందని మనకు తెలుసు. దేవుడు ఎక్కడఉన్నాడు.?. ఆంటే .మన నమ్మకం లొనే ఉన్నాడు .! ఎందుకు కనపడడు.?. ఆంటే అతడు నిరాకారుడు.. సఛ్చి దానందస్వరూపుడు! ఆకారం అంటూ ఉండదు కానీ ఎవరు ఏ ఆకారాన్ని ఆరాధిస్తారో ఆ రూపంలో దైవం వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది...!

Also Read పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...

అందుకే బాహ్యంలో భావంలో. ఎవరు ఆనందంగా సంతృప్తిగా ప్రశాంత చిత్తంతో ఉంటే వారే దైవ స్వరూపులు.!. పోతే ఈ సాధన ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉన్నట్టుగా భక్తి తత్వం హృదయంలో అంతరంగంలో నిండిపోవాలి.. దైవం కోసం నిత్యం అన్వేషణ చేస్తూనే ఉండాలి.. కళ్ళుమూసినా కళ్ళు తెరిచినా ఏ పని చేస్తున్నా ఏ వస్తువు ను చూసినా మూలకారణభూతమైన ఆ పరమాత్ముని దివ్యదర్శనం చేయగలిగితే అదే పరమ పద సోపానం..! ఆదే మన జీవిత లక్ష్యం.!. అదే మానవజన్మ సార్థకత ! పరమావధి !... అందుచేత. పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముదాం. !

మనలో ఉండి మనల్ని నడిపించేవాడు ,మన ప్రాణాధారము ,..సకల ప్రాణుల మనుగడకు ఆధారభూతమైనవాడు ,.అంతర్యామిగా మనలో ఉంటూ .మనం చేసే చర్యలకు సాక్షిగా ఉంటున్నవాడు , ..ఆ జగదానంద కారకుడు.అన్న నమ్మకం ఆలోచన ఆచరణ అంతరంగంలో ఉంటే చాలు.కదా.. జన్మధన్యం కావడానికి..! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ..! శివాయ గురవే నమః

Famous Posts:

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ. 

దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!

సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్

చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు 

పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే  

ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి.. 

కాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?

పూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? 

dharma sandehalu telugu, dharma sandehalu telugu book, dharma sandehalu questions, సనాతన ధర్మం, sanatana dharma book in telugu, sanatana dharma book in telugu, dharmam meaning in telugudharmam ante emiti in telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.