కార్తీకమాసంలో ఉసిరి చెట్టు నీడన భోజనాలు ఎందుకు చేయాలి ? Importance of Amla Tree In the Karthika Masam | Karthika Vanabhojanalu

కార్తీకవనభోజనాలు
కార్తిక_మాసం లో ఉసిరి_చెట్టు కు పూజ చేయటం, ఉసిరికాయ పచ్చడి తినటం ప్రధానమైన నియమంగా చెబుతారు.. 

ఉసిరి కి, కార్తీక_మాసానికి ఉన్న పవిత్ర సంబంధం గురించి మన పురాణాలు అనేక రకాలుగా వివరిస్తున్నాయి.

ఇదే విధంగా కార్తిక_మాసం లో వన భోజనాలకు ఉసిరి_చెట్టు కు మధ్య కూడా ధర్మ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన కారణాలు ఉన్నాయి..

పెద్దలు చెబుతున్న ప్రకారం కార్తీక_మాసం లో వనభోజనాలు తప్పనిసరిగా చేయాలి, అదీ కూడా ఉసిరి వనం లో… లేదా చెట్టు కింద వన భోజనం చేయాలి.. ఉసిరి చెట్టు, మారెడు చెట్టు  రెండూ ఉన్న చోట వన భోజనాలు చేస్తే మరీ మంచిది… పుణ్యప్రదం ఇంకా ఆరోగ్యం కూడా...

వనంలో భోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది..
ఈ ఉసిరి_చెట్టు నే ధాత్రీ వృక్షం., ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వన భోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది..  ధాత్రీ వృక్షాల నీడన, ఇతర వృక్షాల నడుమన అరటి ఆకుల్లో కానీ, పనస ఆకుల్లో కానీ భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని పురాణాల వచనం.

సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యం లో కార్తీక_పౌర్ణమి నాడు ఉసిరి_చెట్టు క్రింద వన భోజనాలను చేసినట్లు కార్తీక_పురాణం లో వర్ణించ బడినది.. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను… తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది..
వనభోజనాలసమయంలోపాటించాల్సిననియమాలు.. 

వన_భోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి_చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వన భోజనాలను చేస్తారు..

ఉసిరి_చెట్టు క్రింద శ్రీ మహా విష్ణువును ఉసిరికాయ లతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్న తోటలో వన భోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగి పోతాయి..

ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీక_మాసం లో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీ దేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి.. ఉసిరి_చెట్టు మీద ఈ కార్తీక_మాసం లో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల్లో చెప్పారు..

ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు..
వన_భోజనం అంటే... అరణ్యంలో ఉన్న వృక్షాల దగ్గరకు వెళ్లి భోజనం చేయటాన్ని వన_భోజనం అంటారు.. 

దీని వెనక ఒక పరమార్థం ఉంది.. ప్రకృతి మనకు ఆరోగ్యము ఇస్తుంది. అదే విధంగా ఉపద్రవాలు కూడా కలగజేస్తుంది.. మనకు ఎల్లప్పుడు ఆరోగ్యాన్ని కలగజేస్తూ.. ఉపద్రవాల నుంచి తప్పించమని మనం కనీసం ఏడాదికి ఒక సారైనా ప్రకృతిని కోరుకోవాలి.. దీనికి అరణ్యం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది..

వనము, అన్నము పరబ్రహ్మ స్వరూాపాలే
కార్తిక_మాసం లో వన భోజనాలు పెడతారు... దీనికి వేదాంతంలో మరో అర్థం కూడా చెబుతారు. వనం అంటే పరబ్రహ్మం. అన్నం కూడా పరబ్రహ్మమే. అందుకే ఈ రెంటినీ ఒకే చోట చేర్చి ఆరాధించడం లోని పరమార్థమే వన_భోజనాలు అని చెబుతారు..

దీనికి మరొక కోణం కూడా ఉంది. సాధారణంగా వానప్రస్థాశ్రమం అంటే.., అరణ్యంలో ఎవరికీ సంబంధం లేకుండా రాగ ద్వేషాలను విడిచిపెట్టి ఉండగలిగే ఆశ్రమం… అందుకే మన ఋషులు, మునులు వనాలను వేదికగా చేసుకుని నివాసం సాగిస్తూ తపోనిష్ట తో భగవంతుని ఆరాధిస్తారు.. అందుకే వారు సిద్ధ పురుషులుగా పిలువబడుతున్నారు.
మనం కూడా జీవితంలో ఈ లౌకిక ప్రపంచం నుండి దూరంగా వెళ్లి గడిపితే మన అంతరంగం అంతా ప్రక్షాళన అవుతుంది.. దీనికి తోడు ప్రశాంతమైన వాతావరణంలో భగవదారాధన చేస్తుంటే ఆ అనుభూతి వేరు కదా… అంతే కాకుండా వన_భోజనాలు మనుషులను మాససిక వత్తిడుల నుండి దూరంగా ఉంచుతాయి.. బంధుమిత్రులతో ఆత్మీయ సంబంధాలను పెంచుతాయి..

పూర్వీకుల నిర్వచనం ప్రకారం ఆశ్రమం మారటం అంటే – ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకున్నట్లు అర్ధం.. 

ఉదాహరణకు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి మారడం… వానప్రస్థానికి వెళ్లటం అంటే గృహస్థాశ్రమం వీడి మరోక లోకానికి వెళ్లడం… ఇలాంటి మార్పులకు సాధన కావాలి.. ఈ సాధనలో ఒక భాగంగా ఈ వన_భోజన కార్యక్రమాలను మన పురాణ గ్రంధాలు కూడా నిర్వచిస్తున్నాయి..

శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు.. ఇలా మనం ఆరాధించుకునే దేవతలందరూ కూడా వన_భోజనాలలో పాల్గొన్నవారే...
Famous Posts:

karthika masam 2020, vanabhojanalu in telugu, vanabhojanam meaning in telugu, vana bhojanam in english, vanabhojanalu in english, vanabhojanalu meaning in english, కార్తీకమాసం, ఉసిరి చెట్టు, వన భోజనం.

Comments